pizza

Gandhi Tatha Chettu on Amazon
అమోజన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న "గాంధీ తాత చెట్టు" అందరి హృదయాలను హత్తుకుంటుంది

You are at idlebrain.com > news today >

23 March 2025
Hyderabad

ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ కూతురు సుకృతి వేణి నటించిన చిత్రం 'గాంధీ తాత చెట్టు'. ఇటీవల థియేటర్స్‌లో విడుదలై అందరి హృదయాలను హత్తుకున్న ఈ సందేశాత్మక చిత్రం ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ అమోజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతూ అందరి హృదయాలను హత్తుకుంటోంది. సినిమా అంటే కేవలం వినోదం కోసమే మాత్రం కాదు సమాజానికి స్ఫూర్తినిచ్చే ఓ అద్భుతమైన సాధనం. అనే మాటలు ఈ చిత్రానికి అతికినట్టుగా సరిపోతాయి. సాధారణ కమర్షియల్‌ అంశాలతో పాటు ఈ చిత్రంలో అందరిలో సామాజిక స్పృహను కలిగించే అంశాలు ఉన్నాయి. అమోజన్‌ ప్రైమ్‌లో చూసిన వారు ఈచిత్రం గురించి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే '' ఈ కథ గాంధీ అనే ఓ ధైర్యవంతమైన అమ్మాయి కథ ఇది. కార్పొరేట్ సంస్థలు ఊరిని కొని, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టేందుకు ప్రయత్నిస్తాయి. ఊరి ప్రజలు డబ్బుకు ఆశపడి తమ పొలాలను అమ్మేస్తారు. కానీ గాంధీ మాత్రం తన ఊరిని ఎలాగైనా కాపాడాలని నిశ్చయించుకుంటుంది.తన తాత పేరు నిలబెట్టాలన్న సంకల్పంతో, ఊరికి కొత్త ఆశను అందించేందుకు గాంధీ చేసిన ప్రయత్నాలు ప్రేక్షకుల హృదయాలను తాకుతాయి. ఊరి ప్రజలు గాంధీ బెల్లం తయారీవిధానం నేర్చుకుంటారు. ఎవరూ చెరుకు కొనడానికి ముందుకు రాకపోయినా, గాంధీ తన తెలివితో ఊరిని తిరిగి నిలబెట్టే విధానం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.ఈ చిత్రంలో సుకుమార్‌ కూతురు సుకృతి నటనకు అందరి నుంచి మంచి ప్రశంసలు లభించాయి. సినిమా యొక్క కథ, పాత్రలు, విజువల్స్, హృదయాన్ని హత్తుకునే డైలాగులు అందరికీ కనెక్ట్ అయ్యాయి. ప్రస్తుతం "గాంధీ తాత చెట్టు" అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్‌ అవుతూ అందర్ని అలరిస్తోంది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved