pizza

Charming Star Sharwa, Abhilash Reddy Kankara, UV Creations’ Biker Breath-takingly Stunning First Lap Glimpse Unveiled, Theatrical Release On December 6th
బైకర్.. ఇండియన్ సినిమాలో ఫస్ట్ మోటోక్రాస్ రేసింగ్ ఫిల్మ్ అని గర్వంగా చెప్పుకోగలం. ఈ సినిమా నా కెరియర్ లో టర్నింగ్ పాయింట్: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చార్మింగ్ స్టార్ శర్వా

You are at idlebrain.com > news today >

1 November 2025
Hyderabad

Charming Star Sharwa’s sports and family drama Biker, directed by Abhilash Reddy Kankara and produced by UV Creations, is nearing completion with its shoot. The makers recently began the promotions by unveiling the first look poster that showed Sharwa in a striking biker avatar with sports gear on. Sharwa’s gym stills have also gone viral. Today, the makers unveiled the film’s first lap glimpse.

The glimpse opens with a powerful voiceover, "Every biker has a story. A story of racing against time. A story of confronting death. A story of fools who never give up, no matter what." These lines perfectly capture the biker lifestyle- the risks, the struggles, and the courage it takes to pursue victory on two wheels.

Visually, the film impresses with breathtaking stunts that are breath-takingly stunning. The final dialogue leaves a lasting impact: "Winning isn’t everything; fighting till the very end, that’s what’s truly great." It’s an inspiring message that embodies the spirit of the film.

Director Abhilash Reddy Kankara has conveyed the essence of Biker effectively through this short yet powerful glimpse. The dialogues are hard-hitting, while the visuals keep viewers on the edge of their seats.

Sharwa underwent a remarkable transformation for the role, achieving a lean and athletic physique that complements the character’s determined personality. Malvika Nair plays the female lead opposite Sharwa, with Atul Kulkarni and Brahmaji in pivotal supporting roles.

Capturing high-speed bike racing sequences is notoriously challenging, and cinematographer J Yuvraj has delivered exceptional visuals that feel like watching a live race. Ghibran’s intense background score amplifies the excitement, while UV Creations’ rich production values shine through.

Editing is handled by Anil Kumar P, production design by Rajeevan, executive production by N. Sundeep, and art supervision by A. Panner Selvam.

Overall, the first lap glimpse, focused solely on racing, creates strong buzz. The makers have also announced that Biker is slated for release on December 6th.

Cast: Charming Star Sharwa, Malvika Nair, Brahmaji, Atul Kulkarni, etc.

Technical Crew:
Writer, Director: Abhilash Reddy Kankara
Producers: Vamsi-Pramod
Presents: Vikram
Banner: UV Creations
Music: Ghibran
DOP: J Yuvraj
Production Designer: Rajeevan
Editor: Anil Kumar P
Art Director: A Paneer Selvam

బైకర్.. ఇండియన్ సినిమాలో ఫస్ట్ మోటోక్రాస్ రేసింగ్ ఫిల్మ్ అని గర్వంగా చెప్పుకోగలం. ఈ సినిమా నా కెరియర్ లో టర్నింగ్ పాయింట్: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చార్మింగ్ స్టార్ శర్వా

చార్మింగ్ స్టార్ శర్వా, అభిలాష్ రెడ్డి కంకర, UV క్రియేషన్స్ 'బైకర్' స్టన్నింగ్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ లాంచ్- సినిమా డిసెంబర్ 6న థియేటర్లలో రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా స్పోర్ట్స్, ఫ్యామిలీ డ్రామా బైకర్ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని UV క్రియేషన్స్ నిర్మించింది. ఇటీవలే శర్వా స్పోర్ట్స్ గేర్‌తో బైకర్ అవతార్‌లో ఉన్నట్లు చూపించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శర్వా జిమ్ స్టిల్స్ కూడా వైరల్ అయ్యాయి. ఈరోజు, మేకర్స్ సినిమా ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్‌ను లాంచ్ చేశారు.

''ఇక్కడ ప్రతి బైకర్ కి ఒక కథ ఉంటుంది. సమయంతో పోరాడే కథ. చావుకి ఎదురెళ్ళే కథ. ఏం జరిగినా పట్టువదలని మొండివాళ్ళ కథ' అనే పవర్ ఫుల్ వాయిస్‌ఓవర్‌తో గ్లింప్స్ ప్రారంభమవుతుంది. ఈ లైన్స్ బైకర్ లైఫ్ స్టయిల్, ప్రమాదాలు, పోరాటాలని అద్భుతంగా ప్రజెంట్ చేశాయి.

గ్లింప్స్ అద్భుతమైన స్టంట్‌లతో ఆకట్టుకుంటుంది. 'ఇక్కడ గెలవడం గొప్పకాదు. చివరిదాక పోరాటం గొప్ప' అనే లైన్ ఈ సినిమా స్పిరిట్‌ను పర్ఫెక్ట్‌గా చూపించింది. దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకర ‘బైకర్‌’ ఎసెన్స్ ఈ గ్లింప్స్‌లోనే అద్భుతంగా చూపించారు. డైలాగ్‌లు స్ట్రాంగ్‌గా, విజువల్స్‌ గ్రిప్పింగ్‌గా ప్రేక్షకులను సీట్ల ఎడ్జ్‌లో ఉంచాయి.

శర్వానంద్‌ ఈ పాత్ర కోసం కంప్లీట్ గా ట్రాన్స్‌ఫార్మ్‌ అయ్యారు. లీన్‌, అథ్లెటిక్‌ లుక్‌తో ఆ పాత్రకు అవసరమైన డిటర్మిన్డ్‌ పర్సనాలిటీని అద్భుతంగా చూపించారు.

మాళవిక నాయర్‌ హీరోయిన్‌గా, అతుల్‌ కులకర్ణి, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. హై స్పీడ్‌ బైక్‌ రేసింగ్‌ సన్నివేశాలను జె. యువరాజ్‌ అద్భుతంగా క్యాప్చర్ చేశారు. విజువల్స్ లైవ్‌ రేస్‌ చూస్తున్న ఫీలింగ్‌ ఇచ్చాయి. జిబ్రాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ రష్‌ను మరింతగా పెంచగా, యూవీ క్రియేషన్స్‌ ప్రొడక్షన్‌ వాల్యూస్ ప్రతీ ఫ్రేమ్‌లో కనిపించాయి.

అనిల్‌ కుమార్‌ పి ఎడిటింగ్‌, రాజీవన్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌, ఎన్‌. సుందీప్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడక్షన్‌, ఎ. పన్నీర్‌ సెల్వం ఆర్ట్‌ సూపర్విజన్‌.. మొత్తం టీమ్‌ టెక్నికల్‌గా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. రేసింగ్‌పై ఫోకస్‌ చేసిన ఈ ఫస్ట్‌ ల్యాప్‌ గ్లింప్స్‌ సినిమాపై అంచనాలను పెంచేసింది. ‘బైకర్‌’ డిసెంబర్‌ 6న చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చార్మింగ్ స్టార్ శర్వా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా చేసినందుకు రాజశేఖర్ గారికి థాంక్యూ. ఆయనతో పనిచేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. సినిమాలో ఆయన యాక్టింగ్ చూస్తున్నప్పుడు నిజంగానే గూజ్ బంప్స్ వచ్చాయి. బైకర్.. ఫస్ట్ మోటోక్రాస్ రేసింగ్ ఫిల్మ్ ఇన్ ఇండియన్ సినిమా అని గర్వంగా చెప్పగలం. ఈ సినిమా చేయడం అంత ఈజీ కాదు. చాలా పెద్ద ఛాలెంజ్. ఇందులో కనిపించినది ఏది కూడా సీజీ షాట్ కాదు. ఒరిజినల్ బైకర్స్ తో తీసిన ఒరిజినల్ స్టంట్స్. ఇండోనేషియా వెళ్లి బైకర్స్ తో అక్కడ షూట్ చేసి వచ్చాం. చాలా రిస్కులు, ఛాలెంజులు తీసుకున్నాం. ఒక గొప్ప సినిమా చేశామని గర్వంగా చెప్పుకోగలం. ఈ సినిమా కెరియర్ లో టర్నింగ్ పాయింట్. ఎందుకు టర్నింగ్ పాయింట్ అనేది మరో స్టేజ్ లో మాట్లాడుతాను. ఇలాంటి సినిమా చేయాలంటే నిర్మాతలకి గట్స్ ఉండాలి. వంశీ అన్న థాంక్యూ. గర్వంగా ఇది నా సినిమానే చెప్పుకునే సినిమా ఇచ్చినందుకు. అభి అద్భుతమైన కథ రాసుకొని వచ్చారు. ఫెంటాస్టిక్ గా తీశాడు . ఈ సినిమా ఒక మ్యాజిక్. మీ అందరికీ సినిమా ఎప్పుడెప్పుడు చూపించాలని ఎదురుచూస్తున్నాను.

డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. హీరో తో పాటు మంచి క్యారెక్టర్స్ కూడా చేయాలి అని నిర్ణయించుకున్న తర్వాత చాలా కథలు విన్నాను. అందులో చాలా వరకు నాకు నచ్చేవి కాదు. మంచి సబ్జెక్ట్ రాలేదనే నిరాశ ఉండేది. అలాంటి సమయంలో డైరెక్టర్ అభి వచ్చారు. బైకర్ స్టోరీ చెప్పారు. అద్భుతమైన సబ్జెక్టు. ఈ సినిమా చేస్తే మంచి పేరు వస్తుందని ఒప్పుకున్నాను. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. అభి ప్రతి ఫ్రేమ్ ని అద్భుతంగా డిజైన్ చేశారు. ప్రతిరోజు చాలా ఎంజాయ్ చేశాను. ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఉండేది. వంశి గారు సూపర్ ప్రొడ్యూసర్. చాలా కూల్ గా ఉంటారు. ఈ సినిమాకి అయిన ఖర్చు చూస్తే నాకు భయం పుట్టేది. కానీ వంశీ గారు ఎప్పుడు చాలా కూల్ గా ఉండేవారు. శర్వా గారు చాలా కోపరేటివ్. చాలా రెస్పెక్ట్ ఫుల్. ఈ సినిమా డబ్బింగ్ చూసి శర్వా గారు నా దగ్గరకు వచ్చి 'రాజశేఖర్ గారు మీరు చాలా అద్భుతంగా చేశారు. మీరు ఈ క్యారెక్టర్ చేసినందుకు థాంక్స్' అని చెప్పారు. అది నాకు పెద్ద అవార్డుతో సమానం. బైకర్ సినిమా మీరు చూడండి. చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది.

డైరెక్టర్ అభిలాష్ రెడ్డి కంకర మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఇది జస్ట్ గ్లింప్స్ మాత్రమే. నిన్న మొన్న థియేటర్స్ లో స్క్రీన్ చేసినప్పుడు చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విజువల్స్ బాగున్నాయి సౌండ్ బావుందని అందరూ అప్రిషియేట్ చేశారు. రేసింగ్ సినిమాలు చూసి మీరు ఎంత ఎక్సైట్ అయ్యారో దానికి ఇది మించినట్లుగా ఉంటుంది. డిసెంబర్ 6న కొడుతున్నాం. ఆడియన్స్ కి చాలా మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది.

యాక్టర్ నిరూప్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఇది నాకు తెలుగులో ఫస్ట్ సినిమా. మా డైరెక్టర్ గారికి ధన్యవాదాలు. శర్వా గారు సూపర్ గా చేశారు సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. రాజశేఖర్ గారు నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. డిసెంబర్ 6న సినిమా చూడండి. తప్పకుండా చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది.

డిఓపి యువరాజ్ మాట్లాడుతూ.. శర్వా గారికి మా డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్స్ కి థాంక్యూ. ఈ సినిమాని షూట్ చేయడం చాలా డిఫికల్ట్ ప్రాసెస్. ఇది రెగ్యులర్ సినిమా లాగా ఉండదు. చాలా కష్టపడ్డాం. డిసెంబర్ 6న రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరూ థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను.

తారాగణం: చార్మింగ్ స్టార్ శర్వా, మాళవిక నాయర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: అభిలాష్ రెడ్డి కంకర
నిర్మాతలు: వంశీ-ప్రమోద్
సమర్పణ: విక్రమ్
బ్యానర్: యువి క్రియేషన్స్
సంగీతం: జిబ్రాన్
డిఓపీ: జె యువరాజ్
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవన్
ఎడిటర్: అనిల్ కుమార్ పి
ఆర్ట్ డైరెక్టర్: ఎ పన్నీర్ సెల్వం

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved