Priyadarshi, known for his strong performances in content-driven films, is back with Premante, a refreshing romantic comedy that takes a witty and heartfelt look at love and marriage. Directed by debutant Navaneeth Sriram, the film stars Anandhi as the female lead, alongside Suma Kanakala in a key role. Produced by Puskur Ram Mohan Rao and Jhanvi Narang under the prestigious Sree Venkateswara Cinemas LLP (SVCLLP) banner, Premante is proudly presented by Rana Daggubati’s Spirit Media. The film also stands as a tribute to the legacy of the late Narayan Das Narang, while Adithya Merugu joins as co-producer. The film’s teaser has been dropped today.
The teaser paints an amusing and heartwarming picture of newly married life — where the fairy-tale romance of forever love quickly collides with the everyday madness of reality. Priyadarshi and Anandhi step into the shoes of a young couple whose picture-perfect marriage dream soon turns into a laugh riot, filled with petty squabbles, playful misunderstandings, and moments that every couple will find relatable.
Just when their domestic drama seems to settle into a routine, enters Suma Kanakala as a police head constable, a character who unexpectedly stirs up more chaos in their already topsy-turvy relationship. Her arrival adds a refreshing twist, infusing the narrative with both humor and curiosity about what role she really plays in their love story.
Director Navaneeth Sriram infuses the film with situational humor and emotional warmth, blending relatable conflicts with sharp writing. The teaser brilliantly captures the contrast between the dreamy expectations of love and the everyday realities of living together, making it instantly connect with today’s audience.
Priyadarshi and Anandhi share endearing chemistry, portraying the innocence, confusion, and evolution of a couple learning to love beyond fantasy. Suma Kanakala’s presence adds gravitas, while Vennela Kishore makes his presence felt.
The technical crew adds immense value to Premante. Cinematographer Vishwanath Reddy, winner of the Gaddar Award for Gaami, brings a vibrant, colorful visual palette that perfectly suits the film’s romantic-comedy tone. Leon James, who recently delivered chartbuster tracks for Dragon, adds rhythm and emotion in equal measure with his lively score. Editor Raghavendra Thirun ensures the narrative flows with engaging pace, while production designer Aravind Mule crafts a lively and relatable world for the characters. The dialogues by Karthik Thupurani and Rajkumar bring humor and heart in equal measure.
With its quirky tagline “Thrill-U Prapthirasthu!” and its vibrant blend of laughter, love, and life, Premante promises a refreshing cinematic experience. The film is set to hit theatres on November 21st.
Cast: Priyadarshi, Anandhi, Suma Kanakala
Technical Crew:
Writer, Director: Navaneeth Sriram
Producers: Puskur Ram Mohan Rao, Jhanvi Narang
Presenters: Rana Daggubati
Banners: SVCLLP and Spirit Media
Co-producer: Adithya Merugu
Cinematography: Vishwanath Reddy
Music Director: Leon James
Editing: Raghavendra Thirun
Dialogues: Karthik Thupurani & Rajkumar
Production Designer: Aravind Mule
Costume Designer: Gouri Naidu
Publicity Designer: Pada Cassette
Music On: Saregama
స్ట్రాంగ్ కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తున్న ప్రియదర్శి రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమంటే తో రాబోతున్నారు. ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. సుమ కనకాల ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్నారు. పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నరంగ్ నిర్మాణంలో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ (SVCLLP) బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పిస్తోంది. దివంగత నారాయణ్ దాస్ నారంగ్ గారికి ట్రిబ్యుట్ గా నిలిచే ఈ చిత్రానికి ఆదిత్య మెరుగు సహ నిర్మాత. ఈ చిత్ర టీజర్‌ను ఈ రోజు లాంచ్ చేశారు.
టీజర్‌లో కొత్త పెళ్లి జంట జీవితంలోని సరదా, ప్రేమ, గిల్లికజ్జాల మేళవింపు హిలేరియస్ గా చూపించారు. పెళ్లి తర్వాత కలల ప్రపంచంలో ఊహించిన ప్రేమకథ, వాస్తవ జీవితంలోని చిన్న చిన్న సమస్యలతో ఎలా మలుపులు తిరుగుతుందో ఆకట్టుకునేలా ప్రజెంట్ చేశారు. ప్రియదర్శి, ఆనంది జంటగా కనిపించి, కొత్త దంపతుల జీవితంలో జరిగే సన్నివేశాలని అలరించేలా చూపించారు. సుమ కనకాల పోలీస్ హెడ్ కానిస్టేబుల్‌గా ఎంట్రీ ఇవ్వడంతో కథలో కొత్త మలుపు వస్తుంది. ఆమె పాత్ర హ్యుమర్ ని మరింత ఎలివేట్ చేసింది.
డైరెక్టర్ నవనీత్ శ్రీరామ్ ఈ చిత్రాన్ని సిట్యువేషనల్ హ్యుమర్, మనసుని హత్తుకునే ఎమోషన్స్ తో అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ప్రేమంటే అనే టైటిల్‌కు తగ్గట్లుగానే, ప్రేమలోని కలలు, వాస్తవాల మధ్య తేడాను చూపిస్తూ టీజర్ ప్రేక్షకులను ఇన్స్టంట్ గా కనెక్ట్ అయ్యింది.
ప్రియదర్శి–ఆనంది జంట మధ్య కెమిస్ట్రీ సహజంగా, చూడముచ్చటగా వుంది. సుమ కనకాల ప్రజెన్స్ కట్టిపడేసింది. వెన్నెల కిషోర్ తన సిగ్నేచర్ టచ్‌తో నవ్వులు పంచారు.
సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి (గామీ చిత్రానికి గద్దర్ అవార్డు గ్రహీత) ఈ చిత్రానికి బ్యూటీఫుల్ విజువల్స్ అందించారు. “డ్రాగన్”కి సంగీతం అందించిన లియాన్ జేమ్స్ ఎనర్జిటిక్ బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఎడిటర్ రాఘవేంద్ర తిరున్, ప్రొడక్షన్ డిజైనర్ అరవింద్ మూలే, డైలాగ్ రైటర్స్ కార్తిక్ తుపురాణి, రాజ్‌కుమార్ అందరూ తమ తమ విభాగాల్లో అద్భుతమైన పనితీరు కనబరిచారు.
“Thrill-U Prapthirasthu!” అనే ఫన్ ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ప్రేమంటే నవ్వులు, ప్రేమ, జీవితం అన్నింటినీ కలిపిన హిలేరియస్ చిత్రం కానుంది. ఈ చిత్రం నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
నటీనటులు: ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: నవనీత్ శ్రీరామ్
నిర్మాతలు: పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నారంగ్
సమర్పణ: రానా దగ్గుబాటి
బ్యానర్లు: SVCLLP, స్పిరిట్ మీడియా
సహ నిర్మాత: ఆదిత్య మేరుగు
సినిమాటోగ్రఫీ: విశ్వనాథ్ రెడ్డి
సంగీతం: లియోన్ జేమ్స్
ఎడిటింగ్: రాఘవేంద్ర తిరున్
డైలాగ్స్: కార్తీక్ తుపురాణి & రాజ్‌కుమార్
ప్రొడక్షన్ డిజైనర్: అరవింద్ మూలే
కాస్ట్యూమ్ డిజైనర్: గౌరీ నాయుడు