pizza

The audience will see a new Kajal in "Satyabhama" - Movie Presenter, Screenplay Writer Sashikiran Tikka
“సత్యభామ” సినిమాలో కొత్త కాజల్ ను చూస్తారు - మూవీ ప్రెజెంటర్, స్క్రీన్ ప్లే రైటర్ శశికిరణ్ తిక్క

You are at idlebrain.com > news today >

6 June 2024
Hyderabad

Sashikiran Tikka gained recognition as a talented director with the films 'Goodachari' and 'Major'. He worked as a presenter and screenplay writer for the movie "Satyabhama". 'Queen of Masses' Kajal Aggarwal is the heroine, and the film is produced by the Aurum Arts banner. Srinivasa Rao Takkalapelly and Bobby Tikka served as producers. Suman Chikkala directed the movie "Satyabhama". Sashikiran Tikka shared the movie's highlights on the eve of its grand theatrical release tomorrow.

- We premiered the movie "Satyabhama" yesterday, and there was a good response from those who saw it. The journey of this movie started with the story narrated by our friends Ramesh and Prashanth, who are in the UK. Director Suman and I liked that point and developed it. After finishing the major movie, we wanted to take it on the sets. When we told Kajal the story of "Satyabhama," she immediately liked it. Thus, the project began.

- I have projects to do as a director and am currently preparing my scripts. That is why I did not direct the movie "Satyabhama." Moreover, we want to make more movies under our Aurum Arts banner. But I need experience as a producer. Along with directing, production, and editing are also to be done.

- As a movie presenter, I saw another aspect of moviemaking. As a director, I have a reputation for getting the production cast as I say. Now we know what the experiences of the producer of "Satyabhama" are like. Overall, I learned a lot about the production side and gained a wide-angle perspective on filmmaking. Directing is like a mother's work, but being a producer is like a father's responsibility.

- Kajal is very active. I have never seen her tired. During the shooting, her energy gave us all a lot of enthusiasm. Kajal's action sequences in this movie are very special and will entertain the audience. Especially, the emotional aspect connects well with the audience. Even though there are many police stories, emotionally, "Satyabhama" is special. Today's audiences are going to experience fresh storytelling.

- Director Suman Chikkala, Sricharan Pakala, and I are all friends. We make movies together. We also worked as a team for the movie "Satyabhama". Suman's work as a director is impressive. Our movie will be an investigative thriller, but instead of just catching the case with clues like regular investigative thrillers, the emotion is well worked out in the story.

- First, we received a good response to the "Glimpses of Satyabhama" that we released. Since then, we have made some changes in the scenes. Heroic moves will be in this movie, but they come naturally as part of the story's journey rather than being purposely placed. Kajal has acted in sixty films. The audience will see a new Kajal in "Satyabhama".

- Apart from Kajal, Naveen Chandra, Prakash Raj, Nagineedu, Harshvardhan, and Ravi Varma played key roles in the movie "Satyabhama". Apart from them, some new actors were also involved. The release of this movie will give them a good name. This movie is a team effort; the music director, editor, director, producers, and I have all worked together. Mythri Movie Makers are releasing our movie in Nizam. Dheeraj Mogilineni releasing it in AP. Saregama is releasing it overseas. Overall, including OTT, our film got a good response from the trade.

- Nandamuri Balakrishna garu participated in our movie trailer launch. I am happy that he won with a good majority in the recent AP election results. Sesh and I had earlier thought that "Goodachari 2" should be directed by someone else. Mahesh Babu has acted as presenter in the movie "Major." We want to show "Satyabhama" to him.

- I will soon announce my next project as a director. I will do movies in multiple genres.

“సత్యభామ” సినిమాలో కొత్త కాజల్ ను చూస్తారు - మూవీ ప్రెజెంటర్, స్క్రీన్ ప్లే రైటర్ శశికిరణ్ తిక్క

'గూఢచారి', 'మేజర్' చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు శశికిరణ్ తిక్క. ఆయన ప్రెజెంటర్, స్క్రీన్ ప్లే రైటర్ గా వర్క్ చేసిన మూవీ “సత్యభామ”. 'క్వీన్ ఆఫ్ మాసెస్' కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా అవురమ్ ఆర్ట్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించింది. శ్రీనివాసరావు తక్కలపల్లి, బాబీ తిక్క ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించారు. “సత్యభామ” సినిమాకు సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. రేపు ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న నేపథ్యంలో మూవీ హైలైట్స్ తెలిపారు చిత్ర సమర్పకులు, స్క్రీన్ ప్లే రైటర్ శశికిరణ్ తిక్క.

- నిన్న “సత్యభామ” సినిమా ప్రీమియర్స్ వేశాం. చూసిన వాళ్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూకేలో ఉండే మా మిత్రులు రమేశ్, ప్రశాంత్ చెప్పిన కథతో ఈ సినిమా జర్నీ మొదలైంది. ఆ పాయింట్ నచ్చి నేను, దర్శకుడు సుమన్ డెవలప్ చేశాం. అప్పుడు మేజర్ సినిమా జరుగుతోంది. అది పూర్తయ్యాక సెట్స్ మీదకు తీసుకెళ్లాలని అనుకున్నాం. కాజల్ గారికి “సత్యభామ” కథ చెప్తే ఆమెకు వెంటనే నచ్చింది. అలా ప్రాజెక్ట్ బిగిన్ అయ్యింది.

- నాకు దర్శకుడిగా చేయాల్సిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నా స్క్రిప్ట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అందుకే “సత్యభామ” సినిమాకు దర్శకత్వం వహించలేదు. పైగా మా అవురమ్ ఆర్ట్స్ పై మరిన్ని మూవీస్ చేయాలనుకుంటున్నాం. కాను ప్రొడ్యూసర్ గా అనుభవం కావాలి. డైరెక్షన్ ప్రొడక్షన్ తో పాటు ఎడిటింగ్ కూడా చేయాలని ఉంది.

- మూవీ ప్రెజెంటర్ గా సినిమా మేకింగ్ లో మరో కోణాన్ని చూశాను. దర్శకుడిగా నేను ప్రొడక్షన్ కాస్ట్ ను చెప్పినంతలో చేస్తాననే పేరుంది. ఇప్పుడు “సత్యభామ” నిర్మాత అనుభవాలు ఎలా ఉంటాయో తెలిసింది. ఓవరాల్ గా ప్రొడక్షన్ సైడ్ చాలా విషయాలు నేర్చుకున్నాను. సినిమా మేకింగ్ ను వైడ్ యాంగిల్ నుంచి తెలుసుకున్నా. దర్శకత్వం అమ్మలాంటి పని అయితే నిర్మాతగా ఉండటం నాన్న లాంటి బాధ్యత.

- కాజల్ గారు వెరీ యాక్టివ్. ఆమె అలసిపోయి ఉండటం ఎప్పుడూ చూడలేదు. షూటింగ్ టైమ్ లో ఆమె ఎనర్జీ మా అందరికీ ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చేది. ఈ సినిమాలో కాజల్ గారు చేసిన యాక్షన్ సీక్వెన్సులు చాలా స్పెషల్. అవి ప్రేక్షకులను అలరిస్తాయి. ముఖ్యంగా ఎమోషన్ ఈ మూవీలో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. ఎన్నో పోలీస్ స్టోరీస్ వచ్చినా ఎమోషనల్ గా “సత్యభామ” స్పెషల్ గా ఉంటుంది. ఈ రోజు ఆడియెన్స్ కు తగినట్లు ఫ్రెష్ స్టోరీ టెల్లింగ్ తో ఉండబోతోంది.

- దర్శకుడు సుమన్ చిక్కాల, నేను, శ్రీచరణ్ పాకాల మేమంతా ఫ్రెండ్స్. కలిసే మూవీస్ చేస్తుంటాం. “సత్యభామ” సినిమాకు కూడా అలాగే టీమ్ వర్క్ చేశాం. దర్శకుడిగా సుమన్ వర్క్ ఆకట్టుకుంటుంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా మా మూవీ ఉంటుంది. అయితే రెగ్యులర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ లా కేవలం కేసును క్లూలలతో పట్టుకోవడం కాకుండా కథలో ఎమోషన్ బాగా వర్కవుట్ అయ్యింది.

- ఫస్ట్ మేము రిలీజ్ చేసిన సత్యభామ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుంచి సీన్స్ లో కొన్ని ఛేంజెస్ చేశాం. హీరోయిక్ మూవ్ మెంట్స్ ఈ సినిమాలో ఉంటాయి. అయితే అవి కావాలని పెట్టినట్లు కాకుండా సహజంగా కథ జర్నీలో భాగంగా వస్తుంటాయి. కాజల్ అరవై సినిమాల్లో నటించింది. సత్యభామలో కొత్త కాజల్ ను ప్రేక్షకులు చూస్తారు.

- “సత్యభామ” మూవీలో కాజల్ గారు కాకుండా నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్థన్, రవి వర్మ ఇలా మంచి కాస్టింగ్ కీ రోల్స్ చేశారు. వీళ్లు కాకుండా కొందరు కొత్త వాళ్లు నటించారు. వాళ్లకు ఈ సినిమా రిలీజ్ అయ్యాకు మంచి పేరొస్తుంది. ఈ సినిమా టీమ్ వర్క్ అని చెప్పాలి, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్, డైరెక్టర్, నేను, ప్రొడ్యూసర్స్ మేమంతా కలిసే పనిచేస్తూ వచ్చాం. మా మూవీని నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు రిలీజ్ చేస్తున్నారు. ఏపీలో ధీరజ్ మొగిలినేని రిలీజ్ చేస్తున్నారు. ఓవర్సీస్ లో సారిగమ రిలీజ్ చేస్తోంది. ఓటీటీ సహా ఓవరాల్ గా మా సినిమాకు ట్రేడ్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

- మా మూవీ ట్రైలర్ లాంఛ్ లో బాలకృష్ణ గారు పాల్గొన్నారు. రీసెంట్ గా ఏపీ ఎలక్షన్ రిజల్ట్స్ లో ఆయన మంచి మెజార్టీతో గెలుపొందడం సంతోషంగా ఉంది. గూఢచారి 2 సినిమాకు వేరేవాళ్లు దర్శకత్వం చేయాలని నేను, శేష్ ముందే అనుకున్నాం. మహేశ్ బాబు గారు మేజర్ సినిమాలో పార్ట్ అయ్యారు. ఆయనకు సత్యభామ సినిమా చూపించాలని అనుకుంటున్నాం.

- దర్శకుడిగా నా నెక్ట్ ప్రాజెక్ట్ ను త్వరలో అనౌన్స్ చేస్తాను. బ్యాక్ టు బ్యాక్ థ్రిల్లర్స్ చేస్తున్నారనే ప్రశ్న నెక్ట్ టైమ్ మనం కలిసినప్పుడు మీరు అడగరు అని భావిస్తున్నా. మల్టీపుల్ జానర్ మూవీస్ చేస్తాను.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved