pizza

Pawan’s Performance is the Soul of Hari Hara Veera Mallu
హరిహర వీరమల్లులో పవన్ నటన కలికితురాయి

You are at idlebrain.com > news today >

25 July 2025
Hyderabad

Hari Hara Veera Mallu, starring Pawan Kalyan as the hero and Nidhhi Agerwal as the heroine, had its grand premieres on Wednesday. While the film as a whole is impressive, it is Pawan Kalyan’s performance in the climax sequences that truly stands out. His acting in those moments becomes the beating heart of the entire film.

After a long gap from intense roles like in Daddy, Khushi, and Johnny, Pawan Kalyan has choreographed the climax fight himself for this film. The 18-minute fight sequence is being hailed as one of the major highlights of the movie, with audiences repeatedly pointing it out as a standout element.

The film also features Bobby Deol, Subbaraju, Sunil, and Sachin Khedekar in crucial roles. Veeramallu, the character played by Pawan Kalyan, emerges as one of the forgotten warriors who stood up against the arrogance and dominance of Aurangzeb, fighting valiantly to protect Sanatana Dharma.

The emotions portrayed in the film are not just appealing to the youth but also have the power to captivate even young children like Bala Gopal. There’s no doubt about that. With unique elements tailored for all age groups, the movie is resonating across a wide audience.

After a solid opening, the film is racing ahead towards even bigger box office numbers.

హరిహర వీరమల్లులో పవన్ నటన కలికితురాయి

పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా బుధవారం నాడే ప్రీమియర్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే ఈ సినిమా అంతా ఒక ఎత్తు అయితే, క్లైమాక్స్ సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ నటన మరో ఎత్తు. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ నటన సినిమా మొత్తానికి కలికితురాయిగా నిలుస్తోంది. డాడీ, ఖుషి, జానీ లాంటి సినిమాల తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో క్లైమాక్స్ ఫైట్ కంపోజ్ చేశారు. ఆ 18 నిమిషాల ఫైట్ ఎపిసోడ్ సినిమా మొత్తానికి కీలకమైన హైలైట్స్‌లో ఒకటిగా నిలుస్తోంది. సినిమా చూసిన వారంతా ఫైట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఈ సినిమాలో బాబీ డియోల్, సుబ్బరాజు, సునీల్, సచిన్ ఖేడ్కర్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. ఔరంగజేబు అహంకారానికి, ఆధిపత్యానికి ఎదురు నిలిచి, సనాతన ధర్మ పరిరక్షణకై పోరాడి కనుమరుగైన ఎందరో వీరులలో ఒకడైన వీరుడిగా వీరమల్లు కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. నిజానికి ఈ సినిమాలో ఉన్న ఎమోషన్స్ కేవలం యూత్‌నే కాదు, ఆ బాలగోపాలాన్ని కట్టిపడేసేలా ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాలో అన్ని వయసుల వారి కోసం ఉన్న ప్రత్యేకమైన ఎలిమెంట్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మంచి ఓపెనింగ్ రాబట్టిన ఈ సినిమా మరిన్ని కలెక్షన్స్ దిశగా పరుగులు పెడుతోంది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved