pizza

AP DCM Pawan Kalyan congratulated Rajinikanth for completing 50 years
తరాలు మారినా తరగని వన్నె రజినీకాంత్ సొంతం - పవన్ కళ్యాణ్.

You are at idlebrain.com > news today >

16 August 2025
Hyderabad

Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan extended wishes to Superstar Rajinikanth on completing fifty years of his cinematic journey. He praised Rajinikanth as an inspiration to countless people. Whether portraying a villain or a hero, Rajinikanth carved a unique style of his own and left an everlasting impression on audiences.

“I’ve witnessed in Chennai many times how a theatre erupts the moment the title ‘Superstar Rajini’ appears on the silver screen. Even as generations change, the joy and excitement among cinephiles has never faded. Rajinikanth, who enjoys such unparalleled fandom, has completed five decades as an actor. Heartfelt congratulations to Superstar Rajinikanth garu on celebrating this golden jubilee of his film career.”

Pawan Kalyan further said Rajinikanth’s journey has inspired many, and his style continues to captivate new generations of fans. “Though he reached the peak as an actor, Rajinikanth garu, as a devotee of Mahavatar Babaji, pays special attention to spiritual practices and yoga. This reflects his devotion and religious faith. As he celebrates this golden jubilee, I wish Rajinikanth garu continues to delight audiences with many more diverse roles. I pray to God for his complete health, long life, and happiness,” Pawan Kalyan conveyed through the official Jana Sena Party Twitter account.

తరాలు మారినా తరగని వన్నె రజినీకాంత్ సొంతం - పవన్ కళ్యాణ్.

యాభై ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న అగ్ర హీరో రజినీకాంత్ కు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. నటుడిగా రజినీకాంత్ ఎందరికో స్ఫూర్తి అని కొనియాడారు. ప్రతినాయక పాత్ర పోషించినా, కథానాయకుడిగా మెప్పించినా రజినీకాంత్ తనదైన స్టైల్ ను చూపించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారన్నారు.

"వెండి తెరపై ‘సూపర్ స్టార్ రజిని’ అని టైటిల్ కనిపించగానే థియేటర్ ఏ విధంగా మారుమోగుతుందో పలుమార్లు చెన్నైలో చూశాను. తరాలు మారుతున్నా సినీ ప్రియుల్లో ఆ ఆనందోత్సాహాల వన్నె తగ్గలేదు. ఆ స్థాయి అభిమానులను దక్కించుకున్న అగ్రశ్రేణి కథానాయకుడు శ్రీ రజినీకాంత్ గారు నటుడిగా అయిదు దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. సినీ జీవితంలో స్వర్ణోత్సవం చేసుకుంటున్న సూపర్ స్టార్ శ్రీ రజినీకాంత్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు."

"నటుడిగా ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. రజినీకాంత్ స్టైల్స్ కి నవతరం ప్రేక్షకుల్లోనూ అభిమానులున్నారు. నటుడిగా శిఖరాగ్ర స్థాయికి చేరిన రజినీకాంత్ మహావతార్ బాబాజీ భక్తుడిగా ఆధ్యాత్మిక విషయాలపై, యోగా సాధనపై ప్రత్యేక శ్రద్ధ చూపడం ఆయనలో భక్తి భావాన్ని, ధార్మిక విశ్వాసాలను తెలియచేస్తుంది. నటుడిగా స్వర్ణోత్సవ సంబరాలు చేసుకుంటున్న రజినీకాంత్ మరిన్ని విభిన్న పాత్రలతో సినీ ప్రియులను మెప్పించాలని ఆకాంక్షిస్తున్నాను. రజినీకాంత్ కు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను" అంటూ జనసేన పార్టీ అధికార ట్విట్టర్ ఖాతా వేదికగా రజినీకాంత్ కు శుభాకాంక్షలు


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved