Megastar Chiranjeevi’s Mana Shankara Vara Prasad Garu Most Stylish Climax Fight Shoot In Hyderabad
మెగాస్టార్ చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు మోస్ట్ స్టైలిష్ క్లైమాక్స్ ఫైట్ హైదరాబాద్‌లో షూటింగ్
Megastar Chiranjeevi’s most-awaited wholesome entertainer Mana Shankara Vara Prasad Garu directed by Hit-Machine Anil Ravipudi also features Victory Venkatesh in a pivotal character. Venkatesh even joined the team recently, and he got warm reception from Chiranjeevi on the set. Produced by Sahu Garapati and Sushmita Konidela on Shine Screens and Gold Box Entertainments, the movie is proudly presented by Smt. Archana.
Meanwhile, the team has begun filming the stylish climax action sequence featuring Chiranjeevi and a group of fighters in Hyderabad, starting from today. Unlike a typical action scene, this sequence is crafted with a unique and visually captivating approach designed to impress audiences across the board. Renowned choreographer Venkat Master is supervising the action, ensuring every moment exudes precision. With Chiranjeevi’s unmatched charisma and grace, combined with Anil Ravipudi’s signature touch, the film is set to deliver a perfect and memorable end. The production work is progressing at a brisk pace.
Nayanthara is the leading lady in the movie that also features an ensemble cast with VTV Ganesh playing a crucial role.
Music sensation Bheems Ceciroleo provides the music, and the first single Meesala Pilla is trending across the country. Sameer Reddy handles the cinematography, while Tammiraju is the editor, and AS Prakash is the art director. The story is co-written by S. Krishna and G. Adi Narayana, with S. Krishna also serving as the executive producer.
Mana Shankara Vara Prasad Garu is arriving as one of the biggest attractions for the Sankranthi in 2026.
Technical Crew:
Writer & Director - Anil Ravipudi
Producers - Sahu Garapati & Sushmita Konidela
Banners: Shine Screens & Gold Box Entertainments
Presents - Smt.Archana
Music - Bheems Ceciroleo
Dop - Sameer Reddy
Production Designer - A.S. Prakash
Editor - Tammiraju
Writers - S Krishna, G Adi Narayana
Executive Producer - S Krishna
VFX Supervisor - Narendra Logisa
Line Producer - Naveen Garapati
Additional dialogues - Ajju Mahakali, Tirumala Nag
Chief Co-Director - Satyam Bellamkonda
మెగాస్టార్ చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు మోస్ట్ స్టైలిష్ క్లైమాక్స్ ఫైట్ హైదరాబాద్‌లో షూటింగ్
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. వెంకటేష్ ఇటీవలే ఈ సెట్ లో జాయిన్ అయ్యారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు.
ఈరోజు నుండి చిరంజీవి గారు, ఫైటర్స్ బృందం పాల్గొనే స్టైలిష్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌ను హైదరాబాద్‌లో చిత్రీకరించడం ప్రారంభించారు. ఇది ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా విజువల్‌గా అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ వెంకట్ మాస్టర్ పర్యవేక్షణలో ప్రతి సన్నివేశం గ్రాండ్ గా రూపొందుతోంది. చిరంజీవి గారి చరిష్మా, గ్రేస్, అనిల్ రావిపూడి టచ్ కలిసిన ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతిని అందించనుంది. ప్రస్తుతం చిత్ర నిర్మాణ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి.
ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, వి.టి.వి. గణేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో సమకూర్చిన ఫస్ట్ సింగిల్ “మీసాల పిల్ల” దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ సమీర్ రెడ్డి, ఎడిటింగ్ తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్షన్ ఏ.ఎస్. ప్రకాష్. ఎస్.కృష్ణ, జి. ఆది నారాయణ సహారచయితలు. ఎస్.కృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.
2026 సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ గా ప్రేక్షకులు ముందుకు రానుంది.