1 September 2018
                            Hyderabad
                          The first look of ‘Adhugo’ is unveiled by the makers. As the film has a piglet in the lead role, the first look introduces to the piglet which is called Bunty. The piglet hangs to a wooden fencing with a smile on his face and this is endearing. 
                          Written and directed by Ravi Babu, the movie also stars Abhishek Varma and Nabha in the lead cast. This is for the first time live-action 3D animation has been extensively used to create a stunning photo-realistic piglet on the Indian screen.
                          ‘Adhugo’ is in its final stages and the makers are aiming for Dussehra release. Noted producer Suresh Babu is presenting the movie in association with Suresh Productions banner.
                          Prashanth Vihari is composing music while N Sudhakar Reddy has handled the cinematography. 
                          Ravi Babu has produced the film under A Flying Frog banner and ‘Adhugo’ is getting dubbed into all Indian languages. ‘Bunty’ is the title for the rest of the versions.
                          Cast: Abhishek Varma, Nabha, Ravi Babu, Uday Bhaskar, RK, Virender Chowdary.
                          Crew:
                            Story & Direction: Ravi Babu
                            Producer: Ravi Babu
                            Banner: A Flying Frog
                            Presented by: Suresh Productions
                            Screenplay: Satyanand
                            Music: Prashanth R Vihar
                            DoP: N Sudhakar Reddy
                            Art Director: Narayana Reddy
                            Editor: Balla Satyanarayana
                            Action: Kanal Kannan, Vijay, Satish
                            Lyrics: Bhaskarbhatla
                            Dialogues: Ravi Babu, Nivas
                            PRO:VamsiShekar
                          రవిబాబు 'అదుగో' ఫస్ట్ లుక్ విడుదల..!!
                          రవిబాబు నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా అదుగో. ఈ సినిమాలో పంది పిల్ల కీలకపాత్రలో నటిస్తుంది. ఇప్పుడు ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇందులో పిగ్ లెట్ బంటిని పరిచయం చేసారు దర్శక నిర్మాతలు. చెక్క కంచెకు వేలాడుతూ నవ్వుతూ ఉన్న పందిపిల్ల చాలా క్యూట్ గా అందర్నీ అలరిస్తుంది. రవిబాబుతో పాటు ఈ చిత్రంలో అభిషేక్ వర్మ, నభా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలి సారి పూర్తిస్థాయి లైవ్ యాక్షన్ 3డి యానిమేషన్ ను చూపిస్తోన్న సినిమా ఇది. ఇందులో పందిపిల్లను చాలా రియల్ గా చూపించే ప్రయత్నం చేసారు గ్రాఫిక్స్ టీం. దీనికోసం చాలా విజువల్ ఎఫెక్ట్స్ కూడా వాడుకున్నారు రవిబాబు. షూటింగ్ తో పాటు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని దసరా సెలవుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అదుగో చిత్రం. 
                          అందరికీ కనెక్ట్ అయ్యే యూనిక్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు రవిబాబు. సురేష్ ప్రొడక్షన్ సంస్థలో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తుండగా.. ఎన్ సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఏ ఫ్లైయింగ్ ఫ్రాగ్ బ్యానర్ లో రవిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అదుగో అన్ని భారతీయ భాషల్లో విడుదల అవుతుండటం విశేషం. కుటుంబ ప్రేక్షకులను.. ముఖ్యంగా పిల్లలను బాగా ఆకట్టుకునే కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు రవిబాబు. అందుకే ఈ చిత్రాన్ని వీలైనన్ని భాషల్లో విడుదల చేయాలని భావిస్తున్నారు నిర్మాతలు. తెలుగులో అదుగో అనే టైటిల్ తోనే రానున్న ఈ చిత్రం.. మిగిలిన భాషల్లో మాత్రం బంటి పేరుతో విడుదల కానుంది. 
                          నటీనటులు: 
                            అభిషేక్ వర్మ, నభా, రవిబాబు, ఉదయ్ భాస్కర్, ఆర్కే, వీరేందర్ చౌదరి..
                          సాంకేతిక నిపుణులు:
                            కథ, దర్శకుడు: రవిబాబు
                            నిర్మాత: రవిబాబు
                            సంస్థ: ఏ ఫ్లైయింగ్ ఫ్రాగ్ 
                            సమర్పణ: సురేష్ ప్రొడక్షన్స్ 
                            సంగీతం: ప్రశాంత్ ఆర్ విహార్ 
                            డిఓపి: ఎన్ సుధాకర్ రెడ్డి 
                            ఆర్ట్ డైరెక్టర్: నారాయణ రెడ్డి 
                            ఎడిటర్: బల్ల సత్యనారాయణ
                            యాక్షన్: కనల్ కణ్ణన్, విజయ్, సతీష్
                            లిరిక్స్: భాస్కరబట్ల 
                            మాటలు: రవిబాబు, నివాస్ 
                            పిఆర్ఓ: వంశీ శేఖర్