Bhagyashri Borse, the rising star making waves in the South Indian film industry, has been generating significant buzz ahead of her upcoming film KINGDOM, set to release on July 31st. Her growing fan base is eagerly awaiting her next big-screen appearance, and her recent social media update has only added to the excitement.
In an Instagram story, Bhagyashri revealed that she has completed dubbing for her role in Telugu, highlighting her dedication and passion for her craft. What truly captured the attention of fans wasn’t just the dubbing update, but her heartfelt thoughts on the importance of giving voice to her characters.
The actress connected with audience with this simple gesture. The most happening actress also emphasized how essential it is to connect emotionally with the role by speaking the language herself. Unlike many actors who opt for dubbing artists due to language barriers, Bhagyashri has consistently chosen to lend her own voice.
Bhagyashri’s love for Telugu cinema and its audience has driven her to master the language from the very start of her career. She believes that “Dubbing for a film is simply giving 100% to your character,” and views language as a bridge to deeper storytelling.
భాగ్యశ్రీ బోర్సే ‘కింగ్‌డమ్’ కోసం తెలుగులో డబ్బింగ్
దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఓ ఉదయోన్ముఖ నటిగా ఎదుగుతున్న భాగ్యశ్రీ బోర్సే, జూలై 31న విడుదలకు సిద్ధంగా ఉన్న తన కొత్త సినిమా ‘కింగ్‌డమ్’ తో భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఆమెకి పెరుగుతున్న ఫ్యాన్‌బేస్, బిగ్ స్క్రీన్‌పై మళ్లీ ఆమెను చూడడానికి ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన అప్‌డేట్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.
ఇన్‌స్టాగ్రామ్ స్టోరిలో, తెలుగులో తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేశానని ఆమె వెల్లడించారు. నటనపై ఆమెకున్న అంకితభావాన్ని ఈ ప్రకటన ప్రతిబింబించింది. అయితే కేవలం డబ్బింగ్ పూర్తి చేసిన వార్తే కాకుండా, తన పాత్రలకు స్వయంగా గొంతు ఇచ్చే అనుభూతిపై ఆమె చెప్పిన భావోద్వేగపూరిత వ్యాఖ్యలు అభిమానుల మనసు గెలుచుకున్నాయి.
ఈ చిన్న కానెక్ట్‌తోనే ప్రేక్షకులందరితో ఆమెను మరింత దగ్గర చేసింది. తాను నటించిన పాత్రతో భావోద్వేగపూరితంగా మమేకం కావాలంటే, భాషను స్వయంగా మాట్లాడటమే ఉత్తమ మార్గమని భాగ్యశ్రీ పేర్కొన్నారు. భాషా అడ్డంకుల వల్ల చాలా మంది నటులు డబ్బింగ్ ఆర్టిస్టులపై ఆధారపడతారు. కానీ భాగ్యశ్రీ మాత్రం తన సినీ ప్రయాణ ఆరంభం నుంచే స్వయంగా డబ్బింగ్ చేసుకోవడాన్ని ఎంచుకున్నారు.
తెలుగు సినిమా పట్ల, ప్రేక్షకుల పట్ల ఆమెకున్న ప్రేమే ఆమెను ఈ భాషను నేర్చుకోవడంలో ప్రేరణనిచ్చింది. ఆమె నమ్మకం ప్రకారం, ‘‘ఒక పాత్రకు డబ్బింగ్ చేయడం అంటే నూటికి నూరు శాతం జీవించడమే’’, భాష అనేది కథనాన్ని మరింత లోతుగా వ్యక్తపరిచే సాధనమని భావిస్తున్నారు.