From her very first film, Telugu girl Sreeleela has been racing ahead on the Telugu silver screen with back-to-back opportunities. Hearing Sreeleela’s name instantly reminds audiences of top-notch dance numbers. She possesses the ability to match steps with heroes competitively. Very soon, she will also be seen alongside Pawan Kalyan in Ustaad Bhagat Singh. Sreeleela says Ustaad Bhagat Singh will create entertainment havoc on screen. After the massive success of Dhamaka, she is pairing up once again with Ravi Teja in Mass Jathara. The film is releasing worldwide on the 31st of this month. As part of promotions, she gave an interview to Idlebrain Jeevi.
For the first time in a film, she will be speaking in Srikakulam dialect and appearing in a fresh avatar. With the already-released trailer receiving tremendous response, audience and industry expectations on this film have shot up in a big way.
Speaking about her experience, Sreeleela said: During Dhamaka, hero Ravi Teja supported her a lot and would give many suggestions regarding expressions while acting. Acting with him is very comfortable, she said. Because of that, by the time Mass Jathara happened, all her fear and hesitation about acting with Ravi Teja disappeared.
Talking about acting with Mahesh Babu in Guntur Karam and matching his dance energy in the songs, she said everything aligned perfectly at that time, and with the blessings from above, the songs turned out so well. She said that when she listens to the story of a film she’s about to do, she must instantly like it and feel like watching it herself. Only then does she choose such scripts.
Responding to criticism on social media, Sreeleela said:
“There’s no rule that everyone must like us. Some people connect with certain things in a person, some don’t. That’s their personal space. If I feel hurt by criticism from two or three people, it means I’m ignoring the many who trust and love me. Criticism is just time-pass for some. Let them do it,” she replied in her own style.
Speaking about a film she’s doing in Bollywood, she said that although there are language differences, emotions remain the same whether it’s Bollywood or Tollywood. She revealed that before Mass Jathara, director Bhanu Bhogavarapu narrated a different story to her. When he came back a second time, he narrated Mass Jathara. He has complete clarity on the story, she added.
Talking about her favorite dance numbers from her films, she said:
“Madhura Nagarilo” from Pelli SandaD,
“Pulsar Bike” from Dhamaka,
“Kurchi Madathapetti” from Guntur Kaaram,
“Kisik” from Pushpa 2, and
“Super Duper” from Mass Jathara
are her favorites. She added that the Kisik song helped her gain opportunities in the Hindi industry as well.
She said she really enjoyed Rashmika’s The Girlfriend trailer and even messaged her personally to compliment her. She admires anyone who acts brilliantly. Among heroines, she loves Keerthy Suresh, Samantha, and Rashmika. She said she gets inspired watching those who have worked hard to build their careers.
She added that she loves painting, poetry, singing, and playing the veena. In the past, she has also represented the state in hockey competitions.
రవితేజ ఇచ్చిన కంఫర్ట్ తో 'మాస్ జాతర' కు వచ్చేసరికి భయం, మొహమాటాలన్నీ పోయాయ్ - శ్రీలీల
మొదటి సినిమా నుండే వరుస అవకాశాలతో తెలుగు తెరపై దూసుకుపోతున్న తెలుగమ్మాయి శ్రీలీల. శ్రీలీల పేరు వింటేనే బెస్ట్ డాన్స్ నంబర్స్ గుర్తుకొస్తాయి. హీరోలతో పోటీ పడుతూ స్టెప్పులేసే సామర్థ్యం ఆమె సొంతం. త్వరలో పవన్ కళ్యాణ్ ప్రక్కన 'ఉస్తాద్ భగత్ సింగ్' లో కూడా మెరవబోతున్నారు ఆమె. 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా తెరపై వినోదాలు సృష్టించబోతుందన్నారు శ్రీలీల. 'ధమాకా' భారీ విజయం తరువాత మరోసారి రవితేజతో శ్రీలీల కలిసి నటించిన చిత్రం 'మాస్ జాతర'. ఈ సినిమా ఈ నెల 31 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా 'ఐడిల్ బ్రెయిన్' జీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు శ్రీలీల. ఈ సినిమాలో మొదటిసారిగా శ్రీకాకుళం యాసలో మాట్లాడుతూ కొత్తగా కనిపించబోతున్నారామె. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై ఇటు ప్రేక్షకుల్లోనూ అటు సినీ వర్గాల్లోనూ భారీ అంచనాలే ఏర్పడ్డాయి.
శ్రీలీల మాట్లాడుతూ.. 'ధమాకా' టైమ్ లో హీరో రవితేజ తనకెంతో సహకరించేవారని, నటించేటప్పుడు హావభావాల విషయాల్లో చాలా సలహాలు ఇచ్చేవారని, ఆయనతో నటించడం చాలా సౌకర్యంగా ఉంటుందన్నారు. దాంతో 'మాస్ జాతర' కు వచ్చేసరికి రవితేజతో నటించడానికి భయం, మొహమాటాల్లాంటివి అన్నీ పోయాయన్నారు. 'గుంటూరు కారం' లో మహేష్ బాబుతో నటించడం, ఆ సినిమా పాటల్లో హీరోకు ధీటుగా డాన్స్ వేయడం గురించి మాట్లాడుతూ అప్పటికి అన్నీ కుదరడంతో, పైనున్న అమ్మ పలికించడంతో ఆ సినిమాలో పాటలు అంత బాగా రాగలిగాయన్నారు. తను చేయబోయే సినిమా కథ విన్నప్పుడే తనకు నచ్చాలని, చూడాలనిపించాలన్నారు. అలాంటి కథలనే ఎంచుకుంటానన్నారు.
సోషల్ మీడియాలో వచ్చే విమర్శలపై కూడా శ్రీలీల స్పందించారు. "అందరికీ మనం నచ్చాలని రూల్ లేదు. కొంతమంది కొన్ని విషయాలు చూసి ఒక మనిషితో కనెక్ట్ అవుతారు. కొందరు కనెక్ట్ అవ్వరు. అది వాళ్ల వ్యక్తిగతం. అలా అని ఓ ఇద్దరు ముగ్గురు చేసే విమర్శల విషయంలో బాధపడిపోతే నన్ను నమ్మి నన్ను ప్రేమించే చాలామందిని ఇగ్నోర్ చేసినట్టు అవుతుంది. విమర్శలు చేయడం అన్నది వాళ్లకు టైమ్ పాస్. సరేలే కానీయండి" అంటూ తనదైన శైలిలో సమాధానమిచ్చారు శ్రీలీల. బాలీవుడ్ లో నటిస్తున్న సినిమా గురించి మాట్లాడుతూ భాషలో తేడాలున్నా ఎమోషన్ విషయానికి వచ్చేసరికి బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా సమానమే అన్నారు. 'మాస్ జాతర' కంటే ముందు దర్శకుడు భాను భోగవరపు తనకు వేరే కథ వినిపించారన్నారు. రెండోసారి వచ్చినప్పుడు 'మాస్ జాతర' కథ తనకు చెప్పారన్నారు. ఆయనకు కథపై పూర్తి క్లారిటీ ఉందన్నారు.
తను నటించిన సినిమాల్లో తనకు బాగా నచ్చిన డాన్స్ నంబర్స్ గురించి మాట్లాడుతూ 'పెళ్లి సందడి' సినిమాలో 'మధురా నగరిలో' పాట, 'ధమాకా' సినిమాలో 'పల్సర్ బైక్' పాట, 'గుంటూరు కారం' సినిమాలో 'కుర్చీ మడత పెట్టి' పాట, 'పుష్ప2' సినిమాలో 'కిసిక్' పాట మరియు 'మాస్ జాతర' సినిమాలో 'సూపర్ డూపర్' పాటలు చాలా ఇష్టమన్నారు. 'కిసిక్ సాంగ్' తనకు హిందీ పరిశ్రమలో అవకాశం రావడానికి కూడా దోహదపడిందన్నారు. రష్మిక 'The Girlfriend' ట్రైలర్ తనకెంతో నచ్చిందని, ఆమెకు మెసేజ్ చేసి మరీ ఆ విషయం చెప్పానన్నారు. ఎవరు అద్భుతంగా నటించినా తనకెంతో నచ్చుతుందన్నారు. హీరోయిన్లలో కీర్తి సురేష్, సమంత, రష్మిక అంటే తనకెంతో ఇష్టమన్నారు. కష్టపడి తన కెరీర్లను నిర్మించుకున్న వాళ్ళందరినీ చూసి ఇన్స్పైర్ అవుతానన్నారు. పెయింటింగ్, కవిత్వం, పాడటం, వీణ వాయించడం లాంటివి తనకు చాలా ఇష్టమన్నారు. గతంలో రాష్ట్రం తరపున హాకీ పోటీల్లో కూడా పాల్గొన్నానన్నారు.