Arjun Chakravarthy Teaser Launch
‘అర్జున్ చక్రవర్తి' సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉంటుంది. అందరికీ నచ్చుతుంది. బ్లాక్ బస్టర్ కొడుతున్నాం: టీజర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ విక్రాంత్ రుద్ర &టీం
విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి'. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి. ఈ రోజు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హను రాఘవపూడి సినిమా టీజర్ ని లాంచ్ చేశారు. ఓ కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా తీసుకొని రూపొందిన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులని కట్టిపడేసింది. సినిమాని బిగ్ స్క్రీన్‌పై చూడాలనే క్యురియాసిటీని టీజర్ మరింతగా పెంచింది.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ విక్రాంత్ రుద్ర మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఒక తల్లి బిడ్డకు జన్మనివ్వడానికి 9నెలలు మోస్తుంది. నేను కూడా ఈ సినిమాని మీకు చూపించడానికి తొమ్మిదేళ్లుగా మోశాను. నేను 12 ఏళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడు ఒక పర్సన్ ని కలిసాను. ఆ పర్సన్ పేరు అర్జున్ చక్రవర్తి. ఆయన దగ్గర నేను కబడ్డీ ట్రైనింగ్ కోసం వెళ్ళినప్పుడు ఆయన ఒక కథ చెప్పారు. అది నా మనసులో అలాగా నాటుపోయింది. ఆ కథని ఎలాగైనా ప్రపంచానికి చెప్పాలి భావించను. అలా ఈ కథ నేను డైరెక్టర్ కావడానికి డ్రైవ్ చేసింది. నిర్మాత శ్రీని గారికి కథ చెప్పిన తర్వాత ఆయనకి నచ్చింది. వెంటనే ఓకే చెప్పారు. నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. నేను అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువైంది. అయినప్పటికీ ఆయన ఎక్కడ కూడా రాజీ పడకుండా ప్రాజెక్టుకు కావలసిన ప్రతిదీ అద్భుతంగా సమకూర్చారు. ఆయన సపోర్ట్ లేకుండా ఈ సినిమా నేను చేసే వాడినే కాదు. ఈ ఆరేళ్ల జర్నీలో ఆయన ప్రతి మూమెంట్ లో సపోర్ట్ చేశారు. ఈ సినిమాని 120 లొకేషన్స్ లో షూట్ చేశాం. మా హీరో విజయ్ గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఎలాంటి ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలన్నా అది చేసి చూపించారు. మైనస్ డిగ్రీల్లో షూట్ చేసాం. డిఓపి జగదీష్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేసాడు. మేము అనుకున్నది తీయడానికి ఎంతకైనా సాహసించారు. సినిమాలో మ్యూజిక్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఉంటుంది. మా హీరోయిన్ సిజ్జా రోజ్ చాలా హార్డ్ వర్క్ చేసింది. సినిమా కోసం తెలుగు కూడా నేర్చుకుంది. ఈ సినిమా ప్రొడక్షన్ డిజైన్ అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా సినిమా టీజర్ లాంచ్ చేసిన డైరెక్టర్ హను గారికి ధన్యవాదాలు. ఈ సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉంటుంది. అందరికీ నచ్చుతుంది. బ్లాక్ బస్టర్ కొడుతున్నాం. ఇది నా ప్రామిస్'అన్నారు.
హీరో విజయరామరాజు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మా టీజర్ ని లాంచ్ చేసిన హను గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా ఉందని చెబుతున్నారు. ఇది చాలా ఆనందాన్నిచ్చింది. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ చాలా అద్భుతమైన వర్క్ చేశారు. మ్యూజిక్. విజువల్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. హీరోయిన్ సిజ్జా ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసింది. ఈ సినిమాతో తనకు మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. అజయ్ గారు, దయ గారు, అజయ్ ఘోస్ గారు వీళ్లంతా కూడా మా సినిమాకి ప్లస్ అయ్యారు. మా నిర్మాత శ్రీని గారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని అద్భుతంగా రూపొందించారు. నేను ఏడాదిన్నర పాటు ప్రో కబడ్డీ టీమ్స్ తో ట్రావెల్ అయ్యి రియల్ గా గేమ్ నేర్చుకుని ఈ సినిమా చేయడం జరిగింది. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం సిక్స్ ప్యాక్ చేయాల్సి వచ్చింది. ఇవంతా మా డైరెక్టర్ గారు మా నిర్మాత సపోర్ట్ తోనే సాధ్యమైయింది. మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా నిర్మాతకి ధన్యవాదాలు. నా జీవితంలో గుర్తుండిపోయే సినిమా ఇది. ఇంత మచి క్యారెక్టర్ ఉన్న సినిమా రావడం చాలా అరుదు. మా డైరెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ సినిమాలో నేను ఏదైనా పర్ఫామెన్స్ చేశానంటే అది మా డైరెక్టర్ గారి వల్లే. ఆయన అద్భుతంగా మలుచుకున్నారు. చాలా డెడికేటెడ్ డెడికేషన్ తో ఈ సినిమా తీశారు. నిరంతరం సినిమా కోసమే తపించారు. ఈ సినిమా క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతుంది. చాలా మంచి సినిమాది. చాలా కష్టపడి చేశాం. మీరందరూ సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్తారని మనస్పూర్తిగాకోరుకుంటున్నాను అందరికీ థాంక్యు'అన్నారు
ప్రొడ్యూసర్ శ్రీని గుబ్బల మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. డైరెక్టర్ ఈ కథ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. ఈ సినిమా కథ చెప్పినప్పుడు గానీ తీస్తున్నప్పుడు గానీ ఎక్కడ కూడా డ్రాప్ అయినట్లు అనిపించలేదు. అందుకే ప్రొడక్షన్ లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాని చేయడం జరిగింది. విజయ్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు. ఆయన హార్డ్ వర్క్ టీజర్ లో మీరందరూ చూశారు. చాలా అద్భుతమైన విజువల్స్, ఎమోషన్స్, కథ ఉన్న సినిమా ఇది. అజయ్ గారు కోచ్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. అలాగే హీరోయిన్ సిజ్జా రోజ్ గారు చాలా నేచురల్ గా ఈ క్యారెక్టర్ ని చేశారు. అందరూ కూడా మీ ఇంట్లో ఒక అమ్మాయిగానే భావిస్తారు. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమాకి మీరంతా సపోర్ట్ చేయాలని కోరుతున్నాను'అన్నారు.
హీరోయిన్ సిజ్జా రోజ్ మాట్లాడుతూ... అందరికి నమస్కారం. ఇది నా ఫస్ట్ తెలుగు సినిమా. మీ అందరి సపోర్ట్ కావాలి. ఇది ఒక ఐదేళ్ల జర్నీ. చాలా ప్యాషన్ తో పనిచేసాం. చాలా హార్డ్ వర్క్ చేశాం. మా నిర్మాత ఎంతగానో సపోర్ట్ చేశారు. ఆయన సపోర్ట్ లేకపోతే ఈ సినిమా అయ్యేది కాదు. మా డైరెక్టర్ గారు తన విజన్ ని అద్భుతంగా చూపించారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది'అన్నారు.
యాక్టర్ దుర్గేష్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమాలో అవకాశం రావడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డారు. చాలా ఫ్యాషన్ తో ఈ సినిమా చేశారు. ఎక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా తీశారు. విజయ్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేసాడు. మీ అందరి ఆశీర్వాదం కావాలి. ఈ సినిమాను తప్పకుండా అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను
మ్యూజిక్ డైరెక్టర్ విగ్నేష్ భాస్కరన్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఎన్నో ఏళ్ల కృషికి ఫలితం ఈ సినిమా. అందరూ ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. ఒక మంచి ఎమోషనల్ జర్నీ ఇది. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు .బిగ్ స్క్రీన్ లో ఈ సినిమాని మీరందరు ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాను. అందరికీ థాంక్యు.
డిఓపి జగదీష్ మాట్లాడుతూ.. అర్జున్ చక్రవర్తి చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇంత మంచి సినిమాలో వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. టీమ్ అందరికీ థాంక్యు. విజయ్ చాలా డెడికేషన్ తో ఈ సినిమాని చేశారు. డైరెక్టర్ గారు ఈ కథ చెప్పినప్పుడే చాలా ఇన్స్పిరేషన్ గా అనిపించింది. మా ప్రొడ్యూసర్ గారు చాలా సపోర్ట్ చేశారు .ఈ సినిమాకి ఎన్నో అవార్డులో వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఆడియన్స్ సపోర్ట్ కూడా ఉంటుందని ఆశిస్తున్నాను. అందరికీ థాంక్యు'అన్నారు.
The teaser of #ArjunChakravarthy is interesting. Set against the backdrop of 1980s India, when Kabaddi was at its peak, the film is a gripping sports drama inspired by a real-life story. The teaser highlights the relentless grit and unwavering passion needed to stay the course… pic.twitter.com/MvBBohzYpx