Mr Work From Home Press Meet
“Agadha” Is Set to Be a Visual Wonder; The Film Has Many More Surprises Beyond the Teaser – M.S. Raju
“విజువల్ వండర్ లాంటి ‘అగధ’ లో టీజర్‌లో చూపించని ఎన్నో అంశాలు ఉంటాయి” - టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ఎం.ఎస్. రాజు
Under the banner of Sri Aadi Varaha Productions, Kasi Visalakshi Balusu is producing the film “Agadha” on a grand scale in Telugu, Tamil, Kannada, Malayalam, and Hindi languages simultaneously. The film is written and directed by M.S. Raju. The movie stars Kamakshi Bhaskarla, Shravan Reddy, Ulka Gupta, Jovika Vijay Kumar, Sijju, Roshan, Shreya Rani Reddy, and others in key roles. The teaser of the movie was released on Thursday. Speaking at the teaser launch event…
M.S. Raju said, “As filmmakers, we have many dreams. I have made several films according to my dreams. I would like to thank my sister-like Visalakshi garu, Dr. Raju garu, Subbaraju, and another friend for bringing my dream project ‘Agadha’ to this level. I believe everyone will like our teaser. With the blessings of the Goddess I believe in, I think this film will become a huge success. The teaser itself shows the kind of work done by the technicians and artists. This movie will be a visual wonder. There are many elements in the film that were not shown in the teaser. Hats off to Kamakshi for her dedication and sincerity as Mahadevi. ‘Polimera’ fame Anil garu supported this project a lot. Without Shravan, this movie would not exist. This film will take Shravan to another level. Ulka is a wonderful actress. Jovika, granddaughter of Manjula garu and daughter of Vanitha garu, is making her Telugu debut with this film. She will carry forward Manjula garu’s legacy. Editor Junaid, cameraman Nani, Chaitanya, Rajeev, Vicky, Rajesh — everyone worked wholeheartedly for this film. I wish ‘Agadha’ becomes a big hit,” he said.
Producer Kasi Visalakshi Balusu said, “Thanks to everyone who came to the teaser launch of ‘Agadha.’ I entered film production because of my elder brother M.S. Raju garu. I thank Raju garu and Subbaraju garu for supporting me in this journey. I believe everyone liked our teaser. I hope audiences watch and make our movie a hit,” she said.
Kamakshi Bhaskarla said, “Thanks to M.S. Raju garu for giving me an opportunity in a wonderful film like ‘Agadha.’ Raju garu told me that the ‘Polimera’ poster looked good. I was very happy when he called me for this project. Thanks to Raju garu for believing that I could perform the role of Mahadevi. You will continue to hear more about this film in the coming days. Only a few films stay with us forever, and ‘Agadha’ will be one such film. The character Mahadevi will always remain within me. I believe the audience will also experience the same feeling,” she said.
Shravan Reddy said, “M.S. Raju garu introduced me to the screen with ‘Dirty Hari.’ I’m happy to work with him again for ‘Agadha.’ There is a huge difference between that film and this one. I learned a lot by working with Raju garu. This movie has many layers. Thanks to Raju garu and Visalakshi garu for giving me such a good role,” he said.
Ulka Gupta said, “Thanks to Raju garu and Visalakshi garu for giving me an opportunity in ‘Agadha.’ I entered acting at the age of six. I never imagined I would get such a good role in a film like this. This is a great opportunity for me. I learned a lot from Kamakshi, Shravan, and everyone else. I believe everyone will like our ‘Agadha,’” she said.
Jovika Vijay Kumar said, “I am entering the Telugu film industry with ‘Agadha.’ I will always be grateful to M.S. Raju garu for giving me this opportunity. Everyone who saw the first look praised me saying I look like my grandmother Manjula garu. I believe everyone will like this film and my performance in it,” she said.
Vanitha Vijay Kumar said, “Even today, people remember me because of the film ‘Devi.’ I am happy that Raju garu is introducing Jovika through ‘Agadha.’ He is presenting her as a performer on screen. I believe ‘Agadha’ will become a bigger hit than ‘Devi,’” she said.
Senior journalist Nishant said, “There was a time when M.S. Raju’s films felt like festivals. I hope the same atmosphere returns with ‘Agadha.’ I wish the film great success,” he said.
Senior journalist Prabhu said, “M.S. Raju is a brand. The word ‘maker’ itself began with M.S. Raju garu. He attracted everyone with just one poster. I believe ‘Agadha’ will become a big success,” he said.
Senior journalist Nagendra Kumar said, “M.S. Raju garu always bounces back strongly. Watching the shooting of ‘Agadha’ reminded me of the days of ‘Devi.’ I hope ‘Agadha’ achieves success on the level of ‘Devi,’” he said.
Senior journalist Suresh Kondeti said, “The teaser of ‘Agadha’ is impressive. As a producer, M.S. Raju garu delivered many hits. As a director too, he is going to score another hit with ‘Agadha.’ I really liked the poster and teaser. I wish ‘Agadha’ becomes a blockbuster hit,” he said.
Senior journalist TV5 Rambabu said, “M.S. Raju is a brand. I hope ‘Agadha’ becomes a hit on the scale of ‘Devi,’” he said.
Ankita said, “Thanks to everyone who came to the teaser launch of ‘Agadha.’ Thanks to Raju garu for giving me opportunities in ‘Dirty Hari’ and ‘Agadha,’” she said.
Technical Team:
Writer & Director: M.S. Raju
Producer: Kashi Visalakshi Balusu
Banner: Sri Aadi Varaha Productions
Music Director: Rakesh Venkatapuram
Cinematography: Nani Chamidisetty
Editor: Junaid Siddiqui
Production Designer: Rajeev Nair
Additional Screenplay: Chaitanya Vegi
Executive Producer: N.V.N. Subbaraju
“విజువల్ వండర్ లాంటి ‘అగధ’ లో టీజర్‌లో చూపించని ఎన్నో అంశాలు ఉంటాయి” - టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ఎం.ఎస్. రాజు
ఎం. ఎస్. రాజు రచన, దర్శకత్వం లో శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు 'అగధ' చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఏకకాలంలో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్, సిజ్జు , రోషన్, శ్రేయరాణి రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. తాజాగా గురువారం నాడు ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో..
ఎం. ఎస్. రాజు మాట్లాడుతూ .. ‘‘ఫిల్మ్ మేకర్స్‌గా మాకెన్నో కలలుంటాయి. నా కలలకు తగ్గట్టుగా నేను ఎన్నో చిత్రాల్ని తీశాను. ఇప్పుడు నా డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘అగధ’ని ఈ స్థాయికి తీసుకు వచ్చిన నా సోదరి సమానురాలైన విశాలాక్షి గారికి, డా. రాజు గారు, సుబ్బరాజు, ఇంకో మిత్రుడికి థాంక్స్. మా టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. నేను నమ్ముకున్న అమ్మవారి ఆశీస్సులతో ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను. టెక్నీషియన్ల పనితనం, ఆర్టిస్టుల వర్క్ ఎలా ఉండబోతోందో టీజర్ చూస్తేనే అర్థమై ఉంటుంది. విజువల్ వండర్‌గా ఈ సినిమా ఉంటుంది. టీజర్‌లో చూపించని ఎన్నో అంశాలు సినిమాలో ఉంటాయి. మహాదేవిగా కామాక్షి డెడికేషన్, సిన్సియారిటీకి హ్యాట్సాఫ్. ఈ ప్రాజెక్టులో ‘పొలిమేర’ ఫేమ్ అనిల్ గారు ఎంతో సపోర్ట్ చేశారు. శ్రవణ్ లేకపోతే ఈ సినిమా లేదు. ఈ మూవీతో శ్రవణ్ వేరే రేంజ్‌కి వెళ్తాడు. ఉల్కా అద్భుతమైన నటి. మంజుల గారి మనవరాలు, వనిత గారి కూతురు జోవిక ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతోన్నారు. మంజుల గారి లెగసీని జోవిక కంటిన్యూ చేస్తారు. ఎడిటర్ జునైద్, కెమెరామెన్ నాని, చైతన్య, రాజీవ్, విక్కీ, రాజేష్ ఇలా అందరూ ఈ సినిమాకి ప్రాణం పెట్టి పని చేశారు. ‘అగధ’ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
నిర్మాత కాశీ విశాలాక్షి బలుసు మాట్లాడుతూ .. ‘‘అగధ’ టీజర్ లాంచ్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా అన్న ఎం.ఎస్. రాజు గారి వల్లే సినిమా నిర్మాణంలోకి వచ్చాను. ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన రాజు గారికి, సుబ్బరాజు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా మూవీ టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. మా సినిమాని అందరూ చూసి హిట్ చేస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ .. ‘‘అగధ’ లాంటి ఓ అద్భుతమైన చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన ఎం.ఎస్. రాజు గారికి థాంక్స్. ‘పొలిమేర’ పోస్టర్ బాగుందని రాజు గారు నాతో చెప్పారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన నన్ను పిలిచినప్పుడు ఎంతో సంతోషించాను. మహాదేవి పాత్రను నేను పోషించగలను అని నమ్మిన రాజు గారికి థాంక్స్. ఈ చిత్రం గురించి మున్ముందు ఇంకా వింటూనే ఉంటారు. కొన్ని సినిమాలు మాత్రమే మనతో నిత్యం ఉండిపోతాయి. ‘అగధ’ అలాంటి ఓ సినిమానే అవుతుంది. మహాదేవి పాత్ర ఎప్పటికీ నాతోనే, నాలోనే ఉండిపోతుంది. అదే ఫీలింగ్‌ను ఆడియెన్స్‌ను కూడా ఎక్స్‌పీరియెన్స్ చేస్తారని నమ్ముతున్నాను’ అని అన్నారు.
శ్రవణ్ రెడ్డి మాట్లాడుతూ .. ‘‘డర్టీ హరి’తొ నన్ను ఎం.ఎస్.రాజు గారు తెరకు పరిచయం చేశారు. మళ్లీ ఆయనతోనే ‘అగధ’ చేయడం ఆనందంగా ఉంది. ఆ సినిమాకి, ఈ సినిమాకి ఎంతో తేడా ఉంటుంది. రాజు గారితో పని చేయడం వల్ల ఎంతో నేర్చుకున్నాను. ఈ మూవీలో ఎన్నో లేయర్స్ ఉంటాయి. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన రాజు గారికి, విశాలాక్షి గారికి థాంక్స్’ అని అన్నారు.
ఉల్కా గుప్తా మాట్లాడుతూ .. ‘‘అగధ’లో నాకు అవకాశం ఇచ్చిన రాజు గారికి, విశాలాక్షి గారికి థాంక్స్. ఆరేళ్ల వయసు నుంచే యాక్టింగ్‌లోకి వచ్చాను. ఇలాంటి ఓ చిత్రంలో, ఇంత మంచి పాత్ర వస్తుందని నేను ఊహించలేదు. ఇది నాకు గొప్ప అవకాశం. కామాక్షి, శ్రవణ్ ఇలా అందరి నుంచి ఎంతో నేర్చుకున్నాను. మా ‘అగధ’ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను’ అని అన్నారు.
జోవికా విజయ్ కుమార్ మాట్లాడుతూ .. ‘‘అగధ’తో నేను తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎం.ఎస్. రాజు గారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఫస్ట్ లుక్ చూసిన అందరూ మా అమ్మమ్మ మంజుల గారిలా ఉన్నానని ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా, అందులో నా నటన అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను’ అని అన్నారు.
వనితా విజయ్ కుమార్ మాట్లాడుతూ .. ‘‘ఇప్పటికీ నన్ను ‘దేవి’ సినిమాతోనే గుర్తు పడతారు. ఈ ‘అగధ’ సినిమాతో జోవికాని రాజు గారు ఇంట్రడ్యూస్ చేయడం ఆనందంగా ఉంది. ఓ పర్ఫార్మర్‌గా జోవికాని తెరకు పరిచయం చేయబోతోన్నారు. ఈ ‘అగధ’ చిత్రం ‘దేవి’ కంటే పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను’ అని అన్నారు.
* ప్రముఖ జర్నలిస్ట్ నిశాంత్ మాట్లాడుతూ* .. ‘ఎం.ఎస్. రాజు చిత్రాలు ఒకప్పుడు పండుగలా ఉండేవి. మళ్లీ అలాంటి వాతావరణమే ఈ ‘అగధ’తో రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
* ప్రముఖ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ* .. ‘ఎం.ఎస్. రాజు అంటే ఓ బ్రాండ్. మేకర్ అనే పదం ఎం.ఎస్. రాజు గారి నుంచే ప్రారంభమైంది. ఒక్క పోస్టర్‌తో అందరినీ ఆకర్షించారు. ‘అగధ’ మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను’ అని అన్నారు.
* ప్రముఖ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ* .. ‘ఎం.ఎస్. రాజు గారు ఎప్పటికప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతూ ఉంటారు. ‘అగధ’ చిత్రీకరణ చూసినప్పుడు నాకు ‘దేవి’ రోజులు గుర్తుకు వచ్చాయి. ‘అగధ’ కూడా ‘దేవి’ స్థాయిలో విజయం దక్కాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
ప్రముఖ జర్నలిస్ట్ సురేష్ కొండేటి మాట్లాడుతూ .. ‘‘అగధ’ టీజర్ బాగుంది. నిర్మాతగా ఎం.ఎస్. రాజు గారు ఎన్నో హిట్స్ ఇచ్చారు. దర్శకుడిగా ఇప్పుడు ‘అగధ’తో మరోసారి హిట్టు కొట్టబోతోన్నారు. పోస్టర్, టీజర్ నాకు చాలా నచ్చాయి. ఈ ‘అగధ’ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
ప్రముఖ జర్నలిస్ట్ టీవీ5 రాంబాబు మాట్లాడుతూ .. ‘ఎం.ఎస్. రాజు అంటే ఓ బ్రాండ్. ‘దేవి’ స్థాయిలో ‘అగధ’ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
అంకిత మాట్లాడుతూ .. ‘‘అగధ’ టీజర్ లాంచ్‌కి వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ‘డర్టీ హరి’, ‘అగధ’లో అవకాశం ఇచ్చిన రాజు గారికి థాంక్స్’ అని అన్నారు.
సాంకేతిక బృందం:
రచయిత మరియు దర్శకుడు: ఎం. ఎస్. రాజు
నిర్మాత: కాశీ విశాలాక్షి బలుసు
బ్యానర్: శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్
సంగీత దర్శకుడు: రాకేష్ వెంకటాపురం
సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి
ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్ నాయర్
అదనపు స్క్రీన్ ప్లే: చైతన్య వేగి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్ వి ఎన్ సుబ్బరాజు.