To provide a cultural treat for Telugu officials, employees, their families, and Telugu-speaking professionals from various fields living in the national capital Delhi, the film Hari Hara Veera Mallu—starring Andhra Pradesh Deputy Chief Minister Shri Pawan Kalyan—is being screened for two days at AP Bhavan.
The screenings are being held over the weekend, Saturday and Sunday, at the Dr. B.R. Ambedkar Auditorium, with two shows scheduled. AP Bhavan Resident Commissioner Shri Lav Agarwal officially announced the event. The initiative is aimed at Telugu individuals settled in Delhi, including those working in various departments of the central government.
The first show was held on Saturday at 7 PM, which saw a full house. Another show is scheduled for Sunday, July 27th, at 4 PM. The audience response has been highly positive and encouraging.
ఢిల్లీ ఏపీ భవన్ లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన
దేశ రాజధాని ఢిల్లీలో నిత్యం బిజీ జీవితం గడుపుతున్న తెలుగు అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతోపాటు వివిధ రంగాల్లో విధులు నిర్వర్తిస్తున్న తెలుగు వారి కోసం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు చిత్రాన్ని రెండు రోజుల పాటు ఏపీ భవన్ లో ప్రదర్శిస్తున్నారు. వారాంతపు సెలవు దినాలు అయన శని, ఆదివారాల్లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆడిటోరియంలో రెండు షోలు వేస్తున్నట్టు ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ శ్రీ లవ్ అగర్వాల్ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న తెలుగు వారి కోసం ఢిల్లీలో స్థిరపడిన తెలుగు వారి కోసం చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. శనివారం రాత్రి 7 గంటలకు మొదటి షో వేయగా ఆడిటోరియం ప్రేక్షకులతో నిండిపోయింది. 27వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు మరో షో వేయనున్నారు. ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన లభించింది.