These iconic dialogues by legendary actor Rao Gopal Rao from the film Mutyala Muggu still echo in the minds of audiences. The film is remembered not only for its melodious songs but also for its sharp and memorable dialogues, placing it among the top classics of Telugu cinema. This cinematic gem, crafted by the legendary duo Bapu and Ramana, has now completed fifty glorious years since its release.
Mutyala Muggu featured Sridhar and Sangeeta in lead roles, with Rao Gopal Rao’s villainous performance leaving a lasting impression. Veteran actor Allu Ramalingaiah also played a key role in the film. The song “Mutyamanta Pasupu, Mukhamento Chhaya” penned by Arudra continues to be heard in corners of both Telugu-speaking states, even decades later.
The film’s storyline draws inspiration from the Ramayana, portraying a husband who, driven by suspicion, distances his wife and later suffers in regret. Sridhar convincingly portrayed this emotionally tormented character. Sangeeta brought life to the role of a self-respecting, innocent Indian woman who silently endures humiliation, lives for her children, and clings to hope that truth will eventually prevail.
The children in the film serve as uniting forces between the estranged parents, akin to Lava and Kusha striving to reunite Sita and Rama. The director Bapu beautifully weaves in Hanuman’s support to the children, symbolically and visually enhancing the storytelling. K.V. Mahadevan’s music adds timeless strength to this poetic cinematic masterpiece.
ప్రేక్షకుల హృదయాల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న 'ముత్యాల ముగ్గు'
"పైనేదో మర్డర్ జరిగినట్టు లేదూ..."
"ఆకాశంలో సూర్యుడు నెత్తురు గడ్డలా లేడూ..."
"మడిసన్నాక కాసింత కళాపోషణ ఉండాలయ్యా.."
"ఉత్తినే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంటదీ.. " ఇవన్నీ ఇప్పటికీ ప్రేక్షకుల నోళ్లల్లో నానుతున్న 'ముత్యాల ముగ్గు' సినిమాలోని దిగ్గజ నటుడు రావు గోపాలరావు డైలాగులు. పాటలతో పాటూ ధీటుగా ప్రజాదరణ పొందిన సంభాషణలు ఉన్న సినిమాల్లో 'ముత్యాల ముగ్గు' సినిమా మొదటి వరుసలో ఉంటుందేమో. ఈ అద్భుత సినీ కావ్యం యాభై వసంతాలను పూర్తి చేసుకుంది. బాపు రమణలు సృష్టించిన ఈ అద్భుత సినీ కావ్యం అప్పట్లో అశేష ప్రజాదరణ పొందింది. ఈ సినిమాలో సంగీత, శ్రీధర్ ప్రధాన పాత్రధారులు. విలన్ పాత్రలో రావు గోపాలరావు పలికించిన సంభాషణలు అప్పట్లో ఓ సంచలనమే. అల్లు రామలింగయ్య మరో కీలక పాత్రలో కనిపిస్తారు.
ఈ సినిమాలో ఆరుద్ర కలం నుండి జారిన "ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ" పాట రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ ఏదో ఒక మూలన వినిపిస్తూనే ఉంటుంది. 'రామాయణం' నుండి స్ఫూర్తి పొందినట్టే ఉంటుంది ఈ సినిమా కథ మొత్తం. అనుమానంతో భార్యను శంకించి, ఆమెను దూరం చేసుకొని వేదన అనుభవించే పాత్రలో శ్రీధర్, అవమానాలను దిగమిగుతూ, బిడ్డల కోసం బ్రతుకుతూ, ఎప్పటికైనా నిజం బయటకు రాదా అన్న ఆశతో జీవించే సగటు ఓ భారతీయ అమాయకపు స్త్రీ పాత్రకు సంగీత జీవం పోశారనే చెప్పుకోవచ్చు. తల్లితండ్రులను కలిపే బిడ్డలను చూస్తే సీతారాములను కలపడం కోసం ఆరాటపడే లవకుశల మాదిరే కనిపిస్తారు. ఆ పిల్లలకు ఆంజనేయుడు సహకరించడం కూడా అద్భుతంగా చూపించారు చిత్ర దర్శకుడు బాపు. కేవీ మహ దేవన్ అందించిన సంగీతం ఈ సినిమాకు అదనపు బలం.