pizza

‘Jatadhara’ gets an ‘A’ certificate..
'జటాధర' కు 'A' సర్టిఫికెట్..

You are at idlebrain.com > news today >

31 October 2025
Hyderabad

The film Jatadhara features Sudheer Babu in the lead role, with popular Bollywood actress Sonakshi Sinha playing another crucial character. With this film, Sonakshi Sinha is making her debut on the Telugu silver screen. Going by the trailer, she appears to be portraying a unique role as a Dhana Pisachi (wealth-seeking ghost). Another key role in the film is played by Shilpa Shirodkar, sister of Namrata Shirodkar. After a very long gap—since her film Brahma alongside Mohan Babu—she is returning to Telugu cinema with this project. Indira Krishna, Ravi Prakash, Jhansi, Rajeev Kanakala, Srinivas Avasarala, and Shubhalekha Sudhakar are also seen in other prominent roles.

The censor formalities for Jatadhara have been completed. The censor board has awarded the film an ‘A’ certificate. Produced under the banners of Zee Studios and Prerna Arora, the film is directed by Venkat Kalyan and Abhishek Jaiswal. With all censor work completed, Jatadhara is set to release in Telugu and Hindi languages on November 7.

'జటాధర' కు 'A' సర్టిఫికెట్..

సుధీర్ బాబు కథానాయకుడిగా, ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షీ సిన్హా మరో కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం 'జటాధర'. మొదటిసారిగా సోనాక్షీ సిన్హా ఈ సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టబోతున్నారు. 'జటాధర' లో ఆమె ఓ సరికొత్త పాత్రలో ధన పిశాచిగా కనిపించబోతున్నట్టు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నమ్రతా శిరోద్కర్ సోదరి శిల్పా శిరోద్కర్ కూడా కనిపించబోతున్నారు. చాలా కాలం క్రితం ఆమె మోహన్ బాబు సరసన నటించిన 'బ్రహ్మ' సినిమా తర్వాత మళ్ళీ ఈ సినిమాతో తెలుగు తెరపై కనిపించబోతున్నారు. ఈ సినిమాలో ఇందిరా క్రిష్ణ, రవి ప్రకాష్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల మరియు శుభలేఖ సుధాకర్ ఇతర కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు.

'జటాధార' సినిమాకు సెన్సార్ పనులు పూర్తయ్యాయి. సెన్సార్ ఈ సినిమాకు 'A' సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. జీ స్టూడియోస్ మరియు ప్రేరణా అరోరా బేనర్లలో నిర్మాణం అవుతున్న ఈ సినిమాకు వెంకట్ కళ్యాణ్ మరియు అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించడం జరిగింది. సెన్సార్ పనులన్నీ పూర్తిచేసుకున్న ఈ సినిమా తెలుగు మరియు హిందీ భాషల్లో నవంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved