Ś
pizza

'Court' is a great courtroom drama with a beautiful love story. It feels like watching our life on screen. It will definitely connect with the audience: Director Ram Jagadeesh.
'కోర్ట్' సినిమా బ్యూటీఫుల్ లవ్ స్టొరీతో వున్న గొప్ప కోర్ట్ రూమ్ డ్రామా. మన జీవితం తెరపై చూస్తున్నట్లుగా ఉంటుంది. తప్పకుండా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది: డైరెక్టర్ రామ్ జగదీష్

You are at idlebrain.com > news today >

12 March 2025
Hyderabad

Natural Star Nani is presenting the movie 'Court - State Vs A Nobody' under Wall Poster Cinema. Priyadarshi is playing the lead role in this film, directed by Ram Jagadeesh. It is produced by Prashanthi Tipirneni. Deepti Ganta is the co-producer. The already released trailer and the love song have received wonderful appreciation from the audience. This film is getting ready for release in theatres on March 14. On this occasion, director Ram Jagadeesh shared the details of the movie in a press meet.

Jagadeesh garu, what is your inspiration to do this story?

This story is based on the background of the POCSO Act. In real life, I observed a case like this. When I got to know about that case, I really doubted, “Does this even happen?” Then I came to know that there are many such cases. I did research on all those cases. There are hundreds of cases in Andhra Pradesh and Telangana. I felt it would be good to address all these on screen.
I read a lot of case files for this story. With the material from all those case files, I felt I could tell a good story. I combined all of them and showed them on screen as one story.

This is not the story of any particular person’s real-life incident. It has inspiration from many incidents. This is a complete fictional story. I made a fictional story with the essence of the cases I read.
For this movie, I thoroughly studied the POCSO Act. I met many people related to court, law, and police and gathered a lot of information.

How did you feel when narrating the story to Nani garu?

Narrating the story to Nani garu was a very happy moment. I waited for almost eight months to narrate it to him. Finally, the moment came when he listened to the story.
After hearing the story, the way he responded made me feel very happy. He listened to the entire two-and-a-half-hour story in a single sitting.
After listening to the full story, he stood up, shook my hand, and said, “Welcome to Wall Poster Cinema.” That was the high moment of my life. It was really a great experience.

Many courtroom dramas have come, right? How different is this movie going to be?

Yes, we have seen many courtroom dramas. But I feel we have never seen a love story as a courtroom drama.
In this movie, the love story and courtroom drama are going to be very special.

To what extent is the POCSO Act in this story?

POCSO is a very important act. Actually, the outside world knows very little about that act.
I thought it would be good to explain a little in detail about it. You will see that in this movie.

About Roshan and Sridevi's characters?

In this movie, we selected all the characters through auditions.
Roshan worked hard to play the character Chandu. After getting selected, his follow-up was amazing. He showed a lot of passion.
We closed Chandu’s character quickly, but we searched a lot for the Jabilli character.
We wanted a Telugu girl, someone new, of the right age, and who knows acting. At one stage, we thought we might not find such a girl.
At that time, my friend sent me an Instagram profile. While watching the reels, in one of them, she looked like Jabilli. We did an audition. She was a perfect apt for that character.

About Priyadarshi garu’s character?

I first told this movie idea to Priyadarshi. After hearing it, he said, “I will do this movie. Don’t tell anyone else.”
I told him only. I did it with him.
Priyadarshi and I have a very close association. We are very friendly. I can share everything with him.

About Shivaji garu’s character?

Shivaji garu appears in the role of Mangapathi.
In every family, there is a character like that.
When such an incident happens, everyone becomes Mangapathi.
It will be like a real-life character.

How is the movie technically?

From the time we thought of this story, we fixed that it should have a good technical standard.
Vijay gave beautiful music. He proved himself with Baby.

Dinesh Purushothaman worked as DOP for this film. He is a DOP who did two 200-crore films.

After hearing our movie story, he agreed to do it. The visuals will be very lively.

About your journey in the industry?

Before this, I worked as an assistant director for Urvasivo Rakshasivo and Ra Ra Krishnayya.

I did a short film. I got the Best Director Award for that.

How is the support from the production side?

Deepti garu provided everything needed for the movie.
She planned everything perfectly to finish the project in time.
Doing a movie with Wall Poster Cinema is my luck.

What is the reason Nani garu says this movie will definitely be a hit?

Nani garu saw the movie.The confidence he has on the movie, that confidence came from the movie itself.
After watching it, he said, “Proud of you, Jagadeesh.” That is the best compliment I got.

What would you like to say to the audience about this movie?

This movie is our life. It’s the truth we all need to know. On screen, you will see our own life.
I request you to come to watch this movie to see yourself on screen.
We are all very happy about this movie.
The movie came out exactly how I wanted it to be.

What I wrote has come out wonderfully on screen.

This is a commercial film.

After watching the movie, someone told me, “You made a commercial movie without a single drop of blood.” I liked that comment very much.

'కోర్ట్' సినిమా బ్యూటీఫుల్ లవ్ స్టొరీతో వున్న గొప్ప కోర్ట్ రూమ్ డ్రామా. మన జీవితం తెరపై చూస్తున్నట్లుగా ఉంటుంది. తప్పకుండా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది: డైరెక్టర్ రామ్ జగదీష్

నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్ చేస్తున్న మూవీ 'కోర్ట్' - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ అలానే ప్రేమలో పాట కూడా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ప్రశంసలు అందుకున్నాయి. ఈ చిత్రం మార్చి 14న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ జగదీష్ సినిమా విశేషాలు విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.

జగదీష్ గారు ఈ కథ చేయడానికి మీకు స్ఫూర్తి?
-ఈ కథ ఫోక్సో యాక్ట్ నేపథ్యంలో ఉంటుంది. నిజజీవితంలో ఇలాంటి ఒక కేసుని నేను పరిశీలించాను. ఆ కేసు గురించి తెలుసుకున్నప్పుడు నిజంగా ఇలా కూడా ఉంటుందా అని సందేహంగా అనిపించింది. ఇలాంటి కేసులు ఇంకా చాలా ఉన్నాయని తెలిసింది. ఆ కేసులు అన్నిటి మీద కూడా రీసెర్చ్ చేశాను. ఏపీ తెలంగాణలో వందల కేసులు ఉన్నాయి. ఇవన్నీ స్క్రీన్ మీద అడ్రస్ చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. ఈ కథ కోసం చాలా కేసు ఫైల్స్ చదివాను. అన్ని కేస్ ఫైల్స్ లో ఉన్న మెటీరియల్ తో ఒక మంచి కథ చెప్పొచ్చు కదా అనిపించింది. అవన్నీ ఒక కథగా చేసి స్క్రీన్ పై చూపించడం జరిగింది.

-ఇది పర్టికులర్ ఒక పర్సన్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ కి సంబంధించిన కథ కాదు. చాలా సంఘటనల స్ఫూర్తి ఉంది. ఇది కంప్లీట్ గా ఫిక్షనల్ కథ. చదివిన కేసుల ఎసెన్స్ తో ఒక ఫిక్షనల్ స్టోరీ చేయడం జరిగింది.

-ఈ సినిమా కోసం ఫోక్సో యాక్ట్ గురించి క్షుణ్ణంగా చదువుకున్నాను. కోర్టు, లా, పోలీస్ కి సంబధించిన చాలా మందిని కలసి చాలా విషయాలు గ్యాదర్ చేశాను.

నాని గారికి కథ చెప్పడం ఎలా అనిపించింది?
-నాని గారికి కథ చెప్పడం వెరీ హ్యాపీ మూమెంట్. ఆయనకి కథ చెప్పడానికి దాదాపు 8 నెలలు వెయిట్ చేశాను. ఫైనల్ గా ఆయన కథ వినే మూమెంట్ వచ్చింది. ఆయన కథ విన్న విధానం చూసి నాకు చాలా ఆనందంగా అనిపించింది. దాదాపు రెండున్నర గంటల కథని సింగిల్ సిటింగ్ లో విన్నారు. కథ మొత్తం విని నిల్చుని షేక్ హ్యాండ్ ఇచ్చి 'వెల్కమ్ టు వాల్ పోస్టర్ సినిమా' అన్నారు. అది నా జీవితంలో హై మూమెంట్. అది నిజంగా గ్రేట్ ఎక్స్పీరియన్స్.

చాలా కోర్ట్ రూమ్ డ్రామాలు వచ్చాయి కదా ఈ సినిమా ఎంత ప్రత్యేకంగా ఉండబోతుంది?
-చాలా కోర్ట్ రూమ్ డ్రామాలు చూసాం. కానీ ఒక లవ్ స్టోరీ ని కోర్ట్ రూమ్ డ్రామాగా ఎప్పుడు చూడలేదని భావిస్తున్నాను. ఇందులో లవ్ స్టోరీ, కోర్ట్ రూమ్ డ్రామా చాలా ప్రత్యేకంగా ఉంటాయి.

ఫోక్సో చట్టం ఈ కథలో ఏమేరకు ఉంటుంది?
-ఫోక్సో చాలా ముఖ్యమైన ఆక్ట్. నిజానికి ఆ చట్టం గురించి బయట ప్రపంచానికి చాలా తక్కువ తెలుసు. దాని గురించి కొంచెం డీటెయిల్ గా చెప్తే బాగుంటుందని అనిపించింది. అది ఈ సినిమాలో చూస్తారు.

రోషన్ శ్రీదేవి క్యారెక్టర్స్ గురించి?
-ఈ సినిమాలో అన్ని పాత్రలని ఆడిషన్స్ చేసి తీసుకున్నాం. చందు పాత్ర ప్లే చేయడానికి రోషన్ చాలా తపనపడ్డాడు. సెలెక్ట్ అయిన తర్వాత తను చేసిన ఫాలోఅప్ అద్భుతం. చాలా ఫ్యాషన్ చూపించాడు. చందు పాత్రని త్వరగానే క్లోజ్ చేసాం కానీ జాబిల్లి పాత్ర కోసం చాలా సెర్చ్ చేసాం. ఒక తెలుగు అమ్మాయి కావాలి, కొత్తగా ఉండాలి, సరైన ఏజ్ కావలి, నటన తెలిసి ఉండాలి ఇలాంటి కాంబినేషన్ ఉన్న అమ్మాయి కోసం చూస్తున్నప్పుడు ఒక దశలో దొరకదేమో అనుకున్నాం. అలాంటి సమయంలో నా ఫ్రెండ్ ఒక ఇన్స్టా ప్రొఫైల్ పంపించాడు. అందులో రీల్స్ చూస్తున్నప్పుడు ఒక రీల్ లో తను జాబిల్లిలా కనిపించింది. అడిషనల్ చేసాం. ఆ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ యాప్ట్ అయ్యింది,

ప్రియదర్శి గారి క్యారెక్టర్ గురించి?
-ఈ సినిమా ఐడియా మొదటగా ప్రియదర్శికే చెప్పాను. ఆయనకి చెప్పిన తర్వాత ఈ సినిమాని నేనే చేస్తాను. ఇంకా ఎవరికీ చెప్పొద్దు అన్నారు. ఆయనకే చెప్పాను. ఆయనతోనే చేశాను.
-ప్రియదర్శితో నాకు చాలా క్లోజ్ అసోషియేషన్. చాలా ఫ్రెండ్లీ గా వుంటాం. తనతో అన్నీ షేర్ చేసుకోగలను.

శివాజీ గారి క్యారెక్టర్ గురించి ?
-శివాజీ గారు మంగపతి క్యారెక్టర్ లో కనిపిస్తారు. ప్రతి ఫ్యామిలీలో అలాంటి ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఇలాంటి ఒక సంఘటన జరిగినప్పుడు ప్రతి ఒక్కరు మంగపతి అవుతారు. రియల్ లైఫ్ క్యారెక్టర్ లా ఉంటుంది.

టెక్నికల్ గా సిన్మియా ఎలా వుంటుంది ?
- ఈ కథ అనుకున్నప్పుడే టెక్నికల్ మంచి స్టాండర్డ్ గా వుండాలని ఫిక్స్ అయ్యాం. విజయ్ బేబీ తో ప్రూవ్ చేసుకున్నారు. ఈ సినిమాకి కూడా బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చారు.

-ఈ సినిమాకి దినేష్ పురుషోత్తమన్ డీవోపీగా చేశారు. ఆయన రెండు వందకోట్ల సినిమాలు చేసిన డీవోపీ. మా సినిమా కథ విని ఓకే చేశారు. విజువల్స్ చాలా లైవ్లీగా వుంటాయి.

పరిశ్రమలో మీ జర్నీ గురించి ?
-ఇంతకు ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఊర్వశివో రాక్షసివో చేశాను, రారా క్రిష్ణయ్యా సినిమాలు చేశాను. ఓ షార్ట్ ఫిల్మ్ చేశాను. దానికి బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ వచ్చింది.

ప్రొడక్షన్ సైడ్ సపోర్ట్ ఎలా వుంది ?
-దీప్తి గారు సినిమాకి కావాల్సిన ప్రతిది సమకూర్చారు. ఏది ఎప్పుడు చేస్తే ఇన్ టైం లో ప్రాజెక్ట్ ఫినిష్ అవుతుందో అన్నీ పక్కాగా ప్లాన్ చేశారు. వాల్ పోస్టర్ సినిమాలో చేయడం నా అదృష్టం.

నాని గారు ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అయి తీరుందని చెప్పడానికి కారణం?
- నాని గారు సినిమా చూశారు. సినిమాపై ఆయనకి వున్న కాన్ఫిడెన్స్ అది. ఆయన కాన్ఫిడెన్స్ అంతా సినిమా ఇచ్చిందే,

-నాని గారు సినిమా చూసి 'ప్రౌడ్ అఫ్ యూ జగదీశ్' అన్నారు. అది నాకు వచ్చిన బెస్ట్ కాంప్లీమెంట్

ఈ సినిమా గురించి ఆడియన్స్ కి ఏం చెబుతారు ?
-ఈ సినిమా మనందరి జీవితం. మనం తెలుసుకోవాల్సిన నిజం. స్క్రీన్ మీద మన జీవితమే వుంటుంది. మనల్ని మనం తెరపై చూసుకోవడానికి సినిమాకి రావాలని కోరుకుంటున్నాను.

-ఈ సినిమా విషయంలో అందరం చాలా హ్యాపీగా వున్నాం. నేను ఎలా వుండాలని అనుకున్నానో అలా వుంది సినిమా. నేను రాసింది అద్భుతంగా తెరపైకి వచ్చింది.

-ఇది కమర్షియల్ సినిమానే. సినిమా చూసి ఒకతను చుక్క రక్తం లేకుండా కమర్షియల్ సినిమా చూపించావ్ అన్నారు. ఆ మాట నాకు చాలా నచ్చింది.

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved