Everyone should come forward and encourage a good movie: Director and producer Vignesh at Pranayagodari pre-release event
డిసెంబర్ 13న రాబోతోన్న ‘ప్రణయ గోదారి’ని చూసి విజయవంతం చేయండి.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శక, నిర్మాత విఘ్నేశ్
The film Pranayagodari, starring Sadan as the hero and Priyanka Prasad as the heroine, with Sai Kumar playing a key role, is all set to release on December 13. Directed by P.L. Vignesh, the movie is produced by Paramalla Lingaiah under the banner of PLV Creations. A pre-release event was held on Monday, where MLC Teenmaar Mallanna, renowned producer Raj Kandukuri, and hero Sohail graced the occasion as special guests. The team of Pranayagodari also contributed a financial donation for a child's heart surgery.
*While speaking at the event, Sohail said*, "I know how hard it is for a small film to come out. People don’t enter the industry just to make money; they come for fame. If luck favours, money follows. I spent all the money I had to make a film, and I lost it. I was also trolled for it. Everyone makes a movie hoping to hit big. Pranayagodari is made with a team of newcomers. Recognize their hard work and go to the theatre to watch the film. It has a very natural village backdrop. New heroes, directors, and producers deserve encouragement from the audience. The film is releasing on December 13. Please watch it."
*Director and producer Vignesh said,* "Thanks to Teenmaar Mallanna, Raj Kandukuri, and Sohail for attending our event. I worked hard to produce this film. I sold all my assets and took loans to make it. I did this film for my brother Markandeya. He gave the music for this movie, and Prasad gave wonderful visuals. I worked hard to finish the film, but I struggled to release it. I took more loans for the release. Making and releasing a film is not an easy task, and now I realize that. PRO Sai Sathish has been a blessing for small films. Because of him, this movie has come this far. Distributors also came forward and promised us theatres. Our film is releasing on December 13. Everyone should come forward and encourage a good movie."
*Renowned producer Raj Kandukuri said,* "I really liked the title Pranayagodari. It felt very positive. There’s no such thing as big or small in films. I made Pelli Choopulu on a small budget, but it became a huge hit. That's why you can have good and bad films. Pranayagodari will be a good film. Vignesh is a great person, and Markandeya's music is beautiful. The media should support this film. Please watch it on December 13."
*MLC Teenmaar Mallanna said,* "I thank the team of Pranayagodari. I realized that the producer's situation at the time of a film’s release is similar to the state of a mother while giving birth. I don’t know where the idea of big or small films came from, because for me, a film is a film. During the movement, I also made a few documentaries. I really liked the film’s title, and I liked the trailer and songs. I hope the audience will support this film when it releases on December 13."
*Heroine Priyanka Prasad said,* "Thanks to Raj Kandukuri and Sohail for coming to promote our film. With this film, I am presenting myself to the Telugu audience. I thank the director and producer for believing in me and giving me this opportunity. DOP Prasad made us look great, and Markandeya’s music is fantastic. It was a pleasure working with Sadan. Our film is releasing on December 13, and I hope everyone will bless it."
*Music director Markandeya said,* "Pranayagodari is vast in its scope. Thanks to P.L. Vignesh, I have reached this level. I hope I have lived up to the trust he placed in me."
*Actress Usha Sri said,* "Hello, everyone. I am happy to be part of Pranayagodari. I thank the director and producer for this opportunity. I got a chance to act again as a daughter with Sai Kumar Garu. Sadan and Priyanka gave wonderful performances. Please watch our film on December 13 and make it a success."
డిసెంబర్ 13న రాబోతోన్న ‘ప్రణయ గోదారి’ని చూసి విజయవంతం చేయండి.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శక, నిర్మాత విఘ్నేశ్
సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్గా, డైలాగ్ కింగ్ సాయి కుమార్ ముఖ్య పాత్రలో రాబోతోన్న చిత్రం 'ప్రణయ గోదారి'. పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో రూపొందిన ‘ప్రణయ గోదారి’ మూవీని పిఎల్‌వి క్రియేషన్స్‌పై పారమళ్ళ లింగయ్య నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 13న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో సోమవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి, హీరో సోహెల్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ప్రణయగోదారి టీం అంతా కలిసి ఓ చిన్నారి గుండెకు సంబంధించిన ఆపరేషన్ కోసం ఆర్థిక విరాళాన్ని అందించింది. అనంతరం..
*సోహెల్ మాట్లాడుతూ..* ‘ఓ చిన్న చిత్రం బయటకు రావాలంటే ఎంత కష్టపడాల్సి ఉంటుందో నాకు తెలుసు. డబ్బులు సంపాదించడానికి ఇండస్ట్రీకి రారు. పేరు కోసం ఇక్కడకు వస్తారు. లక్ వస్తే.. డబ్బులు కూడా వస్తాయి. ఇంట్లో ఉన్న డబ్బులన్నీ పెట్టి సినిమాను తీశాను. నష్టపోయాను. నన్ను ట్రోలింగ్ కూడా చేశారు. హిట్టు కొట్టాలనే ఎవ్వరైనా సినిమాను చేస్తారు. ప్రణయ గోదారి టీంలో అందరూ కొత్త వాళ్లే. వారి కష్టాన్ని గుర్తించి థియేటర్‌కు వెళ్లి సినిమాను చూడండి. విలేజ్ బ్యాక్ డ్రాప్లో చాలా నేచురల్‌గా చేశారు. కొత్త హీరో, దర్శక, నిర్మాతల్ని ఆడియెన్స్ ఎంకరేజ్ చేయాలి. డిసెంబర్ 13న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
*దర్శక, నిర్మాత విఘ్నేశ్ మాట్లాడుతూ..* ‘మా ఈవెంట్‌కు వచ్చిన తీన్మార్ మల్లన్న, రాజ్ కందుకూరి, సోహెల్ గార్లకు థాంక్స్. నేను ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని నిర్మించాను. ఆస్తులన్నీ అమ్ముకున్నా. అప్పులు తెచ్చి మరీ సినిమాను తీశాను. నా అన్న మార్కండేయ కోసం ఈ మూవీని చేశాను. మా అన్న ఈ చిత్రానికి మంచి పాటలు, ఆర్ఆర్ ఇచ్చారు. ప్రసాద్ గారు మంచి విజువల్స్ ఇచ్చారు. చాలా కష్టపడి చిత్రాన్ని అయితే తీశాను. కానీ రిలీజ్ చేయడానికి చాలా కష్టపడ్డాను. మళ్లీ అప్పు చేశాను. సినిమా తీయడం, రిలీజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆ సంగతి నాకు ఇప్పుడు అర్థమైంది. పి.ఆర్.ఓ. సాయి సతీష్ గారు చిన్న చిత్రాలకు దొరికిన అద్భుతమైన వరం. ఆయన వల్లే ఈ చిత్రం ఇక్కడి వరకు వచ్చింది. డిస్ట్రిబ్యూటర్లు కూడా ముందుకు వచ్చి మా సినిమాకు థియేటర్లు ఇస్తామని అన్నారు. మా సినిమా డిసెంబర్ 13న రాబోతోంది. అందరూ వచ్చి చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
*ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ..* ‘ప్రణయ గోదారి టైటిల్ నాకు చాలా నచ్చింది. చాలా పాజిటివ్‌గా అనిపించింది. సినిమాల్లో పెద్దది, చిన్నది అని ఉండదు. పెళ్లి చూపులు చిన్న బడ్జెట్లో చేశా. కానీ దాన్ని పెద్ద హిట్ చేశారు. అందుకే మంచి సినిమా, చెడ్డ సినిమా అని ఉంటంది. ప్రణయ గోదారి మంచి చిత్రం అవుతుంది. విఘ్నేశ్ చాలా మంచి వ్యక్తి. మార్కండేయ గారి సంగీతం బాగుంది. ఈ చిత్రానికి మీడియా సహకారం అందించాలి. డిసెంబర్ 13న రానున్న ఈ మూవీని అందరూ చూడండి’ అని అన్నారు.
*ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..* ‘ప్రణయ గోదారి బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అమ్మ ప్రసవించే సమయంలో ఎలాంటి స్థితిలో ఉంటుందో.. సినిమా రిలీజ్ టైంలో నిర్మాత కూడా అలానే ఉంటాడనిపించింది. చిన్న చిత్రమా? పెద్ద సినిమానా? అన్న తేడా ఎక్కడ పుట్టిందో నాకు తెలీదు. సినిమా అంటే సినిమా అంతే. ఉద్యమ సమయంలో కొన్ని డాక్యుమెంటరీలు నేను కూడా తీశాను. ఈ మూవీ టైటిల్ నాకు చాలా నచ్చింది. ట్రైలర్, సాంగ్స్ నాకు బాగా నచ్చాయి. డిసెంబర్ 13న రాబోతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*హీరోయిన్ ప్రియాంక ప్రసాద్ మాట్లాడుతూ..* ‘మా చిత్ర ప్రమోషన్స్ కోసం వచ్చిన రాజ్ కందుకూరి, సోహెల్‌కు థాంక్స్. ఈ చిత్రంతో నేను తెలుగు ఆడియెన్స్ ముందుకు వస్తున్నాను. నా మీద నమ్మకం పెట్టుకుని నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. డీఓపీ ప్రసాద్ గారు మమ్మల్ని బాగా చూపించారు. మార్కండేయ గారి సంగీతం చాలా బాగా వచ్చింది. సదన్‌తో కలిసి నటించడం ఆనందంగా ఉంది. మా చిత్రం డిసెంబర్ 13న రాబోతోంది. అందరూ ఆశీర్వదించండి’ అని అన్నారు.
*మ్యూజిక్ డైరెక్టర్ మార్కండేయ మాట్లాడుతూ..* ‘ప్రణయ గోదారి ఎంతో విశాలంగా ఉంటుంది. పి ఎల్ విఘ్నేశ్ గారి వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను అని అనుకుంటున్నాను’ అని అన్నారు.
*నటి ఉషా శ్రీ మాట్లాడుతూ..* ‘అందరికీ నమస్కారం. ప్రణయ గోదారిలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. సాయి కుమార్ గారితో మళ్లీ కూతురిగా నటించే ఛాన్స్ వచ్చింది. సదన్, ప్రియాంక అద్భుతంగా నటించారు. డిసెంబర్ 13న మా చిత్రాన్ని చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.