We have made "Drinker Sai" with a story that impressed Megastar Chiranjeevi garu - Director Kiran Tirumalasetti at the trailer launch
మెగాస్టార్ చిరంజీవి గారు ఓకే చేసిన కథతో "డ్రింకర్ సాయి" సినిమా రూపొందించాం - ట్రైలర్ లాంఛ్ లో డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టి
Dharma and Aishwarya Sharma play the lead roles in the movie Drinker Sai, which carries the tagline "Brand of Bad Boys." The film is being produced by Basavaraju Srinivas, Ismail Sheikh, and Basavaraju Laharidhar under the banners of Everest Cinemass and Smart Screen Entertainments. Directed by Kiran Tirumalasetti, the movie is based on real events. It is scheduled for a grand theatrical release on the 27th of this month. Today, the trailer for Drinker Sai was launched at Hyderabad's Prasad Labs. At the event:
DOP Prashanth Ankireddy said, "It’s a pleasure to work on Drinker Sai. This is a beautiful movie. Go to the theaters on the 27th of this month and watch it - you will all enjoy it."
Producer Ismail Sheikh shared, "Our director Kiran Garu has taken the story of Drinker Sai and made it even better than what was initially told. The entire team worked hard to make this movie a success. Chandrabose Garu has written six wonderful songs that elevate the story even further. Dharma worked with great dedication, often retaking scenes to ensure perfection. We are coming to you with a good movie like Drinker Sai on the 27th, and we hope you will support us."
Producer Laharidhar said, "Whatever interesting content you see in the trailer, you will experience more of it in the movie. We are confident that you will enjoy our film in the theaters. It will appeal to both family audiences and youth. Thanks to the entire team for their hard work."
Actress Kirrak Seetha expressed, "I thank our director Kiran Garu for giving me the opportunity to play a meaningful role in Drinker Sai. This role is different from the characters I’ve done before. Hero Dharma and heroine Aishwarya have performed impressively."
Director Kiran Tirumalasetti said, "I hope you all liked the trailer of Drinker Sai. The producer of this movie, Basavaraju Laharidhar, is the son of Basavaraju Srinivas Garu, a close friend of Megastar Chiranjeevi Garu. When I first told this story to Srinivas Garu, he suggested we show it to Chiranjeevi Garu and get his opinion. I then added a social element to the story and rewrote it. After that, GK Mohan Garu sent a message to Chiranjeevi Garu saying the story was good, and he replied that it would be fine. With his consent, Drinker Sai began production. If he had said no, the movie wouldn’t have happened. Dharma received training from Satyanand Garu and even won a gold medal. After Prabhas, Dharma is the only one to have received such training. He worked very dedicatedly for this film. When I saw Aishwarya, I felt she was a perfect match for the character of Baaghi in my story. Despite not speaking Telugu, she performed wonderfully. I would also like to thank editor Marthand K Venkatesh Garu and lyricist Chandrabose Garu for their great support. We made sure to include youthful elements to attract the youth audience to the theaters. I am confident that once the movie is released, my media friends will praise me for creating a good film."
Executive Producer Lakshmi said, "If the story is good, the audience will appreciate even small films. Our movie Drinker Sai has such good content. After watching the trailer, don't think that it’s meant for a specific section of the audience. The entire family can watch this movie together."
Heroine Aishwarya Sharma said, "I am happy to release the trailer of Drinker Sai in the presence of all of you. Thank you to the director and producers for giving me the opportunity to act in this movie. I don’t know Telugu, and I come from Mumbai, but my family has been very supportive. Dharma helped me learn my Telugu dialogues on set, and I’m happy to have found such a good co-star. Kirrak Seetha has become my best friend. Everyone in the team worked very dedicatedly. Drinker Sai will be released on the 27th of this month, and I hope you all will support me."
Hero Dharma said, "I have been passionate about movies since childhood. I used to dance to the songs of our star heroes' films. I trained under Satyanand Garu, and I felt very happy when I got the opportunity to be part of Drinker Sai. Some people criticized me after watching the movie trailer, but I am confident that no one will have negative opinions after watching the full film. We performed a screening for elderly people, and none of the 100 attendees had any complaints—they all said the movie was good. We also showed it to engineering college students, auto drivers, and masons, and received positive responses from everyone. No one in our team worked for money; we worked out of passion. Editor Marthand K Venkatesh Garu provided valuable insights about the movie. Our heroine Aishwarya performed wonderfully, and Kirrak Seetha did her scenes in a single take. Sri Vasanth's music and Chandrabose's lyrics have been well-received. I thank the entire team for giving me such a wonderful movie."
