Glimpse of Actor Satya's 'Betting Bhogi' Character Released from Aha's Superhit Web Series "Three Roses" Season 2
ఆహా ఓటీటీ సూపర్ హిట్ వెబ్ సిరీస్ "త్రీ రోజెస్" సీజన్ 2 నుంచి యాక్టర్ సత్య 'బెట్టింగ్ భోగి' క్యారెక్టర్ గ్లింప్స్ రిలీజ్
The web series "Three Roses," starring Eesha Rebba, Satya, Harsha Chemudu, Prince Cecil, Hema, Satyam Rajesh, and Kushita Kallapu in lead roles, was a superhit on Aha OTT platform. Now, the series is returning with its second season. Produced by Mass Movie Makers under the banner of SKN, the series has director Maruthi serving as the showrunner. The story and screenplay have been penned by Ravi Namburi and Sandeep Bolla, with Kiran K Karavalla directing the show.
Today, a glimpse of actor Satya’s character ‘Betting Bhogi’ from "Three Roses" Season 2 was released. Despite being busy with prestigious projects like "Vishwambhara," "Raja Saab," and "Peddi," Satya chose to be part of this web series because he liked the content. This marks Satya’s first appearance in a web series under the Mass Movie Makers banner. In the series, he plays the husband of heroine Raashi Singh.
The glimpses of Satya’s character ‘Betting Bhogi’ are hilarious and have entertained audiences. As a character who bets on cricket matches, Satya reminds us of many such people we come across in real life. The scenes between Raashi Singh and Satya promise to offer full entertainment. "Three Roses" Season 2 is all set to stream soon on Aha OTT.
ఆహా ఓటీటీ సూపర్ హిట్ వెబ్ సిరీస్ "త్రీ రోజెస్" సీజన్ 2 నుంచి యాక్టర్ సత్య 'బెట్టింగ్ భోగి' క్యారెక్టర్ గ్లింప్స్ రిలీజ్
ఈషా రెబ్బా, సత్య, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ "త్రీ రోజెస్". ఆహా ఓటీటీలో సూపర్ హిట్టయిన ఈ సిరీస్ కు ఇప్పుడు సీజన్ 2 రాబోతోంది. ఈ సిరీస్ ను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మిస్తున్నారు. డైరెక్టర్ మారుతి షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు. రవి నంబూరి, సందీప్ బొల్ల రచన చేయగా..కిరణ్ కె కరవల్ల దర్శకత్వం వహించారు.
ఈ రోజు "త్రీ రోజెస్" సీజన్ 2 నుంచి యాక్టర్ సత్య చేసిన 'బెట్టింగ్ భోగి' క్యారెక్టర్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. "విశ్వంభర", "రాజా సాబ్" ,"పెద్ది" వంటి ప్రెస్టీజియస్ మూవీస్ లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నా సత్య.."త్రీ రోజెస్" కంటెంట్ ను ఇష్టపడి ఈ వెబ్ సిరీస్ లో నటించాడు. సత్యను ఫస్ట్ టైమ్ ఓ వెబ్ సిరీస్ లో పరిచయం చేస్తోంది మాస్ మూవీ మేకర్స్. ఈ సిరీస్ లో హీరోయిన్ రాశీ సింగ్ భర్తగా సత్య నటిస్తున్నాడు. సత్య చేసిన 'బెట్టింగ్ భోగి' క్యారెక్టర్ గ్లింప్స్ హిలేరియస్ గా ఉండి నవ్విస్తోంది. క్రికెట్ మ్యాచ్ లపై బెట్టింగ్స్ పెట్టే 'బెట్టింగ్ భోగి'గా మనం రియల్ లైఫ్ లో చూసే ఎంతోమందిని గుర్తుచేశాడు సత్య. రాశీ సింగ్, సత్య మధ్య వచ్చే సీన్స్ అన్నీ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అందించబోతున్నాయి. త్వరలోనే "త్రీ రోజెస్" సీజన్ 2 వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది.
This is the character introduction of Betting Bhogi played by Satya from season 2 of 3 Roses. This is his first OTT experience.