pizza

“Science is limited… our scriptures are infinite” - An intriguing Shambala trailer
"సైన్స్ మితం.. శాస్త్రం అనంతం"... ఆసక్తికరంగా 'శంబాల'

You are at idlebrain.com > news today >

1 November 2025
Hyderabad

Aadi Sai Kumar, who has been waiting since long for a good hit, seems to be coming to the screen with a fresh and unique storyline under the direction of Ungandhar Muni, going by the trailer of Shambala. The plot appears to revolve around a series of mysterious sudden deaths occurring in a village, as the protagonist investigates the reasons behind them. Aadi Sai Kumar plays Vikram, an officer who arrives in the village to uncover the secret behind these deaths.

The dialogue, “They believe Shiva’s command even if it’s just an ant bite… but Vikram is the kind who thinks even death has scientific reasoning,” suggests that the core conflict lies between two opposing belief systems — and their clash might be central to the narrative. Likewise, lines such as “Your science is limited… our scriptures are infinite,” and “Science may have answers to every question… but this is beyond its imagination,” hint at something incomprehensible and layered within the story.

Archana Iyer stars opposite Aadi Sai Kumar as the female lead, while Swasika Vijay plays another key role. Music is composed by Sricharan Pakala. The film is produced by Mahidhar Reddy and Rajashekar under the Shining Pictures banner, with Ungandhar Muni directing. Shambala is slated for release on December 25.

"సైన్స్ మితం.. శాస్త్రం అనంతం"... ఆసక్తికరంగా 'శంబాల'

ట్రైలర్ చాలా కాలం నుండి ఓ మంచి హిట్టు కోసం ఎదురుచూస్తున్న ఆది సాయి కుమార్, ఉంగంధర్ ముని దర్శకత్వంలో ఓ సరికొత్త కథాంశంతో తెరపైకి రాబోతున్నట్టు 'శంబాల' ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఓ గ్రామంలో జరుగుతున్న అకాల మరణాల వెనుక కారణాలను అన్వేషించే క్రమంలో కథ మొత్తం నడుస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ మరణాల వెనుక మర్మాన్ని తెలుసుకునేందుకు ఆ గ్రామానికి వెళ్లిన ఆఫీసర్ విక్రమ్ గా ఆది సాయి కుమార్ కనిపించబోతున్నారు.

"వాళ్లేమో చీమ కుట్టినా శివుడి ఆజ్ఞను నమ్ముతారు.. విక్రమేమో చావులో కూడా సైన్స్ ఉందనే రకం" అన్న డైలాగ్ ట్రైలర్ లో వింటుంటే విరుద్ధ భావాలున్న వ్యక్తుల మధ్య కథ ఎటు వైపు సాగుతుందో అన్నదే సినిమాలో కీలకంగా మారనుందనిపిస్తుంది. "మీరు చెప్తున్న సైన్స్ మితం.. మీరు తెలుసుకోవాల్సిన మా శాస్త్రం అనంతం", "ప్రతి ప్రశ్నకీ సైన్స్ లో సమాధానం ఉంటుందనుకున్నా.. కానీ ఇది సైన్స్ ఊహకే అందనిది" లాంటి ట్రైలర్ లో వస్తున్న సంభాషణలు వింటుంటే అంతుచిక్కని విషయం ఏదో కథలో దాగుందన్న సంగతి అర్థమవుతుంది.

ఆది సాయి కుమార్ సరసన కథానాయికగా అర్చనా అయ్యర్ నటించగా, స్వసికా విజయ్ మరో కీలకపాత్రలో కనిపించబోతున్నారు. శ్రీచరణ్ పాకల ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఉంగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను 'షైనింగ్ పిక్చర్స్' బేనర్ లో నిర్మాతలు మహిధర్ రెడ్డి మరియు రాజశేఖర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved