2 January 2018
Hyderabad
రజనీకాంత్, కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్‌లో సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం 'పేట్ట' ఈ చిత్రాన్ని తెలుగులో అశోక్ వల్లభనేని జనవరి 10న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అశోక్ వల్లభనేని మాట్లాడుతూ
-బస్ కండెక్టర్‌గా స్టార్ట్ అయిన రజనీకాంత్‌గారు నేడు దక్షిణాది సూపర్‌స్టార్‌గా ఎదిగారు. రేపు కాబోయే ముఖ్యమంత్రి అని కూడా అంటున్నారు. ఆయన నాకు స్ఫూర్తి. దాని వల్లే రజనీకాంత్‌గారితో సినిమా చేయగలిగే స్థాయిని అందుకోగలిగాను. ఆయనలో ఎన్నో సేవాగుణాలున్నాయి. తమిళ ప్రజలకు ఎంతో మేలు చేసిన రజనీకాంత్‌గారు తెలుగు ప్రజలకు ఏం చేశారనే ప్రశ్న వస్తుంది. అందుకోసమని ఈ నెల 6న జరగబోయే 'పేట' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో మంచి సేవను అందిస్తోన్న రెండు, మూడు అనాథ శరణాలయాలకు రజనీకాంత్‌గారి చేతుల మీదుగా నగదును చెక్స్ రూపంలో అందించబోతున్నాం.
- కార్తీక్ సుబ్బరాజ్‌గారు రజనీకాంత్‌గారికి వీరభక్తుడు. ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొడతాడని నమ్మకంగా ఉన్నారు. ట్రైలర్‌ను చూస్తే రజనీకాంత్‌గారు పాతికేళ్లు వెనక్కి వెళ్లిపోయారనిపించేంత గొప్పగా ఉంది.
- అనిరుధ్ వెర్సటైల్ మ్యూజిక్ అందించారు. పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది.
- తెలుగులో మణిరత్నంగారు డైరెక్ట్ చేసిన నవాబ్ సినిమాను నేనే స్వయంగా రిలీజ్ చేసి హిట్ కొట్టాను. అదేవిధంగా సర్కార్ సినిమాను అనుకున్న టైంలో రిలీజ్ చేసి విజయ్‌గారికి తెలుగులో ఓ మార్కెట్‌ను క్రియేట్ చేశాం. అదే నమ్మకంతో సన్‌పిక్చర్స్ సంస్థ నాకు ఈ సినిమా తెలుగు హక్కులను ఇచ్చారు.
- నా పరిధిలో నేను సేవా కార్యక్రమాలను చేస్తుంటాను.
- సినిమా విషయానికి వస్తే.. ఓ ప్రాంతం..ఏరియా అని చెప్పొచ్చు. సినిమా బావున్నప్పుడు థియేటర్స్ ఆటోమెటిక్‌గా పెరుగుతాయి. ఉదాహరణకు సోగ్గాడే చిన్ని నాయనా సినిమా తక్కువ థియేటర్స్‌లో విడుదలైనా, పెద్ద హిట్ అయ్యింది. మంచి సినిమా అనే నమ్మకంతో ఈ సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తున్నాం. ఇప్పటికే 50 శాతం బిజినెస్ పూర్తయ్యింది. మరో 50 శాతం బిజినెస్ ప్రాసెస్‌లో ఉంది.
- తెలుగులో స్ట్రయిట్ సినిమాను ఈ ఏడాది ప్లాన్ చేస్తున్నాం. కథలు వింటున్నాను. మంచి కథ, హీరో దొరకగానే అనౌన్స్ చేస్తాం. లేకుంటే.. చిన్న బడ్జెట్ చిత్రాలు చేసుకుంటాను.
- రజనీకాంత్‌గారి గత చిత్రాలతో పోల్చితే నెక్స్‌ట్ లెవల్ మూవీ.
|