pizza

Narrated final script to Chiranjeevi garu and he enjoyed it: Anil Ravipudi
మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, సాహు గారపాటి, షైన్ స్క్రీన్స్ '#చిరుఅనిల్ లాక్డ్ & లోడెడ్

You are at idlebrain.com > news today >

26 March 2025
Hyderabad

Now, this is super fast. More than a couple of months after the release of his festival blockbuster release, Sankranthiki Vastunnam, with victory Venkatesh, Anil Ravipudi had gone to his favourite place–Vizag– to participate in story discussions of his next with megastar Chiranjeevi and guess what, he has now even narrated the entire script as well to the megastar.

Taking to X on Wednesday, the hugely successful director wrote that the final narration is complete and that they are gearing to officially launch the film. “Final script narration done & locked. I’ve introduced my character Shankara Varaprasad to Chiranjeevi garu. He loved and enjoyed it thoroughly. So why wait? The Chiru festival film which will offer plenty of laughs will have a muhurat soon,” he stated.

While Ravipudi refrained from mentioning the date, the untitled film, a joint production venture between Sahu Garapati’s Shine Screens and Sushmita Konidela’s Gold Box Entertainments, will be launched on March 30 on account of Telugu New Year Ugadi. Bheems Ceciroleo is attached to compose music for the film, which will release for Sankranti next year.

With his films not lasting more than six months on production, shooting within the budget and delivering grossers like Sankranthiki Vastunnam, Ravipudi is certainly a producer’s dream.

మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, సాహు గారపాటి, షైన్ స్క్రీన్స్ '#చిరుఅనిల్ లాక్డ్ & లోడెడ్

'సంక్రాంతికి వస్తున్నాం'తో మ్యాసీవ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి తన నెక్స్ట్ బిగ్ స్క్రీన్ షో కోసం రెడీ అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవితో కొలాబరేట్ అవుతున్నారు. తన అద్భుతమైన కామిక్ టైమింగ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకు పేరుపొందిన అనిల్ రావిపూడి, కామెడీ, ఎమోషన్, యాక్షన్‌ను బ్లెండ్ చేసే స్క్రిప్ట్‌తో చిరంజీవిని ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పాత్రలో ప్రజెంట్ చేయనున్నారు. ప్రతిష్టాత్మక షైన్ స్క్రీన్స్ బ్యానర్‌లో గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి సాహు గారపాటి నిర్మించే ఈ చిత్రం పండగ వైబ్స్, ఎమోషన్స్, అనిల్ రావిపూడి ట్రేడ్‌మార్క్ వినోదంతో ఈ చిత్రం హెల్తీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉండనుంది.

#చిరుఅనిల్ కోసం అంతా లాక్, లోడ్ అయ్యింది. అనిల్ రావిపూడి చిరంజీవికి ఫైనల్ నరేషన్ వినిపించారు. స్క్రిప్ట్‌తో థ్రిల్ అయ్యారు మెగాస్టార్. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మెగాస్టార్ ఆశీస్సులు లభించడంతో, ఈ చిత్ర బృందం ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో వర్క్ చేస్తోంది, గ్రాండ్ లాంచ్ కు ముందే మిగిలిన నటీనటులు, సిబ్బందిని ఖరారు చేయనున్నారు.

ఈ చిత్రానికి ప్లే ఫుల్ ట్విస్ట్ ని జోడిస్తూ, చిరంజీవి శంకర్ వరప్రసాద్ పాత్రను పోషిస్తున్నారు. మెగాస్టార్ అసలు పేరు కొణిదెల శివ శంకర వరప్రసాద్‌. చిరంజీవి పూర్తి స్థాయి కామెడీ అవతార్ లో కనిపిస్తారు, తన ఎఫర్ట్ లెస్ చార్మ్ తో అలరించబోతున్నారు.

అనిల్ రావిపూడి, చిరంజీవిల కాంబో ఎంటర్ టైన్మెంట్ ని రీడిఫైన్ చేయనుంది. ఎప్పటికీ గుర్తుండిపోయే నవ్వుల వినోదాన్ని అందిస్తుంది. ఈ మెగా ఎంటర్ టైనర్ కి సంబధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved