22 July 2018
                          Hyderabad
                          
                            The first look of actress Samantha Akkineni from her upcoming mystery thriller ‘U Turn’ is unveiled. Samantha is seen in a serious look which suits her role from the movie. She is playing an investigative journalist in the movie.
                          Pawan Kumar is directing ‘U Turn’ and the talkie part of the shoot has been wrapped up. The film also stars Aadhi Pinisetty in a police officer role while Rahul Ravindran and Bhumika Chawla in key supporting roles.
                          The post-production works are in progress while the shooting of the songs will resume in coming days.
                          Music is by Poorna Chandra Tejaswi and cinematography is being handled by Niketh Bommi.
                          The release date of ‘U Turn’ is confirmed on September 13th.
                          Cast: 
                            Samantha, Aadhi Pinisetty, Rahul Ravindran, Bhumika Chawla, Narain
                          Crew:
                            Story & Direction: Pawan Kumar
                            Producers: Srinivasaa Chitturi and Rambabu Bandaru
                            Banners: Srinivasaa Silver Screen and VY Combines
                            Music: Poorna Chandra Tejaswi
                            Cinematography: Niketh Bommi
                            Art Director: AS Prakash
                            Editor: Suresh Arumugam
                            PRO: Vamsi-Shekar
                          సమంత "యూ టర్న్" ఫస్ట్ లుక్ విడుదల !                          
                          వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న అక్కినేని సమంత నటిస్తున్న తాజా చిత్రం "యూ టర్న్" ఫస్ట్ లుక్ ఇవాళ విడుదలైంది. మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో సమంత ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా నటిస్తోంది. ఆది పినిశెట్టి పోలీస్ ఆఫీసర్ గా ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో రాహుల్ రవీంద్రన్, భూమిక చావ్లా కీలకపాత్రలు పోషిస్తున్నారు. "రంగస్థలం, అభిమన్యుడు, మహానటి" చిత్రాలతో ఘన విజయాలు సొంతం చేసుకోవడంతోపాటు.. నటిగా తన స్థాయిని పెంచుకొన్న సమంత "యూ టర్న్"తో తన నటవిశ్వరూపం చూపనుంది. ఆమె ఇంటెన్స్ లుక్స్, సబ్టుల్ పెర్ఫార్మెన్స్ "యూ టర్న్" చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. చిత్రీకరణ దాదాపుగా పూర్తి చేసుకొన్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆల్రెడీ మొదలవ్వగా.. త్వరలోనే పాటల చిత్రీకరణ మొదలుపెట్టనున్నారు. సమంత వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13న విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నారు దర్శకనిర్మాతలు. 
                          తారాగణం: 
                            సమంత, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక చావ్లా తదితరులు.. 
                          సాంకేతికవర్గం: 
                            కథ-దర్శకత్వం: పవన్ కుమార్ 
                            నిర్మాతలు; శ్రీనివాస చిట్టూరి-రాంబాబు బండారు 
                            నిర్మాణ సంస్థలు: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ & వివై కంబైన్స్ 
                            సంగీతం: పూర్ణచంద్ర తేజస్వి 
                            ఛాయాగ్రహణం: నికేత్ బొమ్మి 
                            కళ: ఏ.ఎస్.ప్రకాష్ 
                            కూర్పు: సురేష్ అరుముగమ్ 
                            పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్