pizza

Arjun Chakravarthy Teaser Creates a Sensation
సెన్సేషన్ క్రియేట్ చేసిన అర్జున్ చక్రవర్తి టీజర్

You are at idlebrain.com > news today >

28 July 2025
Hyderabad

Sports dramas have always enjoyed a special craze. As long as the story and narration are engaging, even a small-budget film in this genre can achieve big success. After watching the teaser of Arjun Chakravarthy, that’s exactly the feeling it gives.

Vijay Ramaraju plays the title role in this film. Based on the real-life story of a Kabaddi player, the teaser grips you right from the first frame to the last.

During the 1980s, Kabaddi witnessed a golden era in India. Arjun Chakravarthy was the mastermind behind the country’s series of victories. But his life suddenly takes a downward turn. A player who could win matches single-handedly quits the sport due to personal reasons. What exactly happened in his life? Did Arjun ever return to the Kabaddi court? These questions are presented brilliantly in the teaser.

Vijay Ramaraju has completely transformed into the role of Arjun Chakravarthy. His performance and physical transformation are simply unbelievable.

Director Vikrant Rudra has crafted Arjun Chakravarthy with great skill, and the teaser reflects that. Every emotion touches the audience deeply.

Producer Srini Gubbala seems to have made the film with a lot of passion — the production quality speaks volumes. Vignesh Baskaran’s background score and Jagadeesh Cheekati’s cinematography are top-class. The teaser gives the experience of a big-scale film. The movie has already won 46 international film awards.

The teaser has significantly raised curiosity to watch Arjun Chakravarthy on the big screen.

The film has completed all post-production formalities and is gearing up for release soon.

సెన్సేషన్ క్రియేట్ చేసిన అర్జున్ చక్రవర్తి టీజర్

స్పోర్ట్స్ డ్రామాలకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. ప్రేక్షకులను ఆకట్టుకునే కథ, కథనం ఉండాలే కానీ ఈ జానర్‌లో చిన్న సినిమా కూడా పెద్ద విజయం సాధిస్తుంది. ‘అర్జున్ చక్రవర్తి' టీజర్ చూసిన తర్వాత ఇదే ఫీలింగ్ కలిగింది.

విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన సినిమా ఇది. ఓ కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా తీసుకొని రూపొందుతున్న ఈ మూవీ టీజర్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు కట్టిపడేసింది.

1980లలో భారత్‌ కబడ్డీ ఓ స్వర్ణయుగం చూస్తుంది. దేశానికి వరుస విజయాలు సాధించిపెట్టడంలో మాస్టర్ మైండ్ అర్జున్ చక్రవర్తి. అలాంటి అర్జున్ జీవితం ఒక్కసారిగా తలకిందులు అవుతుంది. ఒంటి చేత్తో మ్యాచ్‌ని గెలిపించే అర్జున్, ఏవో వ్యక్తిగత కారణాల వల్ల ఆటను వదిలేస్తాడు. అసలు తన జీవితంలో ఏం జరిగింది? అర్జున్ మళ్లీ కబడ్డీ బరిలో దిగాడా లేదా? అనేది ఈ టీజర్‌లో చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు.

‘అర్జున్ చక్రవర్తి' పాత్రలో విజయ రామరాజు ఒదిగిపోయారు. ఆయన పెర్ఫార్మెన్స్‌, ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అన్‌బిలీవబుల్‌గా ఉంది.

డైరెక్టర్ విక్రాంత్ రుద్ర ‘అర్జున్ చక్రవర్తి'ని ఎంత అద్భుతంగా మలిచారో ఈ టీజర్ చూస్తే అర్థమవుతుంది. ప్రతి ఎమోషన్‌ ఆడియన్స్‌ని తాకుతుంది.

నిర్మాత శ్రీని గుబ్బల చాలా ప్యాషన్‌తో ఈ సినిమా తీశారని ప్రొడక్షన్‌ క్వాలిటీ తెలియజేస్తోంది. విఘ్నేష్ బాస్కరన్ బీజీఎం, జగదీష్ చీకాటి సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్‌లో ఉన్నాయి. టీజర్ ఒక బిగ్ స్కేల్ సినిమా చూసిన అనుభూతిని కలిగించింది. ఇప్పటికే ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి.

‘అర్జున్ చక్రవర్తి'ని బిగ్ స్క్రీన్‌పై చూడాలనే క్యురియాసిటీని టీజర్ అమాంతం పెంచింది.

అన్ని పోస్ట్ ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved