pizza

Kalki 2898 AD is epic climax for all epics
Nag Ashwin Says Kalki 2898 AD Serves as the Climax of All Ancient Puranas
కల్కి 2898 AD’ ఎపిక్స్ అన్నిటికీ అల్టిమేట్ క్లైమాక్స్ లా వుంటుంది. ఇండియాలోనే కాదు వరల్డ్ లో అందరూ ఈ స్టొరీకి రిలేట్ అవుతారు: విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్

You are at idlebrain.com > news today >

18 June 2024
Hyderabad

 

The narrative of the most-awaited global film Kalki 2898 AD revolves around the enigmatic figure of Kalki, the tenth and final avatar of the Hindu deity, Vishnu. Director Nag Ashwin will be coming up with a series of episodes to describe the worldbuilding for the movie and he also spoke about Kalki Avatar. He made an interesting revelation saying Kalki 2898 AD serves as the climax of all Puranas and epics. “It is a culmination of all ancient Puranas and epics,” affirms he.

As unveiled by the director, the movie shows the journey from the events of the Mahabharata where the greatest battle happened and Lord Krishna ended his avatar to the beginning of Kali Yuga. Kalki is the final avatar or incarnation of the Hindu god Vishnu. It will be interesting to see how Kalki Avatar is going to be.

The director also clarifies that the story will appeal to the global audience.

కల్కి 2898 AD’ ఎపిక్స్ అన్నిటికీ అల్టిమేట్ క్లైమాక్స్ లా వుంటుంది. ఇండియాలోనే కాదు వరల్డ్ లో అందరూ ఈ స్టొరీకి రిలేట్ అవుతారు: విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్

మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 AD’ ఫెంటాస్టిక్ ప్రమోషనల్ కంటెంట్ తో గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్ కి గ్రౌండ్ బ్రేకింగ్ రెస్పాన్స్ వచ్చింది. నిన్న విడుదలైన 'భైరవ అంథమ్' ఇండియన్స్ బిగ్గెస్ట్ సాంగ్ అఫ్ ది ఇయర్ గా టాప్ చార్ట్ లో వుంది. ఈ ఎక్సయిట్మెంట్ ని మరింతగా పెంచుతూ మేకర్స్ ఎపిక్ జర్నీ ఎపిసోడ్ 1 - ది ప్రిల్యూడ్ ఆఫ్ కల్కి2898AD ని రిలీజ్ చేశారు.

ది ప్రిల్యూడ్ ఆఫ్ కల్కి2898AD వీడియోలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ఈ కథ బేసిక్ గా అన్నిటికి క్లైమాక్స్. కలియుగంలో ఏం జరుగుతుంది. ఏం జరగొచ్చు .. ఇలాంటి వాటన్నిటికీ ఇది క్లైమాక్స్‌. కేవలం ఇండియన్ లోనే కాదు వరల్డ్ లో అందరూ ఈ కథకు రిలేట్ అవుతారు. చిన్నప్పటి నుంచి పౌరాణిక చిత్రాలంటే చాలా ఇష్టం. ‘పాతాళభైరవి’, ‘భైరవ ద్వీపం’, ‘ఆదిత్య 369’ నాకు ఇష్టమైన సినిమాలు. హాలీవుడ్‌ ‘స్టార్‌ వార్స్’ లాంటి సినిమా చూసినప్పుడు చాలా బావున్నాయనిపించాయి. అయితే ఇవి మన కథలు కావా? ఎప్పుడూ వెస్ట్ లోనే జరగాలా ? అనిపించేది. మహాభారతంలో ఎన్నో గొప్ప పాత్రలున్నాయి. కృష్ణవతారంతో అది ఎండ్ అవుతుంది. అక్కడి నుంచి కలియుగంకు ఎంటరైనప్పుడు ఈ కథ ఎలా వెళుతుందనేది ప్యూర్ క్రియేటివ్ ఇమాజినేషన్. దిన్ని కథగా రాయలనుకున్నా. మనం చదివిన పురాణాలు, ఎపిక్స్ అన్నిటికి ఒక క్లైమాక్స్ లా వుంటుంది. ప్రతి యుగంలో కలిపురుషుడిలా ప్రవర్తించేవారు ఉన్నారు. ఒక యుగంలో రావణుడు, మరోయుగంలో దుర్యోధనుడు... ఇలా అన్నిట్లో ఒక రూపం తీసుకొని కలియుగంలో ఒక అల్టిమేట్ ఫైనల్ రూపం తీసుకుంటే అతనితో పోరాటం ఎలా వుంటుందనే ఐడియాతో రాసుకున్నది. ఈ కథ రాయడానికి 5 సంవత్సరాలు పట్టింది. సరికొత్త ఈ సైన్స్ ఫిక్షన్ మైథాలజీ అటెంప్ట్ ని చూసి ప్రేక్షకుల ఎలా రియాక్ట్ అవుతారని క్యూరియస్ ఎదురుచూస్తున్నా’ అన్నారు.

'కల్కి 2898 AD' లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ సహా ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ మల్టీలింగ్వెల్, మైథాలజీ -ఇన్స్ స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ 2024 జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved