Virat Karna is playing the lead role in the pan-India film "Nagabandham," directed by Abhishek Nama and produced by Kishore Annapureddy under NIK Studios, in association with Abhishek Pictures. A grand dance sequence is currently being filmed on a massive set, featuring Virat Karna alongside heroines Nabha Natesh and Aishwarya Menon, with choreography by Ganesh Acharya.
విరాట్ కర్ణ హీరోగా, అభిషేక్ నామా దర్శకత్వంలో, కిషోర్ అన్నపురెడ్డి నిర్మాతగా NIK స్టూడియోస్, ఇన్ అసోసియేషన్ విత్ అభిషేక్ పిక్చర్స్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘నాగబంధం’ సినిమా నిర్మాణం భారీ సెట్‌లో హీరో విరాట్ కర్ణ, హీరోయిన్స్ నభా నటేష్, ఐశ్వర్యమీనన్‌పై గణేష్ ఆచార్య మాస్టర్ కొరియోగ్రఫీలో అదిరిపోయే డ్యాన్స్ సాంగ్ షూటింగ్ జరుగుతోంది.
విరాట్ కర్ణ హీరోగా, అభిషేక్ నామా దర్శకత్వంలో, కిషోర్ అన్నపురెడ్డి నిర్మాతగా NIK స్టూడియోస్, ఇన్ అసోసియేషన్ విత్ అభిషేక్ పిక్చర్స్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘నాగబంధం’ సినిమా నిర్మాణం భారీ సెట్‌లో హీరో విరాట్ కర్ణ, హీరోయిన్స్ నభా నటేష్, ఐశ్వర్యమీనన్‌పై గణేష్ ఆచార్య మాస్టర్ కొరియోగ్రఫీలో అదిరిపోయే డ్యాన్స్ సాంగ్ షూటింగ్ జరుగుతోంది.
యంగ్ హీరో విరాట్ కర్ణ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘నాగబంధం’. ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్ అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గ్రాండ్ స్కేల్‌లో రూపొందుతోంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ మంచి బజ్ క్రియేట్ చేసింది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నానక్ రామ్ గూడ రామానాయుడు స్టూడియోలో జరుగుతోంది. హీరో విరాట్ కర్ణ, హీరోయిన్స్ నభా నటేష్, ఐశ్వర్య మీనన్‌పై ఓ గ్రాండ్ సాంగ్‌ని షూట్ చేస్తున్నారు. ఈ సాంగ్ కోసం ఓ భారీ సెట్ నిర్మించారు.
మ్యూజిక్ డైరెక్టర్ అభే ఓ బ్లాక్ బస్టర్ నెంబర్‌ను కంపోజ్ చేశారు. కాలభైరవ, అనురాగ్ కులకర్ణి, మంగ్లీ తమ ఎనర్జిటిక్ వోకల్స్ ఆలపించిన ఈ సాంగ్‌కి కాసర్ల శ్యామ్ అద్భుతమైన లిరిక్స్‌ని రాశారు.
కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య మాస్టర్ డ్యాన్స్ మూమెంట్స్ ఇందులో స్పెషల్ ఎట్రాక్షన్‌గా వుండబోతున్నాయి. మెస్మరైజింగ్ డ్యాన్స్ మూమెంట్స్‌తో ఈ సాంగ్ అలరించబోతోంది.
‘ది సీక్రెట్ ట్రెజర్’ అనే ట్యాగ్‌లైన్‌తో ‘నాగబంధం’ ఒక ఎపిక్ అడ్వెంచర్‌గా రూపుదిద్దుకుంటోంది. అభిషేక్ నామా కథ, స్క్రీన్‌ప్లే రెండింటికీ తనదైన విజన్‌ను తీసుకువస్తున్నారు. NIK స్టూడియోస్ ఆధ్వర్యంలో కిషోర్ అన్నపురెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని లక్ష్మీ ఐరా, దేవాన్ష్ నామా గర్వంగా సమర్పిస్తున్నారు.
ఈ చిత్రంలో విరాట్ కర్ణ హీరో, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్స్, జగపతి బాబు, రిషభ్ సహానీ, జయప్రకాష్, జాన్ విజయ్, మురళీ శర్మ, అనసూయ, శరణ్య, ఈశ్వరిరావు, జాన్ కొక్కిన్, అంకిత్ కొయ్య, సోనియా సింగ్, మాథ్యూ వర్గీస్, జాసన్ షా, బి.ఎస్.అవినాష్, బేబి కియరా కీలక పాత్రల్లో నటించారు.
పాన్ ఇండియన్ ఫిల్మ్ నాగబంధం ఒక పురాణ ఇతిహాసాల నుంచి తీసుకున్న కథాంశాన్ని మిళితం చేస్తూ పద్మనాభస్వామి, పూరీ జగన్నాథ దేవాలయాల వద్ద ఇటీవల కనుగొనబడిన గుప్త నిధుల నుంచి ప్రేరణ పొంది, ఆధ్యాత్మిక సాహసోపేతమైన ఇతివృత్తాలతో వుంటుంది. ఈ పవిత్ర స్థలాలను రక్షించే నాగబంధం పురాతన ఆచారాలపై దృష్టి సారించి, భారతదేశంలోని విష్ణు దేవాలయల చుట్టూ ఉన్న రహస్యాన్ని నాగబంధంలో అద్భుతంగా ప్రజెంట్ చేస్తున్నారు.
ఈ చిత్రం అసాధారణమైన నిర్మాణ విలువలు, అత్యాధునిక విఎఫ్‌ఎక్స్ హై – ఆక్టేన్ అడ్వెంచర్‌కి ప్రామిస్ చేస్తోంది. ఈ చిత్రానికి సౌందర్ రాజన్ ఎస్ డీవోపీగా పనిచేస్తున్నారు. అభే సంగీత దర్శకుడు. కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్ రాయగా, ఆర్‌సీ ప్రణవ్ ఎడిటర్, అశోక్ కుమార్ ప్రొడక్షన్ డిజైనర్, స్ట్రిప్ట్ డెవలప్‌మెంట్ శ్రా1, రాజీవ్ ఎన్ కృష్ణ.
నాగబంధం 2025లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఏకకాలంలో పాన్ ఇండియా లెవల్‌లో విడుదల కానుంది.