Cast: Dharma, Aishwarya Sharma, Posani Krishna Murali, Srikanth Iyengar, Sameer, SS Kanchi, Bhadram, Kirrak Seetha, Ritu Chowdhury, Fun Bucket Rajesh, Raja Prajwal, etc.
మెగాస్టార్ చిరంజీవి గారు ఓకే చేసిన కథతో "డ్రింకర్ సాయి" సినిమా రూపొందించాం - ట్రైలర్ లాంఛ్ లో డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టి
ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "డ్రింకర్ సాయి". బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నెల 27న ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు "డ్రింకర్ సాయి" సినిమా ట్రైలర్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో
డీవోపీ ప్రశాంత్ అంకిరెడ్డి మాట్లాడుతూ - "డ్రింకర్ సాయి" సినిమాకు వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. చాలా బ్యూటిఫుల్ మూవీ ఇది. ఈ నెల 27న థియేటర్స్ కు వెళ్లి తప్పకుండా చూడండి. మీరంతా ఎంజాయ్ చేస్తారు. అన్నారు.
నిర్మాత ఇస్మాయిల్ షేక్ మాట్లాడుతూ - "డ్రింకర్ సాయి" సినిమా కథను ఎంతబాగా చెప్పారో అంతకంటే బాగా రూపొందించారు మా డైరెక్టర్ కిరణ్ గారు. ఈ సినిమాను బాగా తెరకెక్కించడం కోసం టీమ్ లోని ప్రతి ఒక్కరూ శ్రమించారు. చంద్రబోస్ గారు ఆరు పాటలను అద్భుతంగా రాశారు. అవన్నీ కథను మరింత ఎలివేట్ చేసేలా ఉంటాయి. ధర్మ ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేశాడు. అడిగి మరీ రీటేక్స్ చేసేవాడు. "డ్రింకర్ సాయి" వంటి ఒక మంచి మూవీతో మీ ముందుకు ఈ నెల 27న వస్తున్నాం. మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.
నిర్మాత లహరిధర్ మాట్లాడుతూ - "డ్రింకర్ సాయి" సినిమా ట్రైలర్ లో ఎలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉందో సినిమాలోనూ అలాంటి కంటెంట్ చూస్తారు. థియేటర్స్ లో మా మూవీని ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ ఆడియెన్స్ తో పాటు యూత్ కు బాగా నచ్చేలా సినిమా ఉంటుంది. మా టీమ్ అందరికీ థ్యాంక్స్. అన్నారు.
నటి కిర్రాక్ సీత మాట్లాడుతూ - "డ్రింకర్ సాయి" సినిమాలో ఒక మంచి రోల్ లో నటించే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ కిరణ్ గారికి థ్యాంక్స్. నేను ఇప్పటిదాకా చేసిన క్యారెక్టర్స్ కు భిన్నమైన రోల్ ఈ చిత్రంలో చేశాను. హీరో ధర్మ, హీరోయిన్ ఐశ్వర్య..ఆకట్టుకునేలా పర్ ఫార్మ్ చేశారు. అన్నారు.
డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టి మాట్లాడుతూ - "డ్రింకర్ సాయి" ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నా. ఈ సినిమా ప్రొడ్యూసర్ బసవరాజు లహరిధర్ వాళ్ల నాన్నగారు శ్రీనివాస్ గారికి మెగాస్టార్ చిరంజీవి గారు మంచి మిత్రులు. నేను ఈ కథను శ్రీనివాస్ గారికి చెప్పినప్పుడు చిరంజీవికి చెబుదాం ఆయన ఒపీనియన్ తీసుకుందాం అన్నారు. అప్పుడు నేను కథలో సోషల్ ఎలిమెంట్ యాడ్ చేస్తూ రీ రైట్ చేశాను. ఆ తర్వాత "డ్రింకర్ సాయి" కథ చాలా బాగుందని జీకే మోహన్ గారు చిరంజీవి గారికి మెసేజ్ పంపిస్తే ఆయన ఓకే అని రిప్లై ఇచ్చారు. అలా మెగాస్టార్ గారి అంగీకారంతో "డ్రింకర్ సాయి" సినిమా మొదలైంది. ఆయన నో చెప్పి ఉంటే ఈ సినిమా ఉండేది కాదు. ధర్మ సత్యానంద్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు. గోల్డ్ మెడల్ సాధించాడు. సత్యానంద్ గారి దగ్గరి శిక్షణ తీసుకున్న వాళ్లలో ప్రభాస్ తర్వాత ధర్మ పేరే చెబుతారు. ఈ సినిమాకు ధర్మ ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేశాడు. హీరోయిన్ ఐశ్వర్యను చూడగానే నా కథలోని బాగీ క్యారెక్టర్ కు సరిగ్గా సరిపోతుంది అనిపించింది. ఆమె తెలుగు రాకున్నా అద్భుతంగా పర్ ఫార్మ్ చేసింది. ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ గారు, లిరిసిస్ట్ చంద్రబోస్ గారు మాకు ఎంతో సపోర్ట్ చేశారు వారికి థ్యాంక్స్ చెబుతున్నా. యూత్ ఆడియెన్స్ ను థియేటర్స్ కు రప్పించేందుకే కొంత యూత్ ఫుల్ కంటెంట్ పెట్టాల్సివచ్చింది. థియేటర్స్ కు వచ్చాక డెఫనెట్ గా బాగుందని అంటారు. ఈ సినిమా చూశాక ఒక మంచి మూవీ చేశావని మీడియా మిత్రులు తప్పకుండా నన్ను ప్రశంసిస్తారు. ఆ నమ్మకం నాకు ఉంది. అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లక్ష్మీ మాట్లాడుతూ - కథలో దమ్ముంటే చిన్న చిత్రాలను కూడా ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. అలాంటి మంచి కంటెట్ మా "డ్రింకర్ సాయి" మూవీలో ఉంది. ట్రైలర్ చూసి ఇది ఒక సెక్షన్ ఆడియెన్స్ కోసం అనుకోకండి. ఫ్యామిలీ అంతా కలిసి ఈ సినిమాను చూడొచ్చు. అన్నారు.
హీరోయిన్ ఐశ్వర్య శర్మ మాట్లాడుతూ - "డ్రింకర్ సాయి" సినిమా ట్రైలర్ మీ అందరి సమక్షంలో రిలీజ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. నాకు ఈ మూవీలో నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ థ్యాంక్స్. నాకు తెలుగు రాదు. ముంబై నుంచి వచ్చాను. నా ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో సపోర్ట్ చేశారు. సెట్ లో తెలుగు డైలాగ్స్ నేర్చుకునేందుకు ధర్మ హెల్ప్ చేశాడు. అలాంటి మంచి కోస్టార్ దొరికినందుకు హ్యాపీగా ఉంది. కిర్రాక్ సీత నాకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యింది. అలాగే టీమ్ లోని ప్రతి ఒక్కరూ ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేశారు. ఈ నెల 27న "డ్రింకర్ సాయి" సినిమా రిలీజ్ కు వస్తోంది. మీరంతా సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
హీరో ధర్మ మాట్లాడుతూ - నాకు చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే ప్యాషన్. మన స్టార్ హీరోస్ సినిమాల పాటలకు డ్యాన్స్ లు చేసేవాడిని. సత్యానంద్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. "డ్రింకర్ సాయి" సినిమాలో అవకాశం వచ్చినప్పుడు హ్యాపీగా ఫీలయ్యా. మా మూవీ ట్రైలర్ చూసి నన్ను కొంతమంది తిడుతున్నారు. కానీ సినిమా చూస్తే ఒక్కరు కూడా తిట్టరు. డ్రింకర్ సాయి మీకు నచ్చుతాడని బల్లగుద్ది చెబుతున్నా. మేము కొంతమంది పెద్ద వయసు వాళ్లకు షో వేశాం. వాళ్లలో వందకు వంద మంది ఎక్కడా ఇబ్బంది పడలేదు. సినిమా బాగుందన్నారు. అలాగే ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కు, ఆటో డ్రైవర్స్, తాపీ మేస్త్రి వాళ్లకు షో వేశాం. అందరి నుంచీ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మా టీమ్ లో ఎవరూ డబ్బుల కోసం పనిచేయలేదు. ప్యాషన్ తో వర్క్ చేశారు. ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ గారు సినిమా గురించి ఎన్నో విషయాలు చెప్పారు. అలాగే మా హీరోయిన్ ఐశ్వర్య అద్భుతంగా పర్ ఫార్మ్ చేసింది. కిరాక్ సీత ఒకే టేక్ లో సీన్స్ చేసేది. శ్రీ వసంత్ మ్యూజిక్, చంద్రబోస్ గారి లిరిక్స్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంతమంచి మూవీ నాకు ఇచ్చినందుకు మా మూవీ టీమ్ అందరికీ థ్యాంక్స్. అన్నారు.