MAD Square: MAD Gang is BACK and it’s crazier than ever!
'మ్యాడ్ స్క్వేర్' టీజర్ విడుదల.. పొట్టచెక్కలు అయ్యేలా నవ్వించడానికి 'మ్యాడ్' గ్యాంగ్ వచ్చేసింది!
The teaser for this highly awaited sequel released today and it’s a blasting stuff all the way. Mad team is pulling out all the stops to make MAD Square a memorable summer entertainer.
Helmed once again by Kalyan Shankar. MAD Square brings back our favorite mischief makers, Narne Nithin, Sangeeth Shobhan, Ram Nithin & Vishnu Oi (Laddu) who redefined entertainment with their infectious energy in the First Part. The teaser is a laugh riot packed with crackling chemistry, perfect punchlines and over the top madness.
Shamdat Sainudeen is the cinematographer. Editing by the National Award Winner Navin Nooli. Bheems Ceciroleo is back with a score that’s as catchy as it is enchanting.
Backed by the powerhouse trio of Sithara Entertainments, Fortune Four Cinemas and Srikara Studios with producers Haarika Suryadevara and Sai Soujanya and presenter Suryadevara Naga Vamsi, this film has all the makings of a blockbuster. Set to hit theaters on March 29, 2025.
Movie: Mad Square
Release Date: March 29, 2025
Genre: Comedy Drama
Banner: Sithara Entertainments & Fortune Four Cinemas
Presented by: Srikara Studios
బ్లాక్ బస్టర్ చిత్రం 'మ్యాడ్'కి సీక్వెల్ గా 'మ్యాడ్ స్క్వేర్'ను ప్రకటించినప్పటి నుండి, సినీ ప్రియులంతా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'లడ్డు గానీ పెళ్లి', 'స్వాతి రెడ్డి' పాటలు ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇప్పుడు ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లేలా 'మ్యాడ్ స్క్వేర్' నుంచి టీజర్ విడుదలైంది.
అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న 'మ్యాడ్ స్క్వేర్' టీజర్ ఈరోజు విడుదలైంది. విడుదలైన నిమిషాల్లోనే ఈ టీజర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ వేసవికి 'మ్యాడ్ స్క్వేర్', ప్రేక్షకులకు మరిచిపోలేని వినోదాన్ని పంచనుందని టీజర్ తో స్పష్టమైంది.
మ్యాడ్ సినిమాలో తనదైన ప్రత్యేక శైలి హాస్య సన్నివేశాలు, ఆకర్షణీయమైన కథనంతో ఎంతో పేరు తెచ్చుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్, ఈ సీక్వెల్ తో మరోసారి నవ్వుల విందుని అందించబోతున్నారు. మొదటి భాగంలో తమ అల్లరితో నవ్వులు పూయించిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మరియు విష్ణు ఓఐ (లడ్డు).. 'మ్యాడ్ స్క్వేర్'లో అంతకుమించిన అల్లరి చేయబోతున్నారు. టీజర్ లో వారి అల్లరి, పంచ్ డైలాగ్ లు కడుపుబ్బా నవ్విస్తున్నాయి.
'మ్యాడ్ స్క్వేర్' చిత్రానికి సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. ప్రముఖ ఛాయగ్రాహకుడు శామ్‌దత్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.
మ్యాడ్ స్క్వేర్ ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రేక్షకులు ఊహించిన దానికంటే ఎక్కువ వినోదాన్ని, ఎక్కువ మ్యాడ్ నెస్ ను మ్యాడ్ స్క్వేర్ లో చూడబోతున్నారని చిత్ర బృందం తెలిపింది. 2025, మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది.
చిత్రం: మ్యాడ్ స్క్వేర్
విడుదల తేదీ: మార్చి 29, 2025
బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ & ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకరా స్టూడియోస్
తారాగణం: సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, విష్ణు ఓఐ
దర్శకత్వం: కళ్యాణ్ శంకర్
సమర్పణ: సూర్యదేవర నాగ వంశీ
నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఛాయాగ్రహణం: శామ్‌దత్ ISC
కూర్పు: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల
అదనపు స్క్రీన్ ప్లే: ప్రణయ్ రావు తక్కళ్లపల్లి
కళ: పెనుమర్తి ప్రసాద్ M.F.A
ఫైట్ మాస్టర్: కరుణాకర్
#MADsquare teaser is hilarious. It has blockbuster vibe written all over it.