30 January  2018
                            Hyderabad
                          
                            రవితేజ హీరోగా నటించిన చిత్రం  'టచ్ చేసి చూడు`. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ సంయుక్తంగా నిర్మించిన  చిత్రమిది.   విక్రమ్ సిరికొండ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాశీఖన్నా, సీరత్ కపూర్ నాయికలు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. ఫిబ్రవరి 2న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం రవితేజ విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలు..
                          * టచ్ చేసి చూస్తే షాక్ తగులుతుందా?
                            - ఎంత తగులుతుంది అనేది వెయిట్ చేసి చూడాలి. రెండో తారీఖు తగులుతుంది.
                          * ఇంతకుముందు కూడా పోలీస్‌గా నటించారు. ఈ చిత్రంలోని పాత్ర ఎలా ఎగ్జయిట్‌గా అనిపించింది?
                            - ఇంతకుముందు సినిమాల్లో పోలీస్ పాత్రలు చాలా సీరియస్‌గా ఉంటాయి. కానీ ఇందులో చిన్న విట్, చిన్న ఫన్, సర్కాస్టిక్‌గా ఉంటాయి. సీరియస్‌గా పాత్రే అయినా వ్యంగం ఉంటుంది. చాలా టఫ్ అండ్ డ్యూటీ మైండెడ్ పోలీస్ ఆఫీసర్‌గా ఇందులో కనిపిస్తాను.
                          .* ఫ్యామిలీ లైఫ్‌ని, ప్రొఫెషన్ని బ్యాలన్స్ చేస్తారా?
                            - అరే.. సినిమా గురించి తెలిసిపోయిందా? దర్శకుడు చెప్పేశాడా?  నిజమేనండీ. ఎగ్జాక్ట్లీ అదేనండీ. విక్రమ్ చాలా బాగా డీల్ చేశాడు. తనకి కన్విక్షన్ ఉంది. చాలా కాన్ఫిడెన్ట్ గా, చాలా క్లియర్‌గా ఈ చిత్రాన్ని చేశాడు. తనకిది ఫస్ట్ సినిమా అయినా, ఫస్ట్ సినిమా లాగా చేయలేదు. చాలా బాగా చేశాడు. 
                          * మిరపకాయ నుంచి మీకు పరిచయమట కదా?  కొత్త దర్శకుడితో ఎలా అనిపించింది?
                            - .తను దర్శకుడు కావాలని ఈ రంగంలోకి వచ్చాడు. వి.వి.వినాయక్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశాడు. అక్కడి నుంచి రైటర్, స్క్రీన్‌ప్లే రైటర్ అయ్యాడు. మిరపకాయ నుంచి నాకు పరిచయం ఉంది. తను ముందు వేరే కథ చెప్పాడు. కానీ నా కమిట్మెంట్స్ ఉన్నాయి. అంతలో ఈ కథను అనుకున్నాం. వక్కంతం వంశీ బుజ్జీకి కథ చెప్పడం, ఆ కథ నాక్కూడా నచ్చడం అన్నీ జరిగాయి. వంశీ కథని విక్రమ్ చాలా బాగా డీల్ చేశాడు.  విక్కీకి కూడా బుజ్జితో  లాంగ్ అసోసియేషన్ ఉంది.
                          * ఈ కథలో  మీకు బాగా నచ్చిన విషయం ఏంటి?
                            - ఒకటని కాదు. చాలా ఉన్నాయి. ఆ ప్రాసెస్‌నే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. క్లారిటీ ఉన్నప్పుడు అందరూ ఎంజాయ్ చేస్తారు. కన్ఫ్యూజన్ ఉంటేనే కష్టం.  పర్టిక్యులర్‌గా అని కాదు. మొత్తం బాగా నచ్చింది.
                          * విక్రమార్కుడిలాగా ఉంటుందా?
                            - కంపేరిజన్ వద్దు. ఆ సినిమా ఆసినిమానే. ఈ సినిమా ఈ సినిమానే. ఇది తప్పకుండా బావుంటుంది. 
                          * మీ టైప్ పంచ్ డైలాగులు ఉంటాయా?
                            - ఉంటాయి. విక్కీ టైప్ లో ఉంటాయి.
                          * సీరత్ మిమ్మల్ని డామినేట్ చేస్తుందట కదా?
                            - ఆ.. అవునండీ. కొంచెం డామినేట్ చేస్తుంది. తనది మంచి పాత్ర. అల్ట్రా మోడ్రన్‌గా ఉంటుంది. సిటీలో పెరిగిన అమ్మాయి. తనతో పాటు రాశీఖన్నా పాత్ర కూడా బావుంటుంది. మెచ్చూర్డ్ గా, సర్కాస్టిజమ్తో ఉంటుంది. తనకి చాలా మంచి పాత్ర వచ్చింది. 
                          
                          * ఈ సినిమాతో మీ మ్యూజిక్ ట్రెండ్ మారింది?
                            - ఈ సినిమా సంగీతం ప్రీతమ్ గారు జామ్ 8 అని ఓ కంపెనీ పెట్టారు. దాన్నుంచి సాంగ్స్ తీసుకున్నాం. పాటలకు చాలా మంచి స్పందన వచ్చింది. వాళ్ల టీమ్ చాలా మంచి సంగీతం ఇచ్చారు. సో హ్యాపీ. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మణిశర్మగారు చేస్తున్నారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే.
                            * రాశీఖన్నా రాజా ది గ్రేట్‌లోనూ పాట చేశారు.. - అది ఆమె గొప్పతనం. అనిల్‌కి మంచి ఫ్రెండ్. నాక్కూడా మంచి ఫ్రెండ్. పాట సరదాగా చేస్తానని చేసింది. అలా చేయడం ఆమె గొప్పతనం.
                          * మీ దగ్గరకు వచ్చే దర్శకులు మీ వ్యావహారిక శైలికి తగ్గట్టుగానే పాత్రలు రాస్తున్నారు. మరి కొత్తదనం ఎలా వస్తుందనుకుంటున్నారు?
                          - కొత్తదనం కోసం ఆలోచిస్తే సినిమాలు ఆడటం లేదు. నేను కొత్తగా చాలా సినిమాలు ట్రై చేశాను. కానీ అవేమీ కమర్షియల్‌గా వర్కవుట్ కాలేదు. ఆటోగ్రాఫ్ ఎంత మంచి సినిమా, ఈ అబ్బాయి చాలా మంచోడు ఎంత మంచి సినిమా, నేనింతే.. ఒకటేంటి..ఇలాంటివన్నీ పెద్దగా ఆడలేదే. కాబట్టి ఎంటర్టైనర్ అనేది వర్కవుట్ అవుతోంది. కాబట్టి నా ప్రయారిటీ ఎంటర్టైన్మెంటే.* ప్రతి సినిమాలోనూ అదే అయితే.. - తప్పేముంది? జగన్‌కి ఓ హ్యూమర్ ఉంటుంది. అనిల్‌కి ఇంకో రకమైన హ్యూమర్ ఉంటుంది. విక్కీ స్టైల్ వేరుగా ఉంటుంది. వాళ్ల హ్యూమర్‌ని బట్టి పాత్రలు ఉంటాయి. హ్యూమర్ చాలా డిఫరెంట్.
                          * ఆటోగ్రాఫ్‌లాంటి సినిమాలు మళ్లీ చేస్తారా?
                            - చేస్తాను. తప్పకుండా చేస్తా. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్ మైండ్ సెట్ కూడా మారుతోంది. కాబట్టి మరలా చేస్తాను. ఏమో.. ఆటోగ్రాఫ్ ఇప్పుడు విడుదలై ఉంటే తప్పకుండా హిట్ అయ్యేదేమో. కొన్ని స్క్రిప్ట్ లు అలాంటివి కూడా ఈ మధ్య విన్నా. తప్పకుండా చేస్తాను.
                          * ఈ సినిమాలో ఎక్కువగా ఎట్రాక్ట్ చేసే అంశాలేమిటి?
                            - ఒకటీ, రెండూ అని కాదు.. సినిమా మొత్తం.. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరినీ అలరిస్తుంది.
                          * కథ వినగానే మీకు అర్థమవుతుందా.. హిట్ సినిమానా?  కాదా? అని..
                            - తెలియడానికి తెలుస్తుంది. కాకపోతే ఇందాక చెప్పాను కదా.. ఆటోగ్రాఫ్, శంభో శివ శంభో.. వంటివిగనుక ఆడితే అలాంటి సినిమాలు మరికొన్ని ఎక్కువగా చేసేవాడిని. 
                          * తెలుగు మార్కెట్ ఇప్పుడు పెరిగింది. బాలీవుడ్‌కి గానీ, తమిళ్కిగానీ  మీరెళ్లే అవకాశం ఉందా?
                            - యా.. థాంక్స్ టు రాజమౌళి. నా వరకు అవకాశం వస్తే తప్పకుండా వెళ్తా. నాకు ఆ లాంగ్వేజెస్ కూడా తెలుసు. అందరికీ తెలిసిన విషయమే అనుకుంటా ఇది.
                          * అమితాబ్ బచ్చన్ ఇన్ఫ్లుయన్స్ ఉంటుందా?
                            - ఆయన ఫ్యాన్‌ని కాబట్టి తప్పకుండా అంతో ఇంతో ఉంటుంది.
                          * మీ సినిమాలు అక్కడ డబ్ అవుతున్నాయిగా..?
                            - అవునండీ. ఈ మధ్య అక్కడికి వెళ్లినప్పుడు వాళ్లు నన్ను గుర్తుపడితే నాకు విషయం అర్థమైంది. అక్కడ సింగిల్ థియేటర్స్ ఉంటాయి కదా.. అక్కడ వాళ్లు ఈ సినిమాలను విపరీతంగా చూస్తున్నారు.  70 శాతం వాళ్లే. 30 శాతమే మల్టీప్లెక్స్ లు.
                          * మల్టీ లింగ్వుల్ సినిమాలు చేస్తారా?
                            - నేనెప్పుడూ ప్లాన్స్ చేసుకోనండీ. ఫ్లోలో వెళ్తుంటాను.* ఆ మధ్య గ్యాప్ వచ్చింది. రకరకాల వార్తలూ వినిపించాయి..- వార్తలదేముంది. రావాలిగా మరి. గ్యాప్ కావాలని తీసుకున్నది కాదు. సినిమాలు సెట్ కాక వచ్చింది. ఒక రకంగా అది మంచిదే అయింది. శుభ్రంగా బోలెడంత టైమ్ మిగిలింది. చాలా ప్రదేశాలకు వెళ్లాను. చూడాల్సిన చాలా సినిమాలు చూశాను. ఒకరకంగా నాకు చాలా మంచే జరిగింది. గ్యాప్ వచ్చిందని నేనేం ఫీల్ కాలేదు. ఇప్పుడు స్క్రిప్ట్ లు కుదిరాయి కాబట్టి వరుసగా సినిమాలు చేస్తున్నా. * టూ ఇయర్స్ గ్యాప్‌లో..-  మీరందరూ టూ ఇయర్స్ గ్యాప్ అని రాస్తున్నారు. కానీ సినిమాకు వన్ ఇయర్ అయింది. నాకు గ్యాప్ ఒన్ ఇయరే.
                                                    * పూరి జగన్‌తో సినిమా ఈ ఏడాది ఉంటుందా?
                            - ఈ ఏడాది కాదండీ. కానీ తప్పకుండా ఉంటుంది.
                          * ఇప్పుడు ప్రాజెక్ట్ లు ఏం ఉన్నాయండీ?
                            - కల్యాణ్ కృష్ణది జరుగుతోంది. ఆ తర్వాత శ్రీనువైట్ల. అందరికీ తెలిసిందే.
                          * కల్యాణ్‌గారి సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చింది?
                            - 25 శాతం పూర్తయింది.
                          * శ్రీనువైట్లగారి సినిమా ఎందుకు చేస్తున్నారు.. కథ నచ్చా? ఆయనకు బ్యాకప్ ఇవ్వాలనా?
                            - ఇక్కడ ఎవరూ ఎవరికీ బ్యాకప్‌లు ఇవ్వరు. కథ బావుంది కాబట్టి చేస్తాం. హిట్టా, ఫ్లాపా అనేది తర్వాత విషయం. కాకపోతే నచ్చి చేస్తామంతే.
                          * ఇండస్ట్రీ ఎలా ఉంది?
                            - చాలా మంది కొత్త దర్శకులు వస్తున్నారు. చాలా క్లారిటీతో ఉంటున్నారు. మంచి కాన్సెప్ట్ లతో వస్తున్నారు. ఇంకో మూడు, నాలుగేళ్లలో ఇండస్ట్రీ చాలా బాగా ఉంటుంది.* గాడ్‌ఫాదర్ లేకుండా నిలదొక్కుకున్నారు. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని చాలా మంది వస్తున్నారు. వాళ్లతో మీ బాండింగ్ ఎలా ఉంటుంది?- రావాలి. చాలా మంది రావాలి. నేను ఏదైనా చూసినప్పుడు నాకు నచ్చితే తప్పకుండా వాళ్లకి వెంటనే ఫోన్ చేసి గ్రీట్ చేస్తాను.
                          
                          * మల్టీస్టారర్స్ గురించి ఆలోచిస్తున్నారా?
                            - దర్శకులు, రైటర్స్ ఆలోచించాలి. ఎందుకంటే అలాంటి సినిమాలు చేయడానికి నేనెప్పుడూ సిద్ధంగానే ఉన్నాను. ఎవరితోనైనా చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ నాకు ఇప్పటిదాకా అలాంటి స్క్రిప్ట్ లు కూడా రాలేదు. అయినా ఇండస్ట్రీలోనూ ఎప్పుడో ఒకటి వస్తోంది. అప్పుడెప్పుడో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు వచ్చింది. ఇప్పుడు ఇంకేం ఉన్నాయి.. నాకు ఇండస్ట్రీలో అందరూ ఫ్రెండ్సే. నాకు ఎవరితోనూ ఎలాంటి ఇబ్బంది లేదు.
                          *శ్రీనువైట్లగారి సినిమాలో ఎలాంటి పాత్ర చేస్తున్నారు?
                            - ఇప్పుడు చెప్పను.
                          * వినోదంలో చాలా మార్పులు వచ్చాయి.. మీకెలా అనిపిస్తోంది?
                            - ఒకప్పుడు మాయగా ఉండేది. కానీ ఇప్పుడు చాలా క్లియర్‌గా ఉంది.
                          
                          * నటుడిగా స్క్రిప్ట్ సెలక్షన్లో ఎలాంటి మార్పులు వచ్చాయి?
                            - చాలా చేంజస్ వచ్చాయి. నా పాత్ర మాత్రమే కాదు. సినిమా కథ మొత్తం చూసుకుంటాను. అది నా బాధ్యత. 
                          
                          * దర్శకత్వం ఎప్పుడు?
                            - చేస్తాను. కానీ అందులో నేను నటించను. ఇప్పుడు నటనను ఎంజాయ్ చేస్తున్నాను.
                          * బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ఏడాదికి ఇన్ని సినిమాలు చేయాలని ఏమైనా అనుకున్నారా?
                            - అసలు అలాంటిదేమీ లేదండీ. ప్లానింగ్ చేయను.
                          * షార్ట్ ఫిల్మ్ గురించి?
                            - జిమ్‌లో అనిల్ అని నాకు బాగా తెలుసు. చాలా మంచి ఐడియా థ్రో చేశాడు. నాకు బాగా నచ్చి చేశాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
                          * రాజా ది గ్రేట్‌లో మహాధన్‌ని పరిచయం చేశారు..?
                            - నేను కాదు. అనిల్ చేశాడు. 
                            
                            * మహాధన్ ఎలా చేశాడు?
                            - చాలా బాగా చేశాడు. కొంతమంది అయితే నీకన్నా బాగా చేశాడు అని కూడా అన్నారు.