16 October 2024
Hyderabad
After completing the film "Bheema Deverapalli Branch," I spent a lot of time thinking about what kind of story to do next. Out of that thought process came the story of Laggam. In Telangana culture, Laggam (a traditional wedding harness) is deeply connected to many emotions. The Telangana Laggam holds a unique significance. I wanted to bring those emotions and culture to the screen. I have written many of the characters in this story based on people I have seen growing up. When I first thought of the title Laggam, many people instantly connected with it. I never expected the title to receive such a huge response.
Laggam is a must-watch movie for NRIs and software engineers, a movie every farmer should see, a film for every girl about to get married, and one that every father with a daughter should watch. I have portrayed beautiful themes, emotions, and a lot of humor like painting a picture. When I conceived the idea of Laggam, I wanted the movie to end with a truth, and that’s exactly what I did. The climax will elevate the movie to another level.
"This Laggam will feel like a grand meal on a banana leaf." For everyone who has been married, I will remind you of your own Laggam. I have created a world called Laggam and will turn the audience into family members. The film is set for a global release on the 25th of this month. I hope everyone will come, watch the film, and bless us.
This is your family’s Laggam. Save the date!
This film is produced by Venu Gopal Reddy under Subishi Entertainments. The cast includes Sai Ronak, Pragya Nagra, Rajendra Prasad, Rohini, Saptagiri, LB Sriram, Krishnudu, Raghu Babu, Raccha Ravi, Kanakavva, Vadlamani Srinivas, Kaveri, Chammak Chandra, Chitram Srinu, Sandhya Gandham, T. Suguna, Lakshman Meesala, Prabhavati, Kancherapalem Raju, Prabhas Srinu, Viva Reddy, Satya Eleswaram, Anjibabu, Radandi Sadanandam, Kireeti, and Ravi Varma in key roles.
Story, dialogues, screenplay, and direction by Ramesh Cheppala. The film is produced by Venu Gopal Reddy. Background score by Mani Sharma. Cinematography by MN Balreddy. Music composed by Charan Arjun. Edited by Bonthala Nageswara Reddy. Choreography by Ajay Siva Shankar.
ఇది నా "లగ్గం" పిలుపు
"భీమదేవరపల్లి బ్రాంచి" సినిమా చేసాక నెక్స్ట్ ఎలాంటి కథ చెయ్యాలి అనే విషయంలో చాలా ఆలోచించాను.ఆ ఆలోచనల్లోనుండి పుట్టిన కథ లగ్గం, తెలంగాణ కల్చర్లో లగ్గం అనేది ఎన్నో ఎమోషన్స్ తో ముడిపడి ఉంటుంది. తెలంగాణ లగ్గానికి చాలా ప్రత్యేకత ఉంది. ఆ ఎమోషన్స్ ని కల్చర్ ని కలిపి తెరమీదకు తీసుకురావాలి అనుకున్నాను. చిన్నతనం నుండి నా చుట్టూ చూసిన ఎన్నో క్యారెక్టర్లనీ ఈ కథలో రాసుకున్న. మొదట లగ్గం అని టైటిల్ అనుకున్నప్పుడు టైటిల్ చెప్పగానే చాలా మంది కనెక్ట్ అయ్యారు. టైటిల్ కి అంత రెస్పాన్స్ అస్సలు ఊహించలేదు. ఇది ప్రవాస భారతీయులు &సాఫ్టువేర్ ఇంజనీర్ తప్పకుండా చూడాల్సిన సినిమా , ఒక రైతు చూడాల్సిన సినిమా , పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చూడాల్సిన సినిమా , అలాగే ఆడపిల్ల ఉన్న ప్రతి తండ్రి చూడాల్సిన సినిమా ఇది. చాలా మంచి విషయాలను, ఎమోషన్స్ ని, మంచి కామెడీతో ఒక పెయింటింగ్ లా పోట్రెయిట్ చేసాను. లగ్గం ఐడియా అనుకున్నప్పుడు ఈ సినిమానీ ఒక ట్రూత్ తో ఎండ్ చెయ్యాలి అనుకున్నాను, అదే చేసాను. క్లైమాక్స్ ఈ సినిమాని మరో మెట్టు ఎక్కిస్తుంది. 'ఈ లగ్గం అరిటాకులో విందుభోజనంలా ఉండబోతుంది'. పెళ్ళైన ప్రతీ ఒక్కరికీ వాళ్ళ లగ్గాన్ని వాళ్ళకి మరోసారి గుర్తుచేస్తాను.
నేను లగ్గం అని ఒక ప్రపంచాన్ని సృష్టించి ప్రేక్షకులను బంధువులుగా మార్చబోతున్నాను. ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలవుతుంది. అందరూ తప్పకుండా వచ్చి మమ్మల్ని దీవించండి.
ఇది మీ ఇంటి లగ్గం...సేవ్ ది డేట్
ఈ చిత్రాన్ని సుబిషి ఎంటర్టైన్మెంట్స్ వేణుగోపాల్ రెడ్డి గారు నిర్మించారు.
సాయి రోనక్, ప్రజ్ఞ నగ్ర, రాజేంద్రప్రసాద్,రోహిణి,సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రచ్చ రవి, కనకవ్వ, వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య గంధం, టి. సుగుణ ,లక్ష్మణ్ మీసాల, ప్రభావతి,కంచరపాలెం రాజు, ప్రభాస్ శ్రీను,
వివా రెడ్డి, సత్య ఏలేశ్వరం, అంజిబాబు, రాదండి సదానందం, కిరీటి, రవి వర్మ, తదితరులు ప్రముఖ పాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి కథ - మాటలు - స్క్రీన్ ప్లే- దర్శకత్వం రమేశ్ చెప్పాల, నిర్మాత: వేణుగోపాల్ రెడ్డి, నేపధ్య సంగీతం: మణిశర్మ, కెమెరామెన్: బాల్ రెడ్డి. సంగీతం:చరణ్ అర్జున్. ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి. కొరియోగ్రఫీ: అజయ్ శివశంకర్.
|