pizza

Vijay Deverakonda’s “Kingdom” Races Ahead with 30,000 Ticket Bookings, Trends Nationwide
30వేల టికెట్ బుకింగ్స్ తో ట్రెండింగ్ లో దూసుకెళ్తున్న విజయ్ దేవరకొండ "కింగ్డమ్"

You are at idlebrain.com > news today >

28 July 2025
Hyderabad

Vijay Deverakonda’s upcoming film Kingdom is witnessing red-hot demand, with tickets selling like hotcakes. Within just 24 hours of bookings going live, the film has already sold over 30,000 tickets, making it a trending title across major ticketing platforms. This overwhelming response reflects the audience’s strong interest in the film.

Meanwhile, Kingdom is also making waves overseas with impressive pre-sales numbers. Witnessing the craze from moviegoers, the makers are now planning massive premiere shows. The premieres are scheduled to be held on July 30th.

The recently released trailer has garnered a tremendous response, further boosting the film’s hype. Positioned as a gangster drama that explores the bond between brothers, Kingdom has created significant buzz among audiences. Expectations are high that this film will deliver a solid blockbuster for Vijay Deverakonda.

Both the production house, Sithara Entertainments, and director Gowtam Tinnanuri are reportedly extremely confident about the film’s success.

30వేల టికెట్ బుకింగ్స్ తో ట్రెండింగ్ లో దూసుకెళ్తున్న విజయ్ దేవరకొండ "కింగ్డమ్"

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్డమ్ సినిమా టికెట్స్ హాట్ కేక్స్ లా అమ్ముడవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాగా...24 గంటల్లోనే 30 వేల టికెట్స్ సేల్ అయ్యాయి. దీంతో కింగ్డమ్ సినిమా టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్స్ లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా మీద ఆడియెన్స్ ఎంత ఇంట్రెస్ట్ గా ఉన్నారో ఈ టికెట్ బుకింగ్స్ తో తెలుస్తోంది. మరోవైపు ఓవర్సీస్ లోనూ ప్రీ సేల్స్ లో కింగ్డమ్ జోరు చూపిస్తోంది. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఈ క్రేజ్ చూసిన మేకర్స్ కింగ్డమ్ కు పెద్ద ఎత్తున ప్రీమియర్స్ వేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 30న కింగ్డమ్ ప్రీమియర్ షోస్ పడనున్నాయి.

రీసెంట్ గా రిలీజ్ చేసిన కింగ్డమ్ ట్రైలర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడంతో సినిమా మీద మరింత హైప్ క్రియేట్ అవుతోంది. అన్నాదమ్ముల అనుబంధం నేపథ్యంగా సాగే గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీగా కింగ్డమ్ ప్రేక్షకుల్లో కావాల్సినంత బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో విజయ్ కు బ్లాక్ బస్టర్ పక్కా అనే అంచనాలు ఏర్పడుతున్నాయి. కింగ్డమ్ సక్సెస్ పై అటు నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కూడా పూర్తి కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved