#NTRNeel rolls in Hyderabad
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రెస్టీజియస్ మూవీ ‘ఎన్టీఆర్ నీల్’ షూటింగ్ ప్రారంభం.. రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ
Launched last August, the principal photography of Jr NTR’s next with KGF series helmer Prashanth Neel has finally kicked off in Hyderabad on Thursday.
Production house Mythri Movie Makers took to X to drop the update that fans of Tarak have been waiting for months. “The SOIL finally welcomes its REIGN to leave a MARK in the HISTORY books of Indian Cinema! #NTRNeel shoot has officially begun. A whole new wave of ACTION & EUPHORIA is ready to grip the Masses,” the production house wrote, attaching a still from the sets in Ramoji Film City. The still shows a large crowd assembling at what seems to be a protest zone, with Neel giving instructions from far behind.
Tarak too posted, “And it begins.”
The initial plan was to take this film to floors last year itself but with Tarak occupied with War 2, the shoot had to be deferred. The actor will be diving into this film next month. The film will be extensively shot in Kolkata, Goa, Sri Lanka in addition to Hyderabad.
There is speculation that the film might be titled Dragon. Said to be a high-octane commercial entertainer in a period setting, the film sees Rukmini Vasanth opposite Tarak, while Malayalam heartthrob Tovino Thomas will be making his Telugu debut. He is believed to be playing the film’s antagonist. Co-produced by NTR Arts, the film is a Ravi Basrur musical.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రెస్టీజియస్ మూవీ ‘ఎన్టీఆర్ నీల్’ షూటింగ్ ప్రారంభం.. రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కె.జి.యఫ్ సిరీస్, సలార్ వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ సాధించిన సెన్సేషనల్ డైెరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్ వంటి మాస్ హీరోతో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ నీల్ పేరుతో గత ఏడాదిలో పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇద్దరు మాస్ ఇమేజ్ ఉన్న స్టార్స్ కాంబోలో రాబోతున్న ఈ మూవీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గురువారం నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. అందరూ ఆశ్చర్య పోయేలా 3వేల మంది జూనియర్ ఆర్టిస్టులతో భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణతో షూటింగ్ మొదలైంది. ఎన్టీఆర్ వచ్చే షెడ్యూల్ నుంచి షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందోనని అందరి కళ్లు ఇప్పుడు ఈ సినిమాపైనే ఉన్నాయి. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ భారీ పాన్ ఇండియా చిత్రం జనవరి 9, 2026లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవల్లో విడుదలవుతుంది. ముందుగానే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయటంతో అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు సైతం సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూడసాగారు. ఆ సమయం రానే వచ్చేసింది. రానున్న సంక్రాంతి థియేటర్స్‌కు ఈ చిత్రం సరికొత్త పండుగను తీసుకొస్తుందనటంలో సందేహం లేదు.
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అంటే బ్లాక్ బస్టర్ చిత్రాలకు కేరాఫ్.. ఆయన ఇప్పుడు ఎన్టీఆర్‌తో తెరకెక్కిస్తోన్న చిత్రాన్ని సరికొత్త మాస్ విజన్‌తో ఆవిష్కరించనున్నారు. ఇప్పటి వరకు తారక్‌ను చూడనటువంటి మాస్ అవతార్‌లో ప్రెజంట్ చేయనున్నారు. దీంతో వీరిద్దరి క్రేజీ కాంబినేషన్ సరికొత్త బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేస్తుందనటంలో సందేహం లేదు. ప్రెస్జీజియస్ బ్యానర్స్ మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణంలో అన్‌కాంప్రమైజ్డ్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆడియెన్స్‌కు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించనున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. చలపతి ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. ఈ ప్రెస్టీజియస్ మూవీలో ఇంకా టాప్ యాక్టర్స్, టెక్నీషియన్స్ అందరూ భాగమవుతున్నారు.
నటీనటులు:
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్
సాంకేతిక వర్గం:
నిర్మాణ సంస్థలు - మైతీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్
రచన, దర్శకత్వం - ప్రశాంత్ నీల్
నిర్మాతలు - కళ్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు
ప్రొడక్షన్ డిజైన్ - చలపతి
సినిమాటోగ్రఫీ - భువన్ గౌడ
సంగీతం - రవి బస్రూర్