pizza

Dr. M. Mohan Babu Pays Respects to the Family of Late Kota Srinivasa Rao
కోట శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించిన డా. మంచు మోహన్ బాబు గారు

You are at idlebrain.com > news today >

21 July 2025
Hyderabad

Tollywood senior actor Dr. M. Mohan Babu garu visited the family of the late Kota Srinivasa Rao, expressing his deep condolences and reminiscing about their long-standing bond. Recalling their shared memories, Mohan Babu spoke about the close friendship and warmth he had with Kota Srinivasa Rao and expressed his grief over not being in Hyderabad on the day of his passing.

*Speaking to the media, Dr. Mohan Babu said,* "Kota Srinivasa Rao was a dear friend, someone very close to my heart. I wasn't in Hyderabad on the day of his sudden demise, and his passing left me deeply shocked. I came today to personally offer my condolences to his family.

He fondly remembered a phone call from Kota on the day of the ‘Kannappa’ release, "Kota called me to say the film was excellent and that Vishnu received great appreciation for his performance. That meant a lot."

*Reflecting on their professional journey, Mohan Babu shared:* "Back in 1987, I gave him a significant role as a magician and the main villain in my film Veera Pratap, produced under my own banner. Since then, we’ve acted together in several films, both under my production and others.

Kota was a phenomenal actor, capable of delivering any kind of dialogue with impeccable modulation, whether it was a villain, a comedian, or a character role. He brought life to every performance with absolute ease."

*Mohan Babu also emphasized how close Kota was to his own family:* "Kota Srinivasa Rao wasn’t just a co-star; he was like family. His loss is not just a personal one for us but a huge void for the entire film industry. I pray for eternal peace for his soul and strength for his family during this difficult time."

కోట శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించిన డా. మంచు మోహన్ బాబు గారు

టాలీవుడ్ సీనియర్ నటుడు స్వర్గీయ కోట శ్రీనివాసరావు కుటుంబాన్ని డా. మంచు మోహన్ బాబు పరామర్శించారు. కోట శ్రీనివాసరావుతో తనకున్న అనుబంధాన్ని, ఆత్మీయతను, నాటి రోజుల్ని తలుచుకున్నారు. ఆయన అకాల మరణం చెందిన రోజున తాను హైదరాబాద్‌లో లేను అని మోహన్ బాబు తెలిపారు. అందుకే ఈ రోజు ఇలా ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చానని అన్నారు.

*ఈ మేరకు డా. ఎం. మోహన్ బాబు గారు మీడియాతో మాట్లాడుతూ..* ‘కోట శ్రీనివాసరావు నాకు అత్యంత ఆప్తుడు. ఆయన అకాల మరణం రోజు నేను హైదరాబాద్‌లో లేను. ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. కన్నప్ప రిలీజ్ రోజు ఫోన్ చేసి.. సినిమా చాలా బాగుంది.. విష్ణుకు మంచి పేరు వచ్చింది అని నాతో చెప్పారు. 1987 సంవత్సరంలో "వీరప్రతాప్" అనే సినిమాలో మాంత్రికుడుగా మెయిన్ విలన్‌గా నా బ్యానర్‌లో అవకాశం ఇచ్చాను. మా బ్యానర్‌లో, బయట బ్యానర్‌లలో మేం కలిసి చాలా సినిమాల్లో నటించాం.

ఏ పాత్రనైనా అవలీలగా పోషించగలిగిన గొప్ప నటుడు కోట. విలన్‌గా, కమెడియన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా డిఫరెంట్ టైప్ ఆఫ్ మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు. కోట శ్రీనివాసరావు మా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు. ఆయన మరణం నా కుటుంబానికే కాకుండా సినిమా పరిశ్రమకు తీరని లోటు. వారి ఆత్మకు శాంతి, వారి కుటుంబానికి మనశ్శాంతి కలగాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved