pizza

Biggest film 'Pushpa 2: The Rule': Thank You India meet held as film enters Rs 1000 Cr club; Icon Star Allu Arjun says it's India's victory
'పుష్ప-2' సక్సెస్‌ క్రెడిట్‌ మొత్తం ఇండియన్‌ బాక్సాఫీస్‌ను రూల్‌ చేస్తున్న దర్శకుడు బండ్రెడ్డి సుకుమార్‌దే : థాంక్యూ ఇండియా ప్రెస్‌మీట్‌లో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌

You are at idlebrain.com > news today >

12 December 2024
Hyderabad

The 'Thank You India' Press Meet was held today by the team of India's biggest film, 'Pushpa 2: The Rule', to celebrate the movie entering the coveted Rs 1000 Cr club. The film's all-time record of being the fastest 1000 Cr film has stunned the nation.

Speaking on the occasion, AA Films' Anil Thadani said, "For these benchmarks, I would like to thank the audience worldwide. I am so glad to be a part of this historic film." He ended the speech by expressing his wish for the film to hit the Rs 2000 Cr mark.

Producer Naveen Yerneni thanked the audience and hoped that the film reaches the Rs 2000 Cr mark. "Sukumar sir works the hardest. He has worked non-stop. He is like a magician," the producer said.

Producer Y Ravi Shankar described the feat of the movie as the rarest. "Exhibitors and distributors are overwhelmed. Financial success makes us happy but the real happiness is when our stakeholders are overjoyed by the success. Anil Thadani has done a fabulous job in releasing our film in northern India and overseas. Allu Arjun sir's hard work is unparalleled. The climax was shot for 32 days. Every day, he would be hung onto ropes. We would have physiotherapists on set to ensure nothing goes wrong," he added.

Icon Star Allu Arjun began his speech by thanking the entire nation. "This is not just love but wild love," Bunny said. He thanked the film industries across the country for accommodating his film and extending their "love and support" from both the country and in other countries. "I would also like to thank every state government and police departments from all states. Without their help, a release of this scale wouldn't have been possible. This is wild love that India has shown. It's our country's victory, not just mine. It shows the beauty of our country that people from different states have showered their love on our film."

"Credit goes to everybody, but if there is one person who deserves my special thanks, it is Sukumar garu, my director. I owe this entire success to you," Allu Arjun added.

When asked about his favourite sequence from 'Pushpa 2', Allu Arjun said, "I am saying this as an Indian. Everytime I say 'Jukega nahi', it's my favourite moment. The film is not just about my character. It's about the attitude of every Indian."

"Records are meant to be broken. It is nice to be in this place for now. I would like to maintain this status for the next few months. By next Summer, perhaps, some or the other film would be breaking Pushpa 2's records. That's what growth is all about," Allu Arjun said.

'పుష్ప-2' సక్సెస్‌ క్రెడిట్‌ మొత్తం ఇండియన్‌ బాక్సాఫీస్‌ను రూల్‌ చేస్తున్న దర్శకుడు బండ్రెడ్డి సుకుమార్‌దే : థాంక్యూ ఇండియా ప్రెస్‌మీట్‌లో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ల పుష్ప-2 ది రూల్‌.. చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌పై సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేస్తోంది. ఈ సన్సేషన్‌ కాంబినేషన్‌లో అత్యున్నత నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్‌ సుకుమార్‌ రైటింగ్‌ సంస్థతో కలిసి ఈ ఇండియన్‌ బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ సినిమాను నిర్మించింది. విడుదలకు ముందే ప్రీరిలీజ్‌ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు ప్రీమియర్‌స్‌ నుంచే సన్సేషనల్‌ బ్లాకబస్టర్‌ అందుకుంది. అల్లు అర్జున్‌ నట విశ్వరూపంకు, సుకుమార్‌ వరల్డ్‌ క్లాస్‌ టేకింగ్‌.. ప్రపంచ సినీ ప్రేమికులు ఫీదా అయిపోయారు. ముఖ్యంగా ఇండియాలో ఈ చిత్రం సృష్టించిన రికార్డుల పరంపరకు ఆకాశమే హద్దుగా ఉంది. సినిమా తొలి రోజు నుంచే మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు.. నాలుగవ రోజు.. ఐదవ రోజు.. ఆరవ రోజు, ఏడవ రోజు వసూళ్లలో వరుసగా ఇండియా ఆల్‌టైమ్‌ రికార్డులు సృష్టించిన ఈ చిత్రం తాజాగా ఆరు రోజుల్లో రూ.1000 కోట్లు వసూలు ఇండియన్‌ సినిమా చరిత్రలోనే అత్యంత వేగవంతగా రూ. 1000 కోట్లు కలెక్ట్‌ చేసిన తొలి చిత్రంగా సరికొత్త రికార్డును నెలకొల్పింది. తాజాగా ఈ చిత్రం థాంక్యూ ఇండియా ప్రెస్‌మీట్‌ గురువారం ఢీల్లీలో జరిగింది. ఈ సందర్భంగా కథానాయకుడు అల్లు అర్జున్‌ మాట్లాడుతూ '' నాపై ఇంత ప్రేమ చూపిస్తున్న భారతీయులందరికి నా కృతజ్ఞతలు. ముఖ్యంగా అన్ని రాష్ట్రాల ప్రజలకు నా థాంక్స్‌. భారతీయులందరూ ఈ సినిమాను ఆదరిస్తున్నారు. గ్లోబల్‌గా ఉన్న సినీ ప్రేమికులందరూ ఇండియా సినిమాను ఇంతగా ఆదరిస్తున్నందుకు వారికి నా ప్రత్యే క ధన్యవాదాలు. ఇది నా విక్టరీ కాదు. ఇండియా విక్టరీ. ఒక సినిమాను అన్ని రాష్ట్రాల ప్రజలు సెలబ్రేట్‌ చేశాయి. ఇదనే నా దేశం గొప్పతనం. ఇక ఈ సినిమాను ఆదరిస్తున్న అన్నిరాష్ట్రాల సినీ పరిశ్రమలకు, అక్కడికి సినీ ప్రముఖులకు, ప్రభుత్వాలకు, పోలీసులకు, మీడియా వాళ్లకు నా థాంక్స్‌. ముఖ్యంగా పుష్ప-2 సినిమాను మరింత ప్రేమతో, అత్యధిక వసూళ్లతో ఆదరిస్తున్న హిందీ సినీ ప్రేక్షకులకు నా మనస్పూర్తిగా థాంక్స్‌, ఇక ఈ సినిమా సక్సెస్‌కు ప్రధాన కారణం.. ఇండియన్‌ బాక్సాఫీస్‌ను రూల్‌ చేస్తున్న దర్శకుడు బండ్రెడ్డి సుకుమార్‌దే. ఆయన విజన్‌, ఆయన కష్టానికి ప్రతిఫలం ఈ చిత్రం. ఇక ఈ చిత్రం రూ.1000 కోట్లు కలెక్ట్‌ చేయడం, భవిష్యత్‌లో మరింత వసూళ్లు సాధించడం ఒకెత్తు అయితే నెంబర్స్‌ అనేవి వాళ్ల ప్రేమకు నిదర్శనం. అయితే ఈ నెంబర్స్‌ టెంపరరీ. ఎందుకంటే భవిష్యత్‌లో మరో సూపర్‌హిట్‌ సినిమా ఈ నెంబర్స్‌ను క్రాస్‌ చేస్తుంది. కానీ ఆడియన్స్‌ ఇచ్చే లవ్‌ మాత్రం శాశ్వతం. వాళ్లు నా పై చూపిస్తున్న వైల్డ్‌ ప్రేమకు జీవితాంతం బుణపడి ఉంటాను' అన్నారు. నిర్మాత రవిశంకర్‌ మాట్లాడుతూ '' అల్లు అర్జున్‌ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. ముఖ్యంగా పతాక సన్నివేశాల కోసం 32 రోజులు రోప్‌ ధరించి ఉండేవాడు. ఫిజియో థెరపిస్ట్‌ కూడా లోకేషన్స్‌లో ఉండేవాడు. ఈ రోజు ఆయన హార్డ్‌ వర్క్‌కు తగిన ప్రతిఫలం లభిస్తుంది' అన్నారు. హిందీలో పుష్ప విడుదలైన దగ్గరి నుంచి ఇప్పటి వరకు హాస్‌ఫుల్‌ రన్‌తో ప్రదర్శిస్తున్నామని ఎగ్జిబిటర్స్‌ నిమిత్‌, సంజయ్‌, శశాంక్‌ రాజహెడ తెలిపారు. తన ఇరవై ఐదు సంవత్సరాల కెరీర్‌లో ఇలాంటి వసూళ్లు చూడలేదని, ఇంతగా కంటిన్యూ హౌస్‌ఫుల్స్‌తో రన్‌ అయిన సినిమా లేదని యూపీ ఎగ్జిబిటర్‌ అశుతోష్‌ అగర్వాల్‌ తెలిపారు. ఈ ప్రెస్‌మీట్‌లో నిర్మాత నవీన్‌ ఎర్నేని, ఇతర పంపిణీదారులు, థియేటర్‌ యజమానులు పాల్గొన్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved