pizza

KINGDOM Ready for Release with U/A Certificate
U/A సర్టిఫికెట్ తో సిద్ధంగా 'కింగ్డమ్'

You are at idlebrain.com > news today >

26 July 2025
Hyderabad

The censor formalities for KINGDOM have been completed. Starring Vijay Deverakonda in the lead role and Bhagyashri Borse as the female lead, the film also features Satyadev in a key role. Produced by the renowned banner Sithara Entertainments, the film is directed by Gowtam Tinnanuri, with music composed by popular music director Anirudh Ravichander.

The film is expected to be an emotional drama revolving around the bond between two brothers. Recently, a song showcasing the love between the brothers was released and received a positive response, further raising expectations around the movie.

The trailer is set to be released this evening, and with all censor formalities now complete, KINGDOM is gearing up for a grand theatrical release on July 31st. The film has been awarded a U/A certificate, which is expected to have a positive impact on its box office prospects.

U/A సర్టిఫికెట్ తో సిద్ధంగా 'కింగ్డమ్'

'కింగ్డమ్' సినిమాకు సెన్సార్ పనులు పూర్తయ్యాయి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించగా, హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే మెరవబోతున్నారు. మరో కీలకపాత్రలో సత్యదేవ్ కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్టైన్మెంట్స్' ఈ సినిమాను నిర్మించగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ దీనికి సంగీతాన్ని అందించడం జరిగింది. అన్నదమ్ముల మధ్య సాగే కథతో భావోద్వేగంగా ఈ సినిమా ఉండొచ్చని అంచనా. ఇటీవలే అన్నదమ్ముల మధ్య ప్రేమను చూపిస్తూ విడుదలైన పాటకు మంచి స్పందనే రావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయనే చెప్పుకోవచ్చు. ఈ సినిమా ట్రైలర్ ఈరోజు సాయంత్రం విడుదల కాబోతుంది. కాగా ఈ సినిమా సెన్సార్ పనులన్నిటినీ పూర్తి చేసుకొని ఈ నెల 31 న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అయిపోయింది. సెన్సార్ ఈ సినిమాకు U/A ఇవ్వడంతో కలక్షన్లపై సానుకూల ప్రభావం పడే అవకాశం ఉంది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved