pizza

Laila 2nd song on 23
మాస్ కా దాస్ విశ్వక్సేన్, రామ్ నారాయణ్, సాహు గారపాటి, షైన్ స్క్రీన్స్ 'లైలా' సెకండ్ సింగిల్ ఇచ్చుకుందాం బేబీ జనవరి 23న రిలీజ్

You are at idlebrain.com > news today >

21 January 2025
Hyderabad

మాస్ కా దాస్ విశ్వక్సేన్ అప్ కమింగ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'లైలా'. రీసెంట్ గా రిలీజైన టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో విశ్వక్సేన్ అమ్మాయి- అబ్బాయిగా కనిపించనున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు.

'లైలా' ఫస్ట్ సింగిల్ సోనూ మోడల్ వీడియో సాంగ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ రోజు మేకర్స్ సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. సెకండ్ సింగిల్ 'ఇచ్చుకుందాం బేబీ' జనవరి 23న రిలీజ్ కానుంది. లీడ్ పెయిర్ రొమాంటిక్ కెమిస్ట్రీ ని ప్రెజెంట్ చేసిన సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ చాలా ఎట్రాక్టివ్ గా వుంది.

ఆకాంక్ష శర్మ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. వాసుదేవ మూర్తి స్క్రీన్ ప్లే అందించగా, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్.

లైలా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

నటీనటులు: విశ్వక్సేన్, ఆకాంక్ష శర్మ
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: షైన్ స్క్రీన్స్
నిర్మాత: సాహు గారపాటి
దర్శకత్వం: రామ్ నారాయణ్
రైటర్: వాసుదేవ మూర్తి
సంగీతం: లియోన్ జేమ్స్
సినిమాటోగ్రాఫర్: రిచర్డ్ ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved