pizza

Unveiling The Stunning First Look Of The Legend Mohanlal As Kirata In Kannappa
మంచు విష్ణు కన్నప్ప నుంచి మోహన్ లాల్ లుక్ రిలీజ్..

You are at idlebrain.com > news today >

15 December 2024
Hyderabad

This Monday, the makers of Vishnu Manchu's highly anticipated film Kannappa have revealed the full first look of The Legend Mohanlal in the role of Kirata, the master of the powerful Pashupatastra.

The first look poster showcases Mohanlal in an intense tribal warrior look, complete with intricate tattoos on his face and body. His long hair and thick beard add to his rugged appearance, while his fierce gaze exudes strength and determination. In one hand, he grips a sword, ready to face his adversaries, set against the backdrop of a dense forest and towering hills.

From this striking poster, it’s clear that Mohanlal’s character will be nothing short of ferocious. Fans can expect a powerful and memorable performance as Kirata, one that will leave a lasting impact on the film.

Mohan Babu, Prabhas, Akshay Kumar, Sarath Kumar, Arpit Ranka, and Kajal Aggarwal will be seen in crucial roles in this movie based on a true story.

Directed by Mukesh Kumar Singh, the film promises to be a high-octane action spectacle, complemented by cutting-edge VFX. Kannappa is slated for a grand release on April 25, 2025, as the biggest summer attraction.

మంచు విష్ణు కన్నప్ప నుంచి మోహన్ లాల్ లుక్ రిలీజ్..

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిత్ర యూనిట్ చేపట్టిన ప్రమోషన్ కార్యక్రమాలతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్‌తో ఒక్కసారిగా కన్నప్ప టీం హైప్ పెంచేసింది. ఆ తర్వాత కన్నప్ప నుంచి ఒక్కో పాత్రను రివీల్ చేస్తూ ఇస్తున్న అప్డేట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్లు భాగమవుతున్నారు.

ఇటీవలి కాలంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసిన యూనిట్.. తాజాగా మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో మోహ‌న్ లాల్, కిరాట(Kirata) అనే ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుపుతూ ఈ పోస్టర్ రిలీజ్ చేశారు. గంభీరమైన మోహన్ లాల్ లుక్ చూస్తుంటే చిత్ర మేజర్ హైలైట్స్ లో ఈయన క్యారెక్టర్ కూడా ఒకటని స్పష్టమవుతోంది. విడుదల చేసిన కాసేపట్లోనే ఈ పోస్టర్ వైరల్ గా మారింది.

విష్ణు మంచు టైటిల్ రోల్‌లో కనిపించనున్న కన్నప్ప అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా రాబోతోంది. ప్రీతి ముకుందన్ కథానాయికగా నటిస్తోంది. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 25, 2025న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.

కన్నప్ప మూవీ ఏ తరానికి అయినా కొత్తగానే ఉంటుందని.. భక్తి భావం, ధూర్జటి మహాకవి ఎలా రాశారు? శ్రీకాళహస్తి మహత్యం ఏంటి? అన్నది ఈ చిత్రంలో చూపించనున్నాం అని మోహన్ బాబు చెప్పారు. ఎంతో వ్యయప్రయాసతో, భారత దేశంలోని నాలుగు మూలల ఉన్న మహా నటుల్ని ఈ చిత్రంలో తీసుకున్నాం. ఇది కేవలం భక్తి చిత్రమే కాదు. అన్ని రకాల అంశాలుంటాయి. పరమేశ్వరుడు ఇచ్చిన ఆజ్ఞతోనే ఈ సినిమా తీశాం అన్నారు మోహన్ బాబు. ఈ సినిమాతో విష్ణు మంచు తనయుడు అవ్రామ్ భక్త మంచు ఆరంగేట్రం చేస్తుండటం విశేషం.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved