pizza

Naalo Edho Lyrical song from Youthful Family Entertainer "Santhana Prapthirasthu" launched at Radio Mirchi
రేడియో మిర్చిలో యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "సంతాన ప్రాప్తిరస్తు" మూవీ నుంచి 'నాలో ఏదో..' లిరికల్ సాంగ్ లాంఛ్

You are at idlebrain.com > news today >

26 March 2025
Hyderabad

The teaser for the youth-filled family entertainer Santhana Prapthirasthu, starring Vikranth and Chandini Chowdary, has already garnered a huge response. Now, the movie’s music promotions have begun in grand style. Today, the lyrical song "Naalo Edho" from the movie was launched on Radio Mirchi. Music director Sunil Kashyap composed a beautiful tune for "Naalo Edho", while Sreejo penned the catchy lyrics. Singers Dinker Kalvala and Aditi Bhavaraju brilliantly sung this melody.

The song "Naalo Edho" captures the essence of the hero and heroine’s love journey, featuring Vikranth and Chandini Chowdary. The launch event of the song featured hero Vikranth, producer Madhura Sreedhar Reddy, director Sanjeev Reddy, lyricist Sreejo, and singer Aditi Bhavaraju.

On this occasion, lyricist Sreejo shared, "The song 'Naalo Edho' portrays the love journey and emotions of the hero and heroine. During the making of this film, both our director and producers paid special attention to the lyrics. They emphasized that the song’s lyrics should be beautiful and concise. Sunil Kashyap has composed a wonderful tune for 'Naalo Edho'. I hope you all will like the song and that it becomes a chartbuster."

Singer Aditi Bhavaraju expressed her joy, saying, "It was a pleasure to sing 'Naalo Edho.' Music lovers listen to various kinds of songs, and I believe that anyone who hears this song will enjoy it. We are confident this song will become a big hit."

Hero Vikranth shared his experience, saying, "We enjoyed working on Santhana Prapthirasthu immensely. Along with our producer Sreedhar Garu, Hari Prasad Garu, director Sanjeev, and our entire team, we worked on the movie as one big family. The song 'Naalo Edho' is beautiful. Sunil Kashyap has composed a fantastic tune for it, and I’m sure you will all enjoy it."

Producer Madhura Sreedhar Reddy said, "'Santhana Praptirastu' is a contemporary film, and there are many special things about the song 'Naalo Edho'. Sunil Kashyap has given us many memorable songs. He composed 'Ninnala Lede Monnala Lede' for It’s My Love Story, 'Ninnala Lede' for ABCD, and the song 'Neeve' written by Sreejo. The combination of Sunil and Sreejo has once again created magic with 'Naalo Edhp'. We strongly believe that this song will make it to the top ten charts, and you will all love it."

Director Sanjeev Reddy mentioned, "The huge response to the teaser of Santhana Prapthirasthu is due to the excellent promotion by Radio Mirchi, and I thank them for it. The song 'Naalo Edho' depicts the love journey of the hero and heroine, and Sunil Kashyap has composed it beautifully. Music lovers will remember this song forever. We have made Santhana Prapthirasthu as a youthful family entertainer, highlighting a contemporary issue in today’s society."

The movie Santhana Prapthirasthu is being produced by Madhura Sreedhar Reddy and Nirvi Hariprasad Reddy under the banners of Madhura Entertainment and Nirvi Arts. The movie is directed by Sanjeev Reddy, with Sheikh Dawood Ji writing the screenplay. Santhana Prapthirasthu, a youthful family entertainer, is set for a grand theatrical release soon.

Cast: Vikranth, Chandini Chowdary, Vennela Kishore, Tharun Bhascker, Abhinav Gomatam, Muralidhar Goud, Sri Lakshmi, Harshavardhan, Bindu Chandramouli, Jeevan Kumar, Satya Krishna, Thagubothu Ramesh, Abhay Betiganti, Kiriti, Anil Geela, Saddam, and others.

Crew:
Director: Sanjeev Reddy
Producers: Madhura Sreedhar Reddy, Nirvi Hariprasad Reddy
Story, Screenplay: Sanjeev Reddy, Sheik Dawood G
Music Director: Sunil Kashyap
Executive Producer: A. Madhusudan Reddy
Cinematography: Mahi Reddy Pandugula
Dialogues: Kalyan Raghav
Editor: SaiKrishna Ganala
Choreographer: Laxman Kalahasthi
Production Designer: Sivakumar Maccha
Costume Designers: Aswat Bhairi, K. Pratibha Reddy
Publicity Design: Mayabazar
Digital: Housefull Digital

రేడియో మిర్చిలో యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "సంతాన ప్రాప్తిరస్తు" మూవీ నుంచి 'నాలో ఏదో..' లిరికల్ సాంగ్ లాంఛ్

విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ "సంతాన ప్రాప్తిరస్తు" టీజర్ ఇప్పటికే హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుండగా... తాజాగా ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ గ్రాండ్ గా బిగిన్ అయ్యాయి. ఈ రోజు ఈ సినిమా నుంచి 'నాలో ఏదో..' లిరికల్ సాంగ్ ను రేడియో మిర్చిలో లాంఛ్ చేశారు. 'నాలో ఏదో..' పాటకు మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ బ్యూటిఫుల్ ట్యూన్ ఇవ్వగా.. శ్రీజో క్యాచీ లిరిక్స్ అందించారు. సింగర్స్ దినకర్ కల్వల, అదితి భావరాజు ఆకట్టుకునేలా పాడారు. 'నాలో ఏదో..' పాట ఎలా ఉందో చూస్తే - ' నాలో ఏదో మొదలైందని, నీతో చెలిమే రుజువైందని, కనులే చెబితే మనసే వినదా, నిజమే అనదా...' అంటూ సాగుతుందీ పాట. హీరో హీరోయిన్స్ విక్రాంత్, చాందినీ చౌదరిపై లవ్ సాంగ్ గా ఈ పాటను చిత్రీకరించారు.

రేడియో మిర్చిలో జరిగిన 'నాలో ఏదో..' సాంగ్ లాంఛ్ కార్యక్రమంలో హీరో విక్రాంత్, ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ రెడ్డి, డైరెక్టర్ సంజీవ్ రెడ్డి, లిరిసిస్ట్ శ్రీజో, సింగర్ అదితి భావరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా

లిరిసిస్ట్ శ్రీజో మాట్లాడుతూ - 'నాలో ఏదో..' సాంగ్ హీరో హీరోయిన్స్ లవ్ జర్నీని, వాళ్ల ఎమోషన్స్ ను చూపిస్తుంది. ఈ సినిమా చేసేప్పుడే మా డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ లిరిక్స్ గురించి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. పాటలోని సాహిత్యం అందంగా, క్లుప్తంగా ఉండాలని చెప్పారు. 'నాలో ఏదో..' సాంగ్ కు సునీల్ కశ్యప్ మంచి ట్యూన్ ఇచ్చారు. ఈ పాట మీ అందరిని ఆదరణ పొంది ఛాట్ బస్టర్ అవుతుందని ఆశిస్తున్నా. అన్నారు

సింగర్ అదితి భావరాజు మాట్లాడుతూ -'నాలో ఏదో..' సాంగ్ పాడటం హ్యాపీగా అనిపించింది. మ్యూజిక్ లవర్స్ రకరకాల పాటలు వింటుంటారు. అలా ఏ తరహా పాటలు వినేవారికైనా 'నాలో ఏదో..' సాంగ్ నచ్చుతుంది. ఈ పాట తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాం. అన్నారు.

హీరో విక్రాంత్ మాట్లాడుతూ - సంతాన ప్రాప్తిరస్తు సినిమాకు పనిచేయడాన్ని చాలా ఎంజాయ్ చేశాం. మా ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు, హరి ప్రసాద్ గారు, డైరెక్టర్ సంజీవ్ తో పాటు మా టీమ్ అంతా ఒక ఫ్యామిలీలా మూవీకి వర్క్ చేశాం. 'నాలో ఏదో..' సాంగ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ పాటకు సునీల్ కశ్యప్ ఛాట్ బస్టర్ ట్యూన్ ఇచ్చారు. మీరంతా ఈ పాటను ఎంజాయ్ చేస్తారు. అన్నారు.

నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ - సంతాన ప్రాప్తిరస్తు ఒక కాంటెంపరీ ఫిల్మ్. 'నాలో ఏదో..' సాంగ్ గురించి చెప్పాలంటే చాలా విశేషాలు ఉన్నాయి. మా సంస్థకు సునీల్ కశ్యప్ ఎన్నో గుర్తుండిపోయే పాటలు ఇచ్చారు. ఇట్స్ మై లవ్ స్టోరీ మూవీలో నిన్నలా లేదే మొన్నలా లేదే సాంగ్, అలాగే ఏబీసీడీ మూవీలో అదితీ మెల్లమెల్ల మెల్లగా సాంగ్, శ్రీజో రాసిన నీవే ..పాట రాశారు. ఇలా వీళ్ల కాంబినేషన్ లో వచ్చిన పాటే 'నాలో ఏదో..'. ఈ పాట టాప్ టెన్ ఛాట్ బస్టర్స్ లో ఉంటుందని స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాం. మీ అందరికీ ఈ పాట తప్పకుండా నచ్చుతుంది. అన్నారు.

డైరెక్టర్ సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ - సంతాన ప్రాప్తిరస్తు సినిమా టీజర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందంటే దానికి రేడియో మిర్చి చేసిన మంచి ప్రమోషన్ కారణం. అందుకు రేడియో మిర్చికి థ్యాంక్స్ చెబుతున్నా. 'నాలో ఏదో..' సాంగ్ హీరో హీరోయిన్స్ లవ్ జర్నీని చూపిస్తుంది. ఈ పాటను సునీల్ కశ్యప్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. మ్యూజిక్ లవర్స్ కు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఈ పాట ఉంటుంది. ఇవాళ్టి సొసైటీలోని ఒక కాంటెంపరరీ ఇష్యూను చూపిస్తూ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా సంతాన ప్రాప్తిరస్తు సినిమాను రూపొందించాం. అన్నారు.

"సంతాన ప్రాప్తిరస్తు" సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

నటీనటులు - విక్రాంత్, చాందినీ చౌదరి, వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, శ్రీ లక్ష్మి, హర్షవర్థన్, బిందు చంద్రమౌళి, జీవన్ కుమార్, సత్య కృష్ణ, తాగుబోతు రమేష్, అభయ్ బేతిగంటి, కిరీటి, అనీల్ గీల, సద్దాం తదితరులు

టెక్నికల్ టీమ్

డైరెక్టర్ - సంజీవ్ రెడ్డి
ప్రొడ్యూసర్స్ - మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి
స్టోరీ, స్క్రీన్ ప్లే - సంజీవ్ రెడ్డి, షేక్ దావూద్ జి
మ్యూజిక్ డైరెక్టర్ - సునీల్ కశ్యప్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఎ మధుసూదన్ రెడ్డి
సినిమాటోగ్రఫీ -మహి రెడ్డి పండుగుల
డైలాగ్స్ - కల్యాణ్ రాఘవ్
కొరియోగ్రాఫర్ - లక్ష్మణ్ కాళహస్తి
కాస్ట్యూమ్ డిజైనర్స్ - అశ్వత్ భైరి, కె ప్రతిభ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్ - శివకుమార్ మచ్చ
పబ్లిసిటీ డిజైన్ - మాయాబజార్ డిజిటల్ - హౌస్ ఫుల్ డిజిటల్


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved