18 January 2025
Hyderabad
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ మోస్ట్ ఎవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ 'భైరవం'. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతిలాల్ గడా సమర్పిస్తున్నారు.
ఇప్పటికే విడుదల చేసిన లీడ్ యాక్టర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఫస్ట్ సింగిల్ ఓ వెన్నెల సాంగ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది.
ఈరోజు మేకర్స్ భైరవం' టీజర్ అప్డేట్ ఇచ్చారు. జనవరి 20న టీజర్ లాంచ్ కానుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ ఇంటెన్స్ అండ్ ఫెరోషియస్ లుక్స్ లో కనిపించిన టీజర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ అదిరిపోయింది.
ఈ చిత్రంలో అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ హరి కె వేదాంతం, ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్. సత్యర్షి, తూమ్ వెంకట్ డైలాగ్స్ రాస్తున్నారు.
తారాగణం: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్, అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది
సాంకేతిక సిబ్బంది:
స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: విజయ్ కనకమేడల
నిర్మాత: కేకే రాధామోహన్
సమర్పణ: డా. జయంతిలాల్ గడ (పెన్ స్టూడియోస్)
సినిమాటోగ్రాఫర్: హరి కె వేదాంతం
ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి
ఎడిటర్: చోటా కె ప్రసాద్
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
డైలాగ్స్: సత్యర్షి, తూమ్ వెంకట్
సాహిత్యం: భాస్కర భట్ల, కాసర్ల శ్యామ్, చైతన్య ప్రసాద్, బాలాజీ, తిరుపతి
ఫైట్ మాస్టర్: రామకృష్ణ, నటరాజ్ మాడిగొండ
పబ్లిసిటీ డిజైనర్: సుధీర్
పీఆర్వో: వంశీ-శేఖర్
|