Power Star Pawan Kalyan’s latest film Hari Hara Veera Mallu: Part 1 – Sword vs Spirit is creating waves at the box office. Following the release of Bheemla Nayak, Pawan became increasingly occupied with political commitments, making fans eagerly await his return to the silver screen. Set against the backdrop of the 17th-century Mughal Empire, this grand historical action-adventure has brought Pawan Kalyan back to theatres in a powerful way.
The film, which released worldwide on July 24, 2025, had already achieved bumper openings with premiere shows held on the evening of July 23. It has recorded the highest opening of Pawan Kalyan’s career, setting the tone for a successful run.
Post-release, the makers officially announced that a few scenes in the second half were trimmed and enhanced graphics were uploaded as part of a revised version. This new cut has piqued interest not just among Pawan’s fans, but also general audiences. These updates have injected fresh energy into the film’s momentum, leading to a noticeable spike in collections over the weekend, especially on Saturday and Sunday compared to Friday.
Audiences have been captivated by the story of Pawan Kalyan’s battle to protect Sanatana Dharma and his journey to save five revered Gurus. The climax fight scenes, choreographed by Pawan himself after a long gap, have particularly thrilled fans. Many took to social media to express their excitement and admiration.
MM Keeravani’s music, especially his background score during the action sequences, has added significant depth and intensity, earning widespread praise.
With the improved visuals and updated content, Hari Hara Veera Mallu is expected to sustain strong box office momentum in the coming days. Appealing to family audiences and mass crowds alike, the film is riding high on Pawan Kalyan’s stardom, a compelling storyline, and its emotional connect, suggesting a solid and sustained box office performance ahead.
బాక్సాఫీస్ వద్ద పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు: రచ్చ
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు: పార్ట్ 1 - స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. భీమ్లా నాయక్ తర్వాత రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ నుంచి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. ఈ క్రమంలో, 17వ శతాబ్దం మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో రూపొందిన ఈ భారీ చారిత్రక యాక్షన్-అడ్వెంచర్ చిత్రంతో పవన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం ఆయన కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించి, బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. జూలై 24, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘హరిహర వీరమల్లు’ బుధవారం (జూలై 23) సాయంత్రం నిర్వహించిన ప్రీమియర్ షోలతోనే బంపర్ ఓపెనింగ్ సాధించింది. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్, సినిమా విడుదలైన తర్వాత, సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ ట్రిమ్ చేయడంతో పాటు కొత్త గ్రాఫిక్స్ కంటెంట్‌ను అప్‌లోడ్ చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త వెర్షన్‌ను చూసేందుకు పవన్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ మార్పులు సినిమాకు మరింత జోష్‌ను తీసుకొచ్చాయి, ఫలితంగా శుక్రవారంతో పోలిస్తే శనివారం, ఆదివారం కలెక్షన్స్‌లో గణనీయమైన జంప్ కనిపించింది. సినిమాలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం చేసే పోరాటం, ఐదుగురు గురువులను కాపాడేందుకు ఆయన చేసే ప్రయాణం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ స్వయంగా కంపోజ్ చేసిన క్లైమాక్స్ ఫైట్ సీన్స్ అభిమానులను ఉర్రూతలూగించాయి. ఈ ఫైట్ సీన్స్‌ను చూసిన అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం, ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాకు మరింత బలాన్ని చేకూర్చాయని ప్రశంసలు అందుకుంటోంది. కొత్త కంటెంట్, మెరుగైన విజువల్స్‌తో ‘హరిహర వీరమల్లు’ రాబోయే రోజుల్లో మరింత బలంగా కలెక్షన్స్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షిస్తున్న ఈ చిత్రం, పవన్ కళ్యాణ్ స్టార్‌డమ్, బలమైన కథాంశం, ఎమోషనల్ కనెక్ట్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.