Nara Rohith about Bhairavam
'భైరవం'లాంటి మాస్ కమర్షియల్ సినిమా నేను ఇప్పటివరకూ చేయలేదు. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. ఖచ్చితంగా ఆడియన్స్ కి న్యూ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది: హీరో నారా రోహిత్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుత స్పందనతో, పాజిటివ్ బజ్‌తో ముందుకు దూసుకెళ్తుంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీ నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గడా సమర్పిస్తున్నారు. ఈ సినిమా మే 30న సమ్మర్ సీజన్లో బిగ్గెస్ట్ రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హీరో నారా రోహిత్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
ఈ కథ మీ వద్దకు ఎలా వచ్చింది ?
-నిర్మాత బెల్లంకొండ సురేష్ గారు ఈ కథ గురించి ఫోన్ చేసి చెప్పారు. ఆయన జడ్జిమెంట్ మీద నాకు నమ్మకం ఉంది. శశి కుమార్ క్యారెక్టర్ గురించి చెప్పారు. నేను సినిమా చూశాను. చాలా నచ్చింది. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. తమిళ్లో దీన్ని ఒక రస్టిక్ విలేజ్ డ్రామా లా చేశారు. దిన్ని తెలుగు నేటివిటికి తగ్గట్టు చేంజెస్ చేయడం జరిగింది. గరుడన్ చూసిన తర్వాత కూడా ఈ సినిమా చూస్తే ఒక ఒరిజినల్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది.
మీ ముగ్గురు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చూస్తుంటే చాలా అద్భుతంగా కుదిరినట్టుగా అనిపిస్తుంది. దీనికోసం ఏదైనా హోంవర్క్ చేశారా ?
-మాకు ఎప్పటినుంచో పరిచయం ఉంది. పర్సనల్ గా కూడా మేము చాలా క్లోజ్. మా మధ్య చాలా కంఫర్ట్ ఉంటుంది. డైరెక్టర్ విజయ్ కి చాలా క్లారిటీ ఉంది. ఏ క్యారెక్టర్ నుంచి ఎలాంటి పర్ఫార్మన్స్ కావాలో తనకి తెలుసు. మాకు కూడా చాలా ఫ్రీడమ్ ఇచ్చాడు. ఇందులో ప్రతి పాత్రకి ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ కి ఎమోషనల్ డెప్త్ ఉంటుంది.
ఇకపై మీ నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రాబోతున్నాయా?
-చిన్న బ్రేక్ తీసుకోవాలనుకున్నాను. అది కాస్త పెద్ద బ్రేక్ అయింది.(నవ్వుతూ) ఇకపై రెగ్యులర్ గా సినిమాలు వస్తాయి. సుందరకాండ ఆల్మోస్ట్ పూర్తయింది. జూలైలో రిలీజ్ ఉండొచ్చు. నెక్స్ట్ ఫిల్మ్ ఆగస్టులో స్టార్ట్ చేయబోతున్నాను.
మనోజ్, సాయి శ్రీనివాస్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
-మనోజ్ నాకు చిన్నప్పటినుంచి తెలుసు. ఈ సినిమాతో చాలా పర్సనల్ బాండ్ వచ్చింది. సాయి నాకు 2010 నుంచి తెలుసు. తను డాన్స్ ప్రాక్టీస్ చేస్తుండేవాడు. అప్పటినుంచి తను పరిచయం. నిజానికి సురేష్ గారితో ఒక సినిమా చేయాలి.కానీ అది కుదరలేదు. ఈ సినిమాతో మేమంతా మరింత దగ్గరయ్యాం.
జయసుధ గారి క్యారెక్టర్ గురించి ?
-ఇందులో జయసుధ గారు బామ్మ క్యారెక్టర్ చేశారు. జయసుధగారు లెజెండరీ. సార్ వచ్చారు తర్వాత వారితో వర్క్ చేయడం ఆనందాన్ని ఇచ్చింది.
ఈ సినిమా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ?
-నేను యాక్షన్ సినిమాలు చేశాను కానీ ఇంత కమర్షియల్ మాస్ ఫిలిం నేనెప్పుడూ చేయలేదు. ఇది నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఆడియన్స్ రెస్పాన్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.
-ఈ సినిమాలో చాలా యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్స్ లు ఈ సినిమాకి మేజర్ హైలైట్. చాలా రోజుల తర్వాత ఇంత హెవీ యాక్షన్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. మేము ముగ్గురు కలిసి చేసిన ఇంటర్వెల్ సీక్వెన్స్ చాలా అద్భుతంగా వచ్చింది. ఆడియన్స్ కి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది .
తెలుగు కోసం ఎలాంటి మార్పులు చేశారు?
-స్టోరీ లైన్ అదే ఉంటుంది. అయితే తెలుగులోకి వచ్చేసరికి ప్రతి సీన్ ని రీరైట్ చేసాం. మన నేటివిటీ తగ్గట్టు సినిమా ఉంటుంది. సినిమా మీరు చూస్తున్నప్పుడు ఒరిజినల్ కంటే మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.
హీరోయిన్స్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి?
-ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్ ఉండదు. ఒరిజినల్ గా ఇది వెట్రిమోరన్ గారి కథ. ప్రతి పాత్రకి కథలో చాలా కీలక పాత్ర ఉంటుంది.
శ్రీ చరణ్ మ్యూజిక్ గురించి?
-శ్రీ చరణ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు బాగా చేస్తాడనే పేరు ఉంది. ఈ సినిమాతో మంచి పాటలు కూడా ఇస్తాడని ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోరు మెయిన్ హైలెట్ గా ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో తన సినిమాని ఎలివేట్ చేశాడు
నిర్మాత రాదా మోహన్ గారి గురించి ?
-రాధా మోహన్ గారి లాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి చాలా ఇంపార్టెంట్. ముగ్గురు హీరోలతో ఒక సినిమా చేయడం అంత ఈజీ కాదు. ఎక్కడ రాజీ పడకుండా సినిమా తీశారు. ఆయనకి ఈ సినిమాతో పెద్ద సక్సెస్ రావాలని భారీగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ విజయ్ గురించి?
-విజయ్ చాలా క్లియర్ విజన్ తో ఉంటాడు. తనకి ఏం కావాలో ఫుల్ క్లారిటీ ఉంటుంది. అలాగే ఒక సీన్ తీస్తున్నప్పుడే ఎడిటింగ్ పాటర్న్ తన మైండ్‌లో ఉంటుంది. ఈ సినిమా తను చాలా పెద్ద కమర్షియల్ డైరెక్టర్ అని ప్రూవ్ చేసుకునేలా ఉంటుంది.
మీరు నిర్మాతగా ఇంకా ఎక్కువ సినిమాలు చేసే అవకాశం ఉందా?
-మా కజిన్స్ తో కలిసి సుందరకాండ చేస్తున్నాను. మంచి కథలు వస్తే తప్పకుండా సినిమాలు నిర్మిస్తాను.
అప్పట్లో ఒకడుండేవాడు సినిమాకి సీక్వెల్ చేసే ఆలోచన ఉందా?
-ఆ ఆలోచన ఉండేది దాని మీద వర్క్ కూడా జరిగింది కానీ అది మెటీరియలైజ్ అవ్వలేదు. భవిష్యత్తులో అది అవుతుందేమో చూడాలి.
మీకు ఇష్టమైన జానర్?
-నాకు హారర్ తప్ప అన్ని సినిమాలు ఇష్టం. డబ్బులు ఇచ్చి భయపడడం ఎందుకని.(నవ్వుతూ)
మీ కెరీర్లో మీకు ఇష్టమైన సినిమాలు?
-సోలో, రౌడీ ఫెలో, బాణం, జోఅచ్చుతానంద, అప్పట్లో ఒకడుండేవాడు.
భైరవం చూశారా?
-ఆడియన్స్ తో కలిసి చూడాలని మే 30 కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నాను.