21 June 2017
Hyderabad
Supreme Hero Sai Dharam Tej and Mehreen Kaur Pirzada starrer new film Jawaan is directed by BVS Ravi and produced by Krishna under Arunachal Creations Banner. Ace producer Dil Raju is presenting the film which is done with talkie part. Two songs of the film were shot recently in some picturesque locations in Italy. The production unit will can action part from 23rd of this month in Hyderabad. Remaining portions will be shot in July. Makers are planning to release the movie in August.
Already released pre-look poster and title logo were well received and makers are delighted with the reception. First look poster of the film will be released tomorrow on the eve of director BVS Ravi's birthday.
While speaking on the occasion, Dil Raju said, “Sai Dharam Tej has good relationship with our banner. Director BVS Ravi too has good association with our production banner. Jawaan is a good and perfect story for Sai Dharam Tej. My close friend Krishna is producing the film. Works are happening as per schedule dates and movie is coming out really well. Jawaan pre-look was good and first look poster will also be far better.”
Director BVS Ravi said, “Jawaan is being made with a good concept. Our intention is to tell that, like how important a Jawaan is to our country, every family needs a person like our hero. How a middle class guy solves his family issues with his self confidence and intelligence is plot of Jawaan. That's why we put the caption - 'Intikokkadu' to the film. It is a complete and commercial family entertainer with right blend of emotions. SS Thaman has provided wonderful tunes. Mehreen Kaur is special attraction in the film. Prasanna has acted as main antagonist. Like how the pre look poster had enthralled, the first look too will please movie buffs.”
Producer Krishna said, “Dil Raju is our strength to make Jawaan. He helped in completing the film smoothly. The story narrated by BVS Ravi suits aptly to Sai Dharam Tej as it has mass and commercial elements in it. We made the film lavishly without compromising on budget and other things. We recently completed canning 2 songs in exotic locations in Italy. Raghu master and Sekhar choreographed one song each. Both these songs have come out well. We will start shooting action portions from 23rd of this month in Hyderabad and wrap up remaining portions in July to release the film. We will release Jawaan first look poster on June 22nd on the eve of BVS Ravi's birthday. We wish our director BVS Ravi a very happy birthday on behalf of Jawaan team.”
Cast: Sai Dharam Tej, Mehreen Kaur, Prasanna, Jaya Prakash, Eashwari Rao etc.
Technicians:
Cameraman - KV Guhan
Music – SS Thaman
Art - Brahma Kadali
Editing - SR Sekhar
Co-writers - Kalyan Varma Dandu, Sai Krishna, Vamsi Balapanuri
Banner - Arunachal Creations
Presenter - Dil Raju
Producer - Krishna
Story, Screenplay, Dialogues, Direction - BVS Ravi
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, బివిఎస్ రవి, కృష్ణ జవాన్ మొదటి లుక్
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా బివిఎస్ రవి దర్శకత్వం వహిస్తున్నచిత్రం జవాన్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే టాకీ పార్టు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఇటలీ లో రెండు పాటలు షూటింగ్ జరుపుకున్నారు. ఈ నెల 23 నుండి హైదరాబాద్ లో యాక్షన్ పార్టు చిత్రీకరిస్తారు. మిగిలిన షూటింగ్ పార్ట్ అంతా జులై లో షూట్ చేసి అగష్టు లో చిత్రాన్ని విడుదల చేయటానికి నిర్మాతలు సన్నాహలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రీలుక్ పోస్టర్, టైటిల్ కి చాలా మంచి స్పందన రావటంతో యూనిట్ సభ్యులు మరింత ఉత్సాహంతో వున్నారు. చిత్ర దర్శకుడు బివిఎస్ రవి జన్మదినోత్సవం సందర్బంగా ఈ చిత్రం మెదటి లుక్ ని విడుదల చేశారు.
దిల్ రాజు మాట్లాడుతూ.... సాయి ధరమ్ తేజ్ కు మా బ్యానర్ కు మంచి రిలేషన్ ఉంది. బివిఎస్ రవి మా ప్రొడక్షన్ కి మాకు మంచి రిలేషన్ వుంది. జవాన్ స్టోరీ చాలా బాగుంటుంది సాయి ధరమ్ తేజ్ కు సరిగ్గా సరిపోయే స్టోరీ. ఈ చిత్రాన్ని మా సన్నిహితుడు కృష్ణ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా అనుకున్నట్టుగా అనుకున్న టైం లో చాలా బాగా వచ్చింది. జవాన్ ప్రీలుక్ చాలా బాగుంది అలానే ఇప్పడు విడుదల చేసిన మెదటి లుక్ కూడా చాలా బాగుంది. అని అన్నారు.
దర్శకుడు బివిఎస్ రవి మాట్లాడుతూ... జవాన్ చిత్రం మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది. దేశానికి జవాన్ ఎంత అవసరమో... ప్రతీ ఇంటికి మా కథానాయకుడి లాంటి వాడు ఉండాలని చెప్పడమే మా ఉద్దేశ్యం. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఓ యువకుడికి ఎలాంటి కష్టాలు వచ్చాయి. తన కుటుంబాన్ని మనోదైర్యంతో తన బుద్దిబలంతో ఎలా కాపాడుకున్నాడన్నదే జవాన్ కథ. అందుకే ఇంటికొక్కడు అనే క్యాప్షన్ పెట్టాం. ఇది పక్కా ఫ్యామీలీ ఎమోషన్స్ తో కూడిన ఎంటర్ టైనింగ్ కమర్షియల్ చిత్రం. తమన్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు. మెహ్రీన్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ప్రసన్న మెయిన్ విలన్ గా నటించారు. మా ప్రీలుక్ ఎలా ఆకట్టుకుందో, ఈ మెదటిలుక్ కూడా దాన్ని మించి ఆకట్టుకుంటుంది. అని అన్నారు.
నిర్మాత కృష్ణ మాట్లాడుతూ.... జవాన్ ప్రాజెక్ట్ విషయంలో మా ధైర్యం మా దిల్ రాజు గారు. ఆయన ముందుండి ఈ ప్రోజెక్ట్ ని స్మూత్ గా కంప్లీట్ చేశారు. దర్శకుడు బివిఎస్ రవి చెప్పిన కథ మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో సాయిధరమ్‌తేజ్ కి సరిగ్గా సరిపోయె కథ. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా గ్రాండియర్ గా ఈ చిత్రాన్ని నిర్మించాం. ఇటీవలే ఇటలీ లో అందమైన లోకేషన్స్ లో రెండు పాటలు షూటింగ్ పూర్తిచేసుకున్నాం. కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ ఓ పాటని, శేఖర్ మాస్టర్ ఓ పాటని కొరియోగ్రఫి చేశారు. సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. జూన్ 23నుండి హైదరాబాద్ లో యాక్షన్ పార్ట్ చిత్రికరిస్తాము. మిగిలిని షూటింగ్ పార్ట్ ని జులైలో కంప్లీట్ చేసి అగష్టు లో చిత్రాన్ని విడుదల చేస్తాము. జూన్ 22న దర్శకుడు బివియస్ రవి జన్మదినోత్సవం సంధర్బంగా జవాన్ చిత్రం మెదటి లుక్ ని విడుదల చేస్తున్నాము. మా దర్శకుడికి జవాన్ చిత్ర యూనిట్ తరుపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అని అన్నారు.
నటీనటులు - సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్, ప్రసన్న , జయప్రకాష్, ఈశ్వరీ రావ్ తదితరులు
కెమెరా మెన్ - కెవి గుహన్
మ్యూజిక్ - తమన్
ఆర్ట్ - బ్రహ్మ కడలి
ఎడిటింగ్ - ఎస్.ఆర్.శేఖర్
సహ రచయితలు - కళ్యాణ్ వర్మ దండు, సాయి కృష్ణ, వంశీ బలపనూరి
బ్యానర్ - అరుణాచల్ క్రియేషన్స్
సమర్పణ - దిల్ రాజు
నిర్మాత - కృష్ణ
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ - బివిఎస్ రవి