pizza

Potluri Ravi extends support for a student’s higher education
విద్యార్థిని ఉన్నత చదువుకు పొట్లూరి రవి సహాయం...

You are at idlebrain.com > news today >

16 August 2025
Hyderabad

It is well known that Potluri Ravi, Board of Director of the Telugu Association of North America (TANA), has been supporting the development of Kappatralla village in Kurnool district, promoting women’s self-employment, and helping students pursue education.

Recently, he provided financial assistance of ₹1.75 lakh to Maimoon, a student from Kappatralla, to pursue her Intermediate education in a private residential school. With Ravi’s encouragement, she not only excelled in Intermediate but also secured an EAMCET rank of 6,947, qualifying for admission into a Veterinary College.

Expressing happiness over her achievement, Ravi felicitated Maimoon at a program held in Kurnool on Saturday, 16th August.

Noticing her talent when she topped her 10th class in the village, Ravi came forward to support her financially for her Intermediate studies. Speaking on the occasion, Maimoon said Ravi’s support was unforgettable and thanked him for encouraging financially disadvantaged students like her.

Ravi, in turn, reiterated his commitment to continue supporting meritorious students and contributing to the overall development of Kappatralla village.

The event was attended by Jagadish Reddy Anumula, TTD Board member Mallela Rajasekhar, Muppa Rajasekhar, Agricultural Officer Akbar, and others.

విద్యార్థిని ఉన్నత చదువుకు పొట్లూరి రవి సహాయం...

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బోర్డ్‌ ఆఫ్ డైరెక్టర్ పొట్లూరి రవి కర్నూలు జిల్లాలోని కప్పట్రాళ్ళ గ్రామ అభివృద్ధికి, మహిళల స్వయం ఉపాధికి, విద్యార్థుల చదువుకు సహాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కప్పట్రాళ్ళ గ్రామానికి చెందిన విద్యార్థిని మైమూన్‌ ఇంటర్మీడియెట్‌ విద్యాభ్యాసానికి రవి పొట్లూరి 1.75 లక్షలు సహాయం అందించి ఆమెను ప్రైవేటు రెసిడెన్షియల్ స్కూల్లో చదివించారు. రవి పొట్లూరి ప్రోత్సాహంతో ఆమె నేడు ఇంటర్మీడియెట్‌ లో ప్రతిభ ప్రదర్శించడంతోపాటు ప్రవేశపరీక్షలో 6,947 ర్యాంక్‌ సాధించి వెటర్నరీ కాలేజీలో సీటుకు అర్హత సాధించింది. చదువులో రాణించడం పట్ల రవి పొట్లూరి సంతోషం వ్యక్తం చేస్తూ ఆమెను శనివారం (16 ఆగస్టు) నాడు కర్నూల్ లో జరిగిన కార్యక్రమంలో అభినందించారు.

కప్పట్రాళ్ళ గ్రామంలోనే పదవతరగతిలో టాపర్‌ గా వచ్చిన ఆమె ప్రతిభను గమనించి రవి పొట్లూరి ఇంటర్మీడియెట్‌ చదువుకు ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా మైమూన్‌ మాట్లాడుతూ, రవి పొట్లూరి గారి సహాయం మరువలేనిదని తనలాంటి ఆర్ధికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆయన ఇస్తున్న ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతిభకల విద్యార్థులను ప్రోత్సహించడంతోపాటు కప్పట్రాళ్ళ గ్రామ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తూనే ఉంటానని ఈ సందర్భంగా రవి పొట్లూరి చెప్పారు. ఈ కార్యక్రమంలో జగదీష్ రెడ్డి అనుముల, టిటిడి బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్, ముప్పా రాజశేఖర్, అగ్రికల్చరల్ ఆఫీసర్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved