10 March 2019
Hyderabad
సుప్రీమ్ హీరో సాయి తేజ్, కల్యాణి ప్రియదర్శన్, నివేద పేతురాజ్ హీరోహీరోయిన్లుగా 'నేను శైలజ' ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై వరుస సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకులు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ (సివిఎం) నిర్మించిన చిత్రం 'చిత్రలహరి'. టీజర్‌తో టెర్రిఫిక్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ చిత్రం రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన బ్యూటిఫుల్ ఆడియోకి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా పట్ల ఆడియన్స్‌లో, ట్రేడ్‌లో మంచి పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఈ చిత్రం ఏప్రిల్ 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా సుప్రీమ్ హీరో సాయి తేజ్‌తో ఇంటర్వ్యూ.
'చిత్రలహరి' ట్రైలర్‌లో సక్సెస్ సాధించని యువకుడిగా కన్పించారు కదా! దాని గురించి చెప్పండి?
- ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు విజయ్ కృష్ణ. తన జీవితంలో ఎప్పుడూ సక్సెస్ చూడలేదు. సక్సెస్ అంటే ఏంటో కూడా తెలీదు. అలాంటి ఓ యువకుడు ఫెయిల్యూర్స్‌ని అధిగమించి సక్సెస్‌ని ఎలా సాధించాడు అనేది సినిమా మెయిన్ కాన్సెప్ట్.
కథల ఎంపిక విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
- ప్రతి సినిమా విజయం వెనుక ఒక టీమ్ వర్క్ ఉంటుందని నమ్ముతాను. అలాగే ప్రతి సినిమాకు హండ్రెడ్ పర్సెంట్ నటుడిగా పూర్తి ఎఫర్ట్ పెడతాను. ఆ ప్రాసెస్‌లో కొన్ని ఫెయిల్యూర్స్ రావొచ్చు. అవి సహజం. కానీ నటుడిగా ప్రతి సినిమా నాకు మంచి పేరు తెచ్చింది. బేసికల్లీ కథలో కంటెంట్ బాగుంటే సక్సెస్ తప్పకుండా వస్తుంది. ప్రతి నటుడికి తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ప్రతి శుక్రవారం ఒక అవకాశం ఉంటుందని నమ్ముతాను. నా గత అనుభవాల వల్ల స్క్రిప్ట్ నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పగలుగుతున్నా. స్క్రిప్ట్ పరంగా నేను హండ్రెడ్ పర్సెంట్ పూర్తి శాటిస్‌ఫై అయితేనే సినిమా ఓకె చేస్తున్నా.
'చిత్రలహరి' స్క్రిప్ట్ వినగానే మీకేమన్పించింది?
- దర్శకుడు కిషోర్ తిరుమల ఈ స్క్రిప్ట్ చెప్పగానే నాకు లోపల నుండి తెలియని వాయిస్ విన్పించింది ఈ స్క్రిప్ట్ వదులుకోకు అని. నా మనసులోంచి వచ్చిన మాటను నమ్మి ఈ సినిమా చేశాను.
దర్శకుడు చాలాకాలంగా మంచి మిత్రులు కదా మీకు! మరి ఆయనతో సినిమా చేయడానికి ఎందుకు ఇంత సమయం పట్టింది?
- కిషోర్ తిరుమల నాకు చాలాకాలంగా ఆయన రైటర్‌గా ఉన్నప్పటి నుండి పరిచయం. ఆయన దర్శకుడిగా మారాక రామ్‌తో సినిమా చేశారు. ఆ సినిమా చూసి బాగా డైరెక్ట్ చేశారని, రామ్‌ని కూడా చాలా కొత్తగా చూపించారని అభినందించాను. స్నేహితుడైనంత మాత్రాన వెంటనే సినిమా చెయ్యాలని లేదు. అందుకనే నేను తనని అప్రోచ్ కాలేదు. తనకి సక్సెస్ వస్తే నాకు వచ్చినట్టే.
చాలామంది సక్సెస్ కాని పర్సన్స్ 'చిత్రలహరి' తమ బయోపిక్‌లా ఫీలవుతున్నారు! దీని పట్ల మీ స్పందన ఏంటి?
- అది నా వరకు కూడా వచ్చింది. చాలామంది ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో ఇది నా బయోపిక్‌లా ఉందని పోస్ట్ చేస్తున్నారు. ప్రతి మనిషి జీవితంలో అలాంటి ఒక ఫేజ్ ఉంటుంది. పోస్ట్ చేసిన ప్రతి ఒక్కరూ అలాంటిది ఎక్స్‌పీరియన్స్ చేసి ఉండుంటారు. ఈ సినిమా వారందరికీ ఒక మంచి ఫీల్‌ని ఇస్తుంది అని కాన్ఫిడెంట్‌గా చెప్పగలను.
జీవితంలో సక్సెస్ సాధించలేకపోయిన వారికి ఈ సినిమా ద్వారా ఏమైనా మెసేజ్ ఇస్తున్నారా?
- ఈ సినిమాలో అలాంటి వారికోసం మంచి మెసేజ్ ఉంది. అది సినిమా రిలీజయ్యాక ప్రతి ఒక్కరూ దానికి కనెక్ట్ అవుతారు అని అనుకుంటున్నా.
సినిమా ఫైనల్ కాపీ చూశారా?
- ఇంకా లేదు. డబ్బింగ్‌లో చూశాను. సినిమా ఆడియన్స్‌తో పాటు థియేటర్‌లో చూస్తాను.
మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వేల్యూస్ గురించి?
- చాలా మంచి ప్రొడ్యూసర్స్ అండి. అలాంటి ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ నాకు ఆరు సినిమాల తర్వాత నన్ను నమ్మి ఛాన్స్ ఇవ్వడం చాలా హ్యాపీగా అన్పించింది. ఈ బేనర్ ప్రొడక్షన్ వేల్యూస్ గురించి అందరికీ తెల్సిందే. దర్శకుడికి ఏం కావాలో అవన్నీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సమకూర్చారు. ఆర్టిస్ట్‌లకి మంచి ఫ్రీడమ్ ఇస్తారు. మైత్రి మూవీ మేకర్స్ బేనర్‌లో వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి ఎంతో అవసరం.
దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ గురించి?
- దేవిశ్రీ ఈ సినిమాకి అద్భుతమైన సంగీతాన్నిచ్చారు. దేవి అన్న సాంగ్స్‌ని నేను ఫస్ట్ నుండి ఫాలో అవుతున్నా. ఇప్పటికీ నా దగ్గర ఆయన సంగీతం అందించిన క్యాసెట్స్ ఉన్నాయి. ఆయన సాంగ్స్ విని ఎంతో ఎంజాయ్ చేసేవాడ్ని. నేను ఆయనతో కలిసి వర్క్ చేస్తానని అనుకోలేదు. మా అమ్మగారు కూడా నేను, దేవిశ్రీ కలిసి పని చేయాలని, ఆయన మ్యూజిక్‌ని నేను డ్యాన్స్ చేయాలని అంటూండేది. అది ఈ సినిమాతో నెరవేరింది.
సునీల్ గురించి చెప్పండి?
- సునీల్ అన్నతో కలిసి వర్క్ చేయాలని నాకు కోరిక ఉండేది. 'నువ్వు నేను', 'నువ్వేకావాలి' సినిమాలు చూసి ఒక్కసారన్నా ఆయనతో కలిసి వర్క్ చేయాలని అనుకునేవాడిని. నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి ఆయన హీరో అయ్యారు. కుదురుతుందో, లేదో అనుకున్నాను. ఈ సినిమాతో కుదిరింది. ఆఫ్ స్క్రీన్‌లో కూడా ఆయన నన్ను ఓ తమ్ముడిలా చూసుకున్నారు. ఈ సినిమాలో ఆయన అద్భుతంగా కామెడీ ఉంటుంది. కొన్ని సీన్స్‌లో అయితే సూపర్ ఫన్ జనరేట్ చేశారు.
'గ్లాస్‌మేట్స్' సాంగ్ కథలోంచి వచ్చిందా?
- ఫిబ్రవరిలో నాకు పూర్తి కథ చెప్పడం జరిగింది. అప్పుడే సాంగ్ కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. అప్పటికే 'ప్రేమ వెన్నెల', 'పరుగు పరుగు', 'గ్లాస్‌మేట్స్', 'ప్రయత్నమే' పాటలు గురించి చెప్పారు. కానీ డిసెంబర్‌లో 'గ్లాసు' గుర్తు వస్తుందని అనుకోలేదు.
హీరోయిన్స్ గురించి?
- కల్యాణి, నివేదతో కలిసి నటించడం ఇదే ఫస్ట్ టైమ్ ఇద్దరూ మంచి పెర్‌ఫార్మెర్స్. వాళ్లు ఎలా చేస్తారో, నేను ఎలా రియాక్ట్ అవ్వాలా అని చిన్న ఎగ్జయిట్‌మెంట్ ఉండేది. మా ముగ్గురి మధ్య హెల్దీ కాంపిటీషన్ ఉంది.
ఎన్టీఆర్-చరణ్, నాని-సుధీర్‌లా మీ పేరు కూడా ఒక మల్టీస్టారర్‌లో విన్పించింది?
- కథ కుదరలేదు. అందుకే ఆ సినిమా చేయలేదు. కానీ కథ కుదిరితే డెఫినెట్‌గా మల్టీస్టారర్ చేస్తాను. ఆ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు.
నెక్స్‌ట్ ప్రాజెక్ట్స్?
- ప్రస్తుతం 'చిత్రలహరి' ప్రమోషన్స్ బిజీలో ఉన్నాను. రెండు, మూడు కాన్సెప్ట్స్ విన్నాను. ఏదీ ఫైనల్ కాలేదు.. అంటూ ఇంటర్వ్యూ ముగించారు సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్.