pizza

“I’ll Make Sure the Runtime of ‘Spirit’ Doesn’t Exceed Three Hours” – Sandeep Reddy Vanga
'స్పిరిట్' సినిమా నిడివి మూడుగంటలు దాటకుండా చూసుకుంటా - సందీప్ రెడ్డి వంగా

You are at idlebrain.com > news today >

7 September 2025
Hyderabad

Sandeep Reddy Vanga is a one-of-a-kind director. Though he has made only a handful of films, he has managed to capture the attention of the entire nation. As everyone knows, his next project is Spirit, featuring pan-India superstar Prabhas. Right from its announcement, the film has generated immense buzz. Even the selection of the heroine created a stir - while Deepika Padukone was initially considered, it was Animal fame Triptii Dimri who was ultimately cast, leading to a media frenzy. When Vanga remarked that there was a conspiracy to leak the story, it sparked a war of words between opposing camps.

Now, a fresh update about Spirit has emerged. During a recent talk show, director Sandeep Reddy Vanga shared some insights with the audience. He had previously revealed to the media that Prabhas would be playing the role of a sincere police officer in the film.

Speaking about Spirit on the talk show, Vanga said:
“Prabhas is a wonderful person. Despite being such a big star, he doesn’t carry even a trace of ego. There are absolutely no filters or barriers between us - our journey is going very smoothly. I couldn’t ask for more from him.”

He also added:
“Spirit shooting is going to commence very soon. Interestingly, 70% of the background score (BGM) has already been composed even before we go to sets. I’ll also make sure the film’s runtime doesn’t exceed three hours.”

'స్పిరిట్' సినిమా నిడివి మూడుగంటలు దాటకుండా చూసుకుంటా - సందీప్ రెడ్డి వంగా

సందీప్ రెడ్డి వంగా, ఓ విలక్షణ దర్శకుడు. తీసినవి తక్కువ సినిమాలే అయినా దేశం మొత్తం ఆయనవైపే చూసేలా చేసుకోగలిగిన సత్తా ఉన్న దర్శకుడు ఆయన. ఆయన తదుపరి చిత్రం 'స్పిరిట్' పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా అనుకున్నప్పటి నుంచీ సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. హీరోయిన్ ఎంపికే ఓ పెద్ద సంచలనం అయిపోయింది. మొదట్లో దీపికా పదుకునే అనుకున్నా ఆమె స్థానంలో 'యానిమల్' ఫేమ్ త్రిప్తి దిమ్రి రావడంతో మీడియాలో ఓ పెద్ద రచ్చే జరిగింది. కుట్రతో కథను లీక్ చేస్తున్నారన్న సందీప్ రెడ్డి మాటతో అప్పట్లో ఇరు వర్గాల మధ్య ఓ పెద్ద యుద్ధమే జరిగినంత పనైంది.

'స్పిరిట్' సినిమాకు సంబంధించి ఓ సరికొత్త అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఇటీవల ఓ టాక్ షోలో మాట్లాడుతూ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఆ విషయాన్ని ప్రేక్షకులతో పంచుకోవడం జరిగింది. ఓ సిన్సియర్ పోలీసాఫీసర్ గా ప్రభాస్ ఈ సినిమాలో కనిపించబోతున్నట్టు గతంలోనే ఓ సందర్భంలో మీడియా ముందు ప్రకటించారు దర్శకుడు సందీప్ రెడ్డి. ఇటీవల ఓ టాక్ షో లో 'స్పిరిట్' గురించి మాట్లాడుతూ... "ప్రభాస్ చాలామంచి వ్యక్తి. పెద్ద హీరోనన్న ఇసుమంత కూడా అహం ఆయనకు లేదు . మా మధ్య ఎటువంటి పరదాలు లేకుండా మా ప్రయాణం నడుస్తుంది. ఆయనను అంతకు మించి ఏమీ అడగలేను. 'స్పిరిట్' షూటింగ్ అతి త్వరలోనే మొదలవ్వబోతుంది. సెట్లోకి వెళ్లకముందే ఈ సినిమాకు 70% BGM సిద్ధం అయిపోయింది" అన్నారు. అంతేకాకుండా 'స్పిరిట్' సినిమా నిడివిని మూడు గంటలు దాటకుండా చూసుకుంటానన్నారు.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved