pizza

Don’t Sleep Ravindra Vijay look
ఇంద్ర రామ్, షామ్‌దత్, వి చూడామణి, వి డ్రీమ్ ఫిల్మ్స్ సైకలాజికల్ థ్రిల్లర్ 'డోంట్ స్లీప్' నుంచి రవీంద్ర విజయ్ స్టైలిష్ ఫస్ట్ లుక్‌ రిలీజ్

You are at idlebrain.com > news today >

03 May 2026
Hyderabad

మలయాళ ఫిల్మ్ మేకర్స్ తెలుగు స్టార్లతో కలిసి పనిచేస్తున్నారు. మమ్ముట్టి నటించిన 'స్ట్రీట్ లైట్స్'కి దర్శకత్వం వహించిన సినిమాటోగ్రాఫర్ షామ్‌దత్, 'చౌర్య పాఠం'లో ఆకట్టుకున్న ఇంద్ర రామ్ హీరోగా సైకలాజికల్ థ్రిల్లర్ 'డోంట్ స్లీప్' సినిమా చేస్తున్నారు. వి. చూడామణి ఈ చిత్రాన్ని వి డ్రీమ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం 2 గా నిర్మిస్తున్నారు.

ఇప్పటికే రివిల్ చేసిన టైటిల్, ఫస్ట్ లుక్‌ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రంలో రవీంద్ర విజయ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. రవీంద్ర విజయ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

ఫస్ట్ లుక్ లో రవీంద్ర విజయ్ స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకున్నారు. ఇంటెన్స్ వైబ్‌తో ఉన్న ఈ ఫస్ట్ లుక్ ఆయన పాత్రలో వున్న సస్పెన్స్, థ్రిల్ ఎలిమెంట్స్‌ ప్రజెంట్ చేస్తోంది.

ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం పని చేస్తోంది. 'పుష్ప: ది రైజ్' చిత్రానికి పనిచేసిన మోనికా-రామకృష్ణ ప్రొడక్షన్ డిజైన్‌ను నిర్వహిస్తున్నారు. సంగీతాన్ని గోకుల్ హర్షన్ అందించారు. స్టేట్ అవార్డు గ్రహీత అయిన మనోజ్ ఎడిటింగ్ చేశారు. గతంలో RDX , దుల్కర్ సల్మాన్ నటించిన ఐయామ్ గేమ్ చిత్రాలకు పనిచేసిన సజీర్, లూనా కథను అందించారు.

ఎమోషనల్, టెక్నికల్‌గా ఈ చిత్రం గొప్ప సైకాలజికల్ థ్రిల్లర్ అనుభూతిని ప్రేక్షకులకు అందించబోతుంది.

తారాగణం: ఇంద్ర రామ్, రవీంద్ర విజయ్, తబా రీమా, జ్యోతి బెనర్జీ, సునీల్ థాపా, ఆడుకలం నరేన్, కల్ప లత, అనీష్ కురువిల్లా, వెన్నెల కిషోర్, నాగి జబర్దస్త్, డాక్టర్ భద్రమ్, రఘుబాబు, తదితరులు.

సాంకేతిక సిబ్బంది:
డైరెక్టర్, DOP: షామ్‌దత్ ISC
కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు: సజీర్ బాబా & లూనా జబిన్
నిర్మాత: వి చూడామణి
బ్యానర్: వి డ్రీమ్ ఫిల్మ్స్
సంగీతం: గోకుల్ హర్షన్
ప్రొడక్షన్ డిజైన్: మోనికా రామకృష్ణ

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved