Mister Work From Home on 15 May
త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీష్ కురువిల్లా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న **ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’** మే 15న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అరవింద్ మండ్యం లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై నిర్మించారు. CH.V.S.N బాబ్జీ సమర్పిస్తున్నారు.
ఈ చిత్ర టీజర్, ట్రైలర్, విభిన్నమైన ప్రమోషన్లు, పాటలకు ఇప్పటికే ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు. మే 15న ఈ సినిమా శ్రీ వెంకట సాయి ఫిల్మ్స్, ముత్యాల రామదాస్ గారి డిస్ట్రిబ్యూషన్‌లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఫ్యూచర్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా ఉండబోతోందనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో పాటు, ఒక అందమైన ప్రేమకథ కూడా ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. నిజాయితీ గల అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకుంటే ఆ ప్రయాణం ఎంత వినోదాత్మకంగా ఉంటుందో ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ హృద్యమైన కుటుంబ కథా చిత్రం సమ్మర్‌లో ప్రేక్షకులకు సంపూర్ణ వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది.
ఈ చిత్రంలో నెల్లూరు సుదర్శన్, హర్ష చెముడు, గుండు సుదర్శన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
సాంకేతిక నిపుణులు:
సంగీతం: ప్రకాష్ చెరుకూరి, అరుణ్ చిలువేరు
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: రవికుమార్ వి.
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
సౌండ్ డిజైనర్: సంతోష్ వొదనల
యాక్షన్ కొరియోగ్రఫీ: రామ్ సుంకర