pizza
Shraddha Srinath interview (Telugu) about Jersey
నానిలో ఆ బెస్ట్‌ క్వాలిటీ ఉంది - శ్రద్ధ శ్రీనాథ్‌
You are at idlebrain.com > news today >
Follow Us

14 April 2019
Hyderabad


‘జెర్సీ’సినిమాలో సారా పాత్రలో చేసింది శ్రద్ధా శ్రీనాథ్‌. కన్నడ, తమిళ్‌, మలయాళంలో పలు సినిమాలు చేసిన శ్రద్ధకు తెలుగులో ఇదే తొలి సినిమా. అలాగని ఆమె హైదరాబాద్‌కు కొత్తకాదు. ఇక్కడ ఆమె ఆరేళ్లు చదువుకుంది. శ్రద్ధ తన బాల్యం, చదువు, సినిమా గురించి శ్రద్ధగా చెప్పిన వివరాలు ‘ఐడిల్‌ బ్రెయిన్‌’ ప్రేక్షకులకు ప్రత్యేకం...

నేను తెలుగు బాగా మాట్లాడతాను. ఇక్కడే సికింద్రాబాద్‌లో 6 ఏళ్లున్నా. 7 నుంచి ప్లస్‌ టూ వరకు కేవీ తిరుమలగిరిలో చదువుకున్నా. మా నాన్నది బెంగుళూరు. నాన్న ఆర్మీలో పనిచేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నాం. నాన్న రిటైర్‌ అయి 8 ఏళ్లయింది. నేను కాశ్మీర్‌లో పుట్టాను. నాన్న ఉద్యోగ రీత్యా ప్రతి రెండేళ్లకు ఒకసారి ట్రాన్సఫర్‌ అవుతుండేవాళ్లం. నేను 9 స్కూల్స్‌ చేంజ్‌ చేశానంటే ఎన్ని ఊళ్లు తిరిగి ఉంటామో అర్థం చేసుకోండి.

తొలి సినిమా కాదు!
తెలుగులో ‘జెర్సీ’ నా తొలి సినిమా కాదు. ఈ సినిమా కన్నా ముందు రెండు సినిమాల అవకాశాలు వచ్చాయి. వాటిలో ఒకదానికి సురేష్‌ ప్రొడక్షన్స్‌లో ‘క్షణం’ డైరక్టర్‌ రవికాంత పేరెపు దర్శకత్వం వహించారు. ఆయన రెండో సినిమా అది. ఇంకా టైటిల్‌ పెట్టలేదు. ఆది సాయికుమార్‌తో ‘జోడీ’ చేశా. 2017లో ఈ రెండింటికీ సంతకం చేశా. 2018 అక్టోబర్‌లో ‘జెర్సీ’ నా దగ్గరకు వచ్చింది. ‘జెర్సీ’ ముందు రిలీజ్‌కి వస్తుంది.

ఎలాగంటే...
నేను తమిళ్‌, కన్నడలోనూ నటించిన కొన్ని చిత్రాలను ‘జెర్సీ’ యూనిట్‌ చూసినట్టుంది. నాకు ఒకరోజు నాని మేనేజర్‌ వెంకట్‌ ఫోన్‌ చేశారు. ‘జెర్సీ’ గురించి చెప్పారు. సినాప్సిస్‌ పంపించారు. చదవగానే ఇంట్రస్ట్‌గా అనిపించింది. కథ వింటానని చెప్పాను. దర్శకుడు గౌతమ్‌ బెంగుళూరుకు వచ్చి నాకు 2 గంటలు నెరేషన్‌ ఇచ్చారు. నేను కథను బాగా కేర్‌ఫుల్‌గా విన్నా. ఇది థ్రిల్లర్‌ కాదు. అయిన ఎమోషన్ల మీద నడిచే సినిమా. అందుకే నెరేషన్‌ వినగానే ఓకే చెప్పేశాను. నా పాత్రకు ఎంత వేల్యూ ఉందని కూడా అర్థం చేసుకున్నా. దానికి తగ్గట్టు మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేసిన సినిమా ఇది.

నాని గ్రేట్‌
నాని కో ఆర్టిస్ట్‌గా మనల్ని దాటే యాలని చూడడు. అందువల్ల నాకు అతనితో పోటీపడి యాక్టింగ్‌ చేయడం ప్రాబ్లమ్‌ అనిపించలేదు. నా సమస్య ఒక్కటే... తెలుగు. అయితే దాన్ని దాటడానికి నాని చాలా సహకరించారు. నేను చేయబోయే కీలక సన్నివేశాలకు ముందు నా దగ్గరకు వచ్చి ‘ఇది నీ సీన్‌. నువ్వు చాలా హార్డ్‌గా ప్రిపేర్‌ అవుతున్నావు. తప్పకుండా బాగా చేస్తావు’ అంటూ మోటివేట్‌ చేసేవారు. మన నటనను మరింత గొప్పగా కెమెరా ముందు ఆవిష్కరించడానికి నిజంగా ఉపయోగపడేది కో ఆర్టిస్టే. నాని ఆ విషయంలో చాలా హెల్ప్‌ చేశారు. సెట్లో కూడా తనతో ఏదైనా డిస్కస్‌ చేయగల చనువిచ్చారు. తెలుగులో నాని నటించిన సినిమాలేవీ చూడలేదు. ఇప్పటిదాకా నేను చూసిన తెలుగు సినిమాలు మూడే. వాటిలో ఒకటి పెళ్లి చూపులు. రెండు బాహుబలి. పెళ్లిచూపులు నా టైప్‌ ఆఫ్‌ సినిమా. న్యూ వేవ్‌ సినిమా. ఆ చిత్ర దర్శకుడు తరుణ్‌తో ఎప్పటికైనా కచ్చితంగా పనిచేస్తాను.

‘జెర్సీ’ స్పెషల్‌
నేను ‘జెర్సీ’లో గ్లామర్‌గా, మ్యారీడ్‌ విమెన్‌గా చేశా. అర్జున, సారా మధ్య ప్రేమ, ప్యాషన్‌ మొత్తం చూపించారు దర్శకుడు. ఇందులో సారా కేథలిక్‌ గర్ల్‌. దానికి తగ్గట్టే ఆ లుక్‌, ఆ స్టైలింగ్‌ ఇచ్చాం. 1986లో బోయ్‌ఫ్రెండ్‌, గర్ల్‌ ఫ్రెండ్‌ అనే మాటలే చాలా డిఫికల్ట్‌గా వినిపించేవి. వాటిని మేం రిఫ్లెక్ట్‌ చేశాం. 1996లో చూపించే సన్నివేశాలన్నీ రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటాయి. ఆ వయసులో డబ్బులు కోసం చేసే పరుగులు చూపించాం. ఇందులో మదర్‌గానూ చేశాను. మదర్‌గా నటించారంటే వాళ్ల మీద ఓ బ్రాండ్‌ ఏర్పడుతుంది. మదర్‌గా చేయాలా? వద్దా? అని నేను ఆలోచించా. అయినా ఫ్యూచర్‌ గురించి నేనెందుకు బాధపడాలి అని అనుకున్నా. అయినా ఇలాంటి మంచి కథ ఉన్న సినిమాలు ఎప్పుడోగానీ రావు. అందుకే వెంటనే ఒప్పుకున్నా. అందులోనూ నేను కంటెంట్‌ ఓరియంటెడ్‌ సినిమాలు చేయాలనుకుంటా. భవిష్యత్తులోనూ ఒన్లీ పెర్ఫార్మెన్స్‌, ఒన్లీ గ్లామర్‌ చిత్రాలు చేయడానికి కూడా సిద్ధమే.

చూడలేదు
నేను తెలుగు ‘యూ టర్న్‌’ని చూడలేదు. చూద్దామని మొదలుపెట్టాను కానీ, రచన అనే పాత్రలో నేను కదా ఉండాల్సింది అనే పొసెసివ్‌తో నేను చూడలేదు. నేను క్రికెట్‌ లవర్‌ని. చైల్డ్‌ హుడ్‌లో చూసేదాన్ని. ఐపీయల్‌ వచ్చాక పెద్దగా చూడట్లేదు. క్రికెట్‌ మీద చాలా బయోపిక్‌లు వచ్చాయి. కానీ ‘జెర్సీ’ బయోపిక్‌ కాదు. ఇది హానెస్ట్‌ స్టోరీ. హానెస్ట్‌ ఎమోషన్స్‌ ఇందులో ఉంటాయి. ప్రజలు కనుక దీనికి రిలేట్‌ అయితే చాలా బావుంటుంది. క్రికెటర్‌ అనే కాదు, చాలా మందికి జీవితంలో స్ట్రగుల్‌ ఉంటుంది. వైఫ్‌లు కూడా ఫ్రసే్ట్రట్‌ అయి ఉంటారు. అవన్నీ మనకు తెలిసినవే. ఇది బోయ్‌ అండ్‌ గర్ల్‌ సినిమా.

అందుకే చేశా
మణిరత్నం సినిమా కాబట్టి ‘చెలియా’లో చిన్న పాత్రయినా చేశా. మద్రాస్‌ టాకీస్‌లో చేయాలనిపించింది. నా విష్‌లిస్ట్‌లో రాజమౌళి, త్రివిక్రమ్‌, తరుణ్‌ భాస్కర్‌ పేర్లు ఈ మధ్య యాడ్‌ అయ్యాయి. భవిష్యత్తులోనూ నా డిమాండ్‌ ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ ఫోకస్‌ చేస్తాను. కన్నడ, తమిళ్‌లో ఈక్వెల్‌గా చేస్తున్నా. తెలుగులో ఇప్పుడే మార్కెట్‌ మొదలైంది.

కన్నడతో పోలిస్తే తెలుగు సినిమాల బడ్జెట్‌ ఎక్కువగా ఉంటుంది. నేను తెలుగులో డబ్బింగ్‌ చెప్పాలనుకున్నా. కానీ కుదరలేదు. సినిమా పూర్తయ్యాక సారా పాత్రకు జీవం పోశానని మా దర్శకుడు ఇచ్చిన కాంప్లిమెంట్‌ మర్చిపోలేను.

లా నచ్చలేదు
నేను లా చదువుకున్నా. రెండేళ్లు రియల్‌ ఎస్టేట్‌ లాయర్‌గా చేశా. నాకు పెద్దగా నచ్చలేదు. సరిగ్గా ఆ సమయంలోనే నా ఫొటోలు నచ్చాయని ఇండిపెండెంట్‌ ఫిల్మ్‌మేకర్స్‌ ఫోన్‌ చేశారు. మార్చి 2015లో నేను నటన మొదలుపెట్టా. 2016లో నేను కన్నడ యు టర్న్‌ చేశా. ఆ తర్వాత తిరిగి చూసుకోలేదు

 




Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved