Introducing Shivakarthik As Balu In Aadi Saikumar’s Supernatural Thriller Shambala
ఆది సాయికుమార్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల’ చిత్రంలో బాలుగా కనిపించనున్న శివకార్తీక్
Talented hero Aadi Saikumar is set to captivate audiences in Shambala: A Mystical World, an ambitious fantasy thriller directed by Ugandhar Muni. Backed by producers Rajasekhar Annabhimoju and Mahidhar Reddy under the banner of Shining Pictures, the film is being crafted on a massive scale with a substantial budget, and promotional activities are already in full swing.
The buzz around Shambala is steadily intensifying, with each new promotional reveal sparking greater curiosity. In particular, the recently released making video has left a strong impression, hinting at the film’s scale and immersive storytelling.
Joining Aadi is a stellar ensemble cast featuring Archana Iyer, Swasika, Ravi Varma, and Madhunandan in pivotal roles. The makers have now introduced Shivakarthik as Balu, a character shrouded in mystery. His character poster reveals him holding a flambeau, his intense gaze and enigmatic aura enhanced by the eerie presence of a scarecrow in the background.
Aadi plays a geo-scientist on a mystical journey that transcends time. Shambala unfolds across three distinct timelines of 1980, 1,000 years ago, and a staggering 10,000 years in the past, seamlessly blending mythology, ancient history, and supernatural elements.
With visually stunning VFX and an intriguing narrative that spans millennia, Shambala is already making waves. The makers are expected to announce the release date soon.
ఆది సాయికుమార్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల’ చిత్రంలో బాలుగా కనిపించనున్న శివకార్తీక్
యంగ్ హీరో ఆది సాయికుమార్ ప్రస్తుతం డిఫరెంట్ జానర్‌లు, విభిన్న కథలతో ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే యుగంధర్ ముని దర్శకత్వంలో ఫాంటసీ థ్రిల్లర్ ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’ మూవీని చేస్తున్నారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డిలు ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్ ఇలా అన్నీ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించ్చాయి.
‘శంబాల’ ప్రపంచాన్ని చూపించేలా రీసెంట్‌గా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోతో సినిమా స్థాయి ఏంటన్నది అందరికీ అర్థమైంది. ఈ చిత్రంలో ఆదితో పాటు అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్ వంటి వారు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇక ఇప్పుడు శివకార్తీక్‌ని బాలుగా ప్రేక్షకులకు పరిచయం చేశారు. బాలు కారెక్టర్‌లో మిస్టరీ ఉంటుంది. అతని క్యారెక్టర్ పోస్టర్‌ను చూస్తేనే ఆ విషయం తెలుస్తోంది. అతని వింత చూపులు, చుట్టూ ఉన్న వాతావరణం, పోస్టర్‌లో ఉన్న ఆ దిష్టిబొమ్మ ఇలా అన్నీ గమనిస్తుంటే.. ఆ పాత్రలోనే ఓ మిస్టరీ ఉన్నట్టుగా అనిపిస్తుం
ఆది ఈ చిత్రంలో భౌగోళిక శాస్త్రవేత్తగా నటిస్తున్నారు. వేల ఏళ్ల వెనక్కి ఆడియెన్స్‌ను తీసుకెళ్లేలా ఈ ‘శంబాల’ ఉంటుంది. పురాణాలు, పురాతన చరిత్ర, అతీంద్రియ అంశాలను ఇందులో చూపించబోతోన్నారు. అద్భుతమైన వీఎఫ్ఎక్స్‌తో అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా సినిమాను రూపొందిస్తున్నారు. త్వరలోనే మేకర్స్ విడుదల తేదీని ప్రకటించనున్నారు.