pizza

Mrunal Thakur On Board For Adivi Sesh’s Pan-India action drama 'Dacoit', Shoot Happening in Hyderabad
అడివి శేష్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'డకాయిట్' లో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్- హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్

You are at idlebrain.com > news today >

17 December 2024
Hyderabad

Get Ready for a tale of Love, Betrayal and Revenge! Adivi Sesh's passion project, Dacoit, a mega pan-India action drama has been mounted to be an adrenaline pumping experience at the cinema. Directed by Shaneil Deo who marks his directorial debut, this ambitious project is produced by Supriya Yarlagadda, co-produced by Suniel Narang, and presented by Annapurna Studios. The film is being shot simultaneously in Hindi and Telugu and features a story and screenplay jointly crafted by Adivi Sesh and Shaneil Deo. The film is currently being shot in Hyderabad followed by an extensive schedule in Maharashtra.

On his birthday today, Adivi Sesh announced his leading lady welcoming her to be part of this high octane face off! The stunning actress Mrunal Thakur joins the film as the female lead, ready to dive into a story filled with action, emotion, and drama - between two former lovers.

Contrary to the trend of making film announcements on actor birthdays, Adivi Sesh announces his female lead, Mrunal Thakur, making his birthday even more special. The Dacoit team unveiled an intense poster, showcasing the palpable chemistry between Adivi Sesh and Mrunal Thakur’s characters. Dacoit tells the story of an angry convict seeking vengeance on his ex-girlfriend who betrayed him. He devises a dangerous plan to trap her, setting the stage for an intense action drama driven by elemental forces - love, betrayal, and revenge.

Two new posters featuring Adivi Sesh and Mrunal Thakur have been released, presenting the intense dynamics of their characters. In one poster, Sesh is seen with a serious expression, gazing into the distance, while Mrunal looks at him with a sense of sadness. The second poster presents a contrasting yet equally intense image. Sesh sitting stylishly in a car, lighting a cigarette, while Mrunal is seen driving the car, and giving a stern gaze with a gun in her hand. Both posters highlight the complexity of their troubled relationship, emphasizing the intensity of their roles.

Welcoming Mrunal Thakur to the world of Dacoit and making this grand announcement on his birthday, actor Adivi Sesh shares, "Dacoit is a solid Action Film with a touching love story. Mrunal has brought some of the finest characters to life on the big screen, bringing a unique panache to each role. Her exceptional ability to elevate every character she portrays makes her truly remarkable. We are thrilled to welcome Mrunal to the Dacoit team and eagerly await going head-to-head on the big screens.".

Excited to be joining the Dacoit team, Mrunal Thakur shares, "Elated to be joining the Dacoit team, Mrunal Thakur shares, "The story of Dacoit is true in its essence, a great mixture of rustic storytelling that is elevated with the stylised vision of both Adivi Sesh and Shaneil Deo. The character I’m set to depict in the films will allow me to explore shades of playing an on-screen character that I haven’t explored before as an actor. This proposition mixed with the genre and script of Dacoit is what will truly make it a treat to watch for the audiences. I can’t wait to deep dive into the world envisioned by Shaneil.".

Talking about Mrunal Thakur's entry to his debut film and having this actor duo come together for the first time, director Shaneil Deo shares, "We are delighted to have Mrunal Thakur join the team of Dacoit. Her versatility and ability to bring depth to her characters make her the perfect fit for this action-packed drama. This also marks the first time Adivi Sesh and Mrunal are coming together for a film. With this unique pairing and the story we are bringing to life, I am looking forward to audiences witnessing her in this powerful and distinctive role, and experiencing the on-screen chemistry that Adivi Sesh and Mrunal are creating together in their first project.".

More details of the movie are awaited.

Cast: Adivi Sesh, Mrunal Thakur, and others

Technical Crew:
Direction: Shaneil Deo
Story, Screenplay: Adivi Sesh and Shaneil Deo
Producer: Supriya Yarlagadda
Co-producer: Suniel Narang
Presents: Annapurna Studios

అడివి శేష్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'డకాయిట్' లో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్- హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్

అడివి శేష్ మెగా పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'డకాయిట్' అడ్రినలిన్ పంపింగ్ ఎక్స్ పీరియన్స్ తో రూపొందుతోంది. షనైల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ సహ నిర్మాత. ఈ చిత్రం హిందీ, తెలుగు భాషలలో ఏకకాలంలో షూట్ చేస్తున్నారు. అడివి శేష్ ,షానీల్ డియో సంయుక్తంగా కథ, స్క్రీన్ ప్లే రూపొందిచారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మహారాష్ట్రలో లాంగ్ షెడ్యూల్‌తో కొనసాగుతుంది.

ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా, అడివి శేష్ తన లీడింగ్ లేడి ని ఈ హై ఆక్టేన్ ఫేస్ ఆఫ్‌లోకి స్వాగతిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ గా చేరారు. ఇద్దరు ఎక్స్ లవర్స్ మధ్య యాక్షన్, ఎమోషన్, డ్రామాతో నిండిన కథలోకి ఎంటరవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.

యాక్టర్ పుట్టినరోజున సినిమా అనౌన్స్ మెంట్ చేసే ట్రెండ్‌కి బిన్నంగా, అడివి శేష్ తన ఫీమేల్ లీడ్ మృణాల్ ఠాకూర్‌ని అనౌన్స్ చేసి, అతని పుట్టినరోజును మరింత ప్రత్యేకంగా చేశారు. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ పాత్రల మధ్య కెమిస్ట్రీని ప్రజెంట్ చేస్తూ డకోయిట్ టీం ఇంటెన్స్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. తనకు ద్రోహం చేసిన తన ఎక్స్ లవర్ పై ప్రతీకారం తీర్చుకునే కోపంతో ఉన్న దోషి కథగా డకోయిట్ వుండబోతుంది. ప్రేమ, ద్రోహం,ప్రతీకారం పవర్ ద్వారా నడిచే తీవ్రమైన యాక్షన్ డ్రామాకు వేదికగా ఆమెను ట్రాప్ చేయడానికి అతను ప్రమాదకరమైన ప్లాన్ ని రూపొందించాడు.

అడివి శేష్ ,మృణాల్ ఠాకూర్‌లతో కూడిన రెండు కొత్త పోస్టర్‌లు విడుదల చేశారు, వారి పాత్రల ఇంటెన్స్ డైనమిక్స్ ని ప్రజెంట్ చేస్తున్నాయి. ఒక పోస్టర్‌లో, శేష్ ఫెరోషియస్ గా కనిపించారు,మృణాల్ అతని వైపు విచారంగా చూస్తోంది. రెండవ పోస్టర్ భిన్నమైన ఇంటన్సిటీని చూపిస్తోంది. శేష్ కారులో స్టైలిష్‌గా కూర్చుని, సిగరెట్ వెలిగించగా, మృణాల్ కారు నడుపుతూ, చేతిలో తుపాకీతో కనిపించింది. రెండు పోస్టర్లు క్యారెక్టర్స్ కాంప్లెక్స్ సిటీని హైలైట్ చేస్తున్నాయి.

మృణాల్ ఠాకూర్‌ను డకాయిట్ ప్రపంచానికి స్వాగతిస్తూ, అతని పుట్టినరోజు సందర్భంగా ఈ గ్రేట్ అనౌన్స్ మెంట్ చేసిన అడివి శేష్ మాట్లాడుతూ "డకోయిట్ టచ్చింగ్ లవ్ స్టొరీతో కూడిన ఇంటెన్స్ యాక్షన్ మూవీ. మృణాల్ బిగ్ స్క్రీన్ పై కొన్ని అత్యుత్తమ పాత్రలకు జీవం పోషింది, ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకతను తీసుకురావడం, ప్రతి పాత్రను ఎలివేట్ చేయడంలో ఆమె అసాధారణమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. మృనాల్‌ను డాకోయిట్ టీమ్‌కి స్వాగతిస్తున్నాను బిగ్ స్క్రీన్స్ పై తలపడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను."

డాకాయిట్ టీమ్‌లో చేరినందుకు సంతోషించిన మృనాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. "డకాయిట్ టీమ్‌లో చేరినందుకు సంతోషిస్తున్నాను, అడివి శేష్, షానీల్ డియో స్టైలిష్ విజన్ తో ఇంటెన్స్ కథలను బ్లెండ్ చేస్తూ డకోయిట్ కథని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. సినిమాలో నా పాత్ర యాక్టర్ గా కొత్త కోణాలను అన్వేషించే అవకాశాన్ని అందిస్తుంది. ఆర్ట్, స్క్రిప్ట్, విజన్ కలయిక ఈ ప్రాజెక్ట్‌ చాలా ఎక్సయిట్మెంట్ ఇచ్చింది. షానెల్ ప్రపంచంలో లీనం కావడం ఆనందంగా వుంది' అన్నారు

దర్శకుడు షానీల్ డియో మాట్లాడుతూ"మృణాల్ ఠాకూర్ డాకోయిట్ టీంలో చేరినందుకు మేము సంతోషిస్తున్నాము. ఆమె మల్టీ ట్యాలెంటెడ్. ఈ యాక్షన్-ప్యాక్డ్ డ్రామాకు ఆమె జీవం పోస్తోంది. అడివి శేష్ ,మృణాల్ ఠాకూర్ జోడి అద్భుతంగా వుంటుంది. ఈ విలక్షణమైన పాత్రలో ప్రేక్షకులు ఆమెను చూసేందుకు , శేష్ , మృణాల్ తమ మొదటి ప్రాజెక్ట్‌లో కలిసి రూపొందిస్తున్న ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీని ఎక్స్ పీరియన్స్ చేయడానికి ఎదురుచూస్తున్నాను." అన్నారు

సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

తారాగణం: అడివి శేష్, మృణాల్ ఠాకూర్
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: షానిల్ డియో
కథ, స్క్రీన్‌ప్లే: అడివి శేష్, షానీల్ డియో
నిర్మాత: సుప్రియ యార్లగడ్డ
సహ నిర్మాత: సునీల్ నారంగ్
సమర్పణ: అన్నపూర్ణ స్టూడియోస్


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved