pizza

Paradha pre release event
పరదా నా కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్. ఆగస్ట్ 22న సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ కూడా ఇదే మాట చెప్తారనే నమ్మకం ఉంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్

You are at idlebrain.com > news today >

18 August 2025
Hyderabad

సినిమా బండి ఫేమ్ డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల 'పరదా' అనే మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌ తో వస్తున్నారు. 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్‌ మేకర్స్ రాజ్, డికె మద్దతు ఇస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా, దర్శన రాజేంద్రన్‌తో పాటు, సంగీత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాగ్ మయూర్ ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ట్రైలర్ పాటలు మంచి బజ్ క్రియేట్ చేశాయి. ‘పరదా’ ఆగస్ట్ 22న థియేటర్స్‌లో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. డైరెక్టర్ ప్రవీణ్ గారు చాలా ప్యాషన్ తో ఈ సినిమా తీశారు. ఆయన ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తారు. నిర్మాతలు విజయ్ శ్రీధర్ గారు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ సినిమాని బలంగా నమ్మి ఎక్కడ రాజీ పడకుండా చాలా అద్భుతంగా నిర్మించారు. చిరంజీవి గారి బర్త్డే ఆగస్టు 22 నఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. దర్శనకి తెలుగు ఇండస్ట్రీకి వెల్కమ్ చెప్తున్నాను. దర్శన ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసింది. ఒక తెలుగు అమ్మాయిలాగే డైలాగ్స్ అన్నీ నేర్చుకుంది. సంగీత గారు ఈ సినిమాకి మరో బిగ్ పిల్లర్. అందరూ రిలేట్ చేసుకునే క్యారెక్టర్ చేశారు. ఈ సినిమాలో పనిచేసిన నటీనటులకు టెక్నీషియన్స్ కి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నా కెరీర్ లోనే బెస్ట్ ఫిలిం పరదా. ఆగస్టు 22 మీరు కూడా అదే చెప్తారని నమ్మకం నాకుంది. మీరు సినిమా చూడండి. నచ్చితే ఫ్రెండ్స్ కి సజెస్ట్ చేయండి. రివ్యూస్ చూసే థియేటర్స్ కి వెళ్ళండి. మీకు తప్పకుండా సినిమా నచ్చుతుంది. అందరికీ థాంక్యు.

దర్శన రాజేంద్రన్‌ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. పరదా చాలా స్పెషల్ ఫిలిం. ఆగస్టు 22న తప్పకుండా ఈ సినిమా చూడండి. ఒక మ్యాజిక్ ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. అనుపమ స్క్రీన్ పై గ్రేట్ మ్యాజిక్ చేస్తుంది. ఈ సినిమాల్లో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమా చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు. మీకు చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.

డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. పరదా చాలా మంచి ఫిలిం. తెలుగులో విమెన్ సెంట్రిక్ ఫిలిమ్స్ చాలా తక్కువగా వస్తాయి . ఈ సినిమా సక్సెస్ అయితే ఇలాంటి మరెన్నో సినిమాలు వస్తాయి. అనుపమ కూడా పెద్ద స్టార్. మీరందరూ కూడా ఫ్యామిలీతో కలిసి వెళ్లి ఈ సినిమా చూడండి. అనుపమ సంగీత దర్శన ఇలా అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో ఈ సినిమా తీయడం జరిగింది. ఈ సినిమా డబ్బులు వస్తే మిగతా ప్రొడ్యూసర్స్ కి ఒక మంచి హోప్ ని ఇస్తుందని భావిస్తున్నాను. పరదా సినిమా మలయాళం లో బ్లాక్ బస్టర్ అవ్వాలి. మన తెలుగు సినిమా మలయాళం లో బ్లాక్ బస్టర్ అవ్వాలి. అది నా కోరిక. మనం కూడా కంటెంట్ సినిమాలు చేయగలం. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాను. సినిమా మీకు నచ్చితే అందరూ కూడా నా కోసం ఒక్క ట్వీట్ చేయాలని కోరుకుంటున్నాను. మీ ట్వీట్ మాకు చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాకి మొదటి పది నిమిషాలు చాలా ఇంపార్టెంట్. అందుకే ఎవరూ కూడా బిగినింగ్ ని మిస్ అవ్వకూడదని కోరుకుంటున్నాను. ఆగస్టు 22 మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్ డే. అంతకంటే రెండు రోజులు ముందే ప్రివ్యూస్ వుంటాయి. రివ్యూస్ చూసే మీరు సినిమాకి వెళ్ళండి. అందరికీ థాంక్యు'అన్నారు

ప్రొడ్యూసర్ విజయ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. పరదా ఆగస్టు 22న రిలీజ్ అవుతుంది. మన అనుపమకి పెద్ద హిట్ ఇద్దాం. మన దర్శననికి గ్రాండ్ వెల్కమ్ చెబుదాం. నాకు 100% నమ్మకం ఉంది. ఈ సినిమా కంటెంట్ మీ అందరికీ నచ్చుతుంది. మా టెక్నీషియన్స్ యాక్టర్స్ అద్భుతంగా పనిచేశారు .అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

ప్రొడ్యూసర్ శ్రీధర్ మాట్లాడుతూ.. అందరికి నమస్కార. పరదా ఆగస్టు 22న రిలీజ్ అవుతుంది. ఇది రెండేళ్ల ప్రయాణం. మా సినిమాకి టెక్నీషియన్లు నటీనట్లు అందరూ అద్భుతంగా పనిచేశారు. ఈ సినిమా ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయదు. ఈ సినిమా మీ అందరినీ అన్ని రకాలుగా అల్లరిస్తుంది. ఈ సినిమా కోసం అనుపమ గారు అందిస్తున్న సహాయ సహకారాలు మేము మర్చిపోలేము. ఈ కంటెంట్ నమ్మి సినిమా చేసిన దర్శన రాజేంద్ర గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సినిమా చూసిన తర్వాత ఆమెని మన తెలుగింటి అమ్మాయి అనుకుంటారు. అలాగే సంగీత గారు కూడా అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు. విజయ్ గారి నాన్నగారు సుకుమార్ గారు ఇటీవలే అకాల మరణం చెందారు. ఆయన కొడుకు కష్టాన్ని చూశారుగాని సాధించబోయే విజయాన్ని చూడలేకపోయారు. ఆయన ఆశీర్వాదాలు ఎప్పటికీ ఉంటాయి. పరదా సాధించబోయే విజయాన్ని ఆయనకే అంకితం చేస్తున్నాం. తప్పకుండా ఈ సినిమా అందరూ చూడండి. మీ ఫ్రెండ్స్ కి చూపించండి. ఇది పది సంవత్సరాలు పాటు మాట్లాడుకునే సినిమా అవుతుంది.

రాగ్ మయూర్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సినిమా బండితో నన్ను అందరికీ పరిచయం చేసిన ప్రవీణ్ కి ముందుగా థాంక్యూ. పరదా సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. విమెన్ పవర్ చూపించే సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో అనుపమ గారితో కలిసి నటించడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మంచి లవ్ సీన్స్ ఉన్నాయి. ఆ సీన్ చూసి మీరు కూడా లవ్ లో పడతారు. దర్శన నాకు ఎప్పటినుంచో ఫ్రెండ్. ఫైనల్ గా పర్ఫెక్ట్ ఫిలింతో తెలుగులోకి వస్తుంది. ఆగస్టు 22 సినిమా రిలీజ్ అవుతుంది. మీ అందరికీ నచ్చుతుంది'. మూవీ యూనిట్ అంతా పాల్గొన్న ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